Brahmamudi June 7th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి దొంగ మాయ ఎస్కేప్- రాజ్‌కు వణికిపోయిన చిత్ర- అనామికకు అత్త చెంపదెబ్బ
Brahmamudi Serial June 7th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 7వ తేది ఎపిసోడ్‌లో దొంగ మాయ చిత్ర ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు బట్టలు సర్దుకుంటుంది. రుద్రాణి వచ్చి అడిగితే వెళ్లిపోతున్నట్లు చెబుతుంది. చిత్రకు వార్నింగ్ ఇచ్చినట్లు కావ్యకు చెబుతాడు రాజ్. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఆ మాయ అసలు మాయ కాదని ఆమె పేరు చిత్ర అని.. డబ్బు కోసమే ఇక్కడికి వచ్చి బిడ్డ తల్లిగా నాటకం ఆడుతుందని నేను తెలుసుకున్నాను అని కావ్యకు రాజ్ చెబుతాడు. దాంతో కావ్య ఆశ్చర్యపోతుంది.
వెళ్లి అదే చెప్పాను. తెల్లారేలోపు ఇంట్లోంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోమ్మని వార్నింగ్ ఇచ్చాను అని రాజ్ అంటాడు. దానికి కావ్య షాక్ అయి చూస్తుంది. మరోవైపు చిత్ర లగేజ్‌లో బట్టలు సర్దుకుంటుంది. అది చూసిన రుద్రాణి బట్టలు ఎందుకు సర్దుకుంటున్నావ్ అని అడుగుతుంది. నేను ఈ ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను అని చిత్ర కోపంగా చెబుతుంది. దాంతో రుద్రాణి షాక్ అవుతుంది.
రాజ్‌కు డౌట్
బ్రహ్మముడి గురువారం ఎపిసోడ్‌లో అసలు మాయ రోడ్డుపై పరుగెడుతుంటే ఆగమని అప్పు, కావ్య వెనుకాల పరుగెత్తుతూ ఉంటారు. ఇంతలో రుద్రాణి వచ్చి కారుతో గుద్దేసి వెళ్లిపోతుంది. దూరంగా వెళ్లి కారు ఆపిన రుద్రాణి.. ఎస్ అనుకుని వెళ్లిపోతుంది. మాయకు బ్లడ్ వస్తుందని అంబులెన్స్‌కు కాల్ చేస్తుంది అప్పు. మరోవైపు కల్యాణం పెట్టుకుని కాకరకాయ అంటుందేంటి కళావతి. నా దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటాడు రాజ్. ఇంతలో ఎదురుగా ఎవరితోనో దొంగ మాయ మాట్లాడటం చూసి కారు ఆపుతాడు.
ఇక్కడికి ఎందుకు వచ్చావ్. నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను అన్నాగా అని చిత్ర అంటుంది. చెల్లి.. నువేంటో నాకు తెలుసు. ఏం లేనప్పుడే నువ్ నా మాట వినేదానివి కాదు. అలాంటిది ఇంత పెద్ద ఇంటికి వచ్చాక వింటావా అని అతను అంటాడు. గంటలో నీ అకౌంట్‌లోకి డబ్బులు పింపిస్తా. ఇక్కడి నుంచి వెళ్లిపో అని దండం పెడుతుంది దొంగ మాయ చిత్ర. అది రాజ్ చూస్తాడు. గంటే టైమ్ బాగా గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు అతను.
రాజ్‌కు తెలిసిన నిజాలు
అసలు వీడెవడు కొత్త క్యారెక్టర్. వీన్ని చూసేందుకు ఆ మాయ ఎందుకు అంతలా భయపడుతుంది. వీన్ని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి అని రాజ్ అనుకుంటాడు. వెళ్లి అతన్ని ఆగమంటాడు రాజ్. కానీ, వాడు రాజ్‌ను భయంతో పారిపోతాడు. కానీ వాన్ని పట్టుకుని ఎందుకు భయపడి పారిపోతున్నావ్. ఆ మాయ నీకెందుకు భయపడుతుంది అని రాజ్ అడుగుతాడు. నాకు ఎవరు తెలియదని అతను అంటే పోలీస్ స్టేషన్‌కు పదా అన్ని నిజాలు తేలుస్తాను అంటాడు రాజ్.
దాంతో నేను చెబుదాను కానీ, ఆ చిత్రకు చెప్పొద్దు సార్. ఆ మాయ అసలు పేరు చిత్ర అని ఏదేదో చెబుతాడు అతను. చిత్ర గురించి అంతా చెప్పాను. కానీ, ఇందులో నన్ను లాగొద్దు సార్ అని వెళ్లిపోతాడు. మాయ మా ఇంటికి వచ్చి ఎంత మాయ చేశావే. చెబుతా నీ సంగతి అని రాజ్ అనుకుంటాడు. కట్ చేస్తే అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది అత్త ధాన్యలక్ష్మీ. గొప్పింటి నుంచి వచ్చావ్. స్వప్నలా తప్పు చేయవు అని అనుకున్నాను. కానీ, ఇంతలా దిగజారుతావని అనుకోలేదు అని ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది.
ధాన్యలక్ష్మీ ఫైర్
అనామిక ఏదో చెప్పబోతుంటే మాట్లాడకు. నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్లు నీ గురించి అందరికి గొప్పగా చెబుతుంటే ఇలా చీప్‌గా దొంగతనం చేస్తావా. కల్యాణ్ మంచి పొజిషన్‌లో ఉండాలని చెబుతుంటే ప్రేమించావ్ కదా అనుకున్నాను. కానీ, ఇంత విషం ఉందనుకోలేదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజంగానే నేను ప్రేమించాను. గొప్ప స్థానంలో ఉండాలని చూశాను అనామిక అంటుంది.
డాడీ బిజినెస్ పోయింది. అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ ఉంటున్నారని మామ్ చెబితే ఏం చేయాలో తెలీక చేశాను అని అనామిక చెప్పుకుంటుంది. నాకు చెబితే పది లక్షలు కాదు పాతిక లక్షలు ఇచ్చేవాన్ని. కష్టాల నుంచి బయటపడేసేదాన్ని. నువ్ చేసిన పని వల్ల నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న కోడలి స్థానాన్ని అవమానించావ్ కదే అని ధాన్యలక్ష్మీ అంటుంది. నేను అడిగితే చీప్‌గా చూస్తారని అడగలేదు అని అనామిక అంటుంది.
సిగ్గులేనట్లుగా అనామిక
ఇప్పుడు అందరిముందు దిగజారిపోయావ్ బాగుందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అదంతా స్వప్న వల్లే అయింది. నా మీద పగబట్టింది అని అనామిక అంటుంది. శత్రువులు ఎప్పుడు అవకాశం ఎదురుచూస్తునే ఉంటారు. అలా అని ఇలా తప్పుడు మార్గాల్లో వెళ్లి చేస్తావా. ఇంకోసారి ఇలా చేస్తే సపోర్ట్ చేయను అని వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. తిడితే తిట్టింది కానీ చెక్ దక్కింది. దీన్ని మామ్‌కు ఎలాగైన పంపించాలి అని సిగ్గులేకుండా ఆనందపడుతుంది అనామిక.
మరోవైపు హాస్పిటల్‌లో మాయకు బ్లడ్ ఎక్కిస్తారు. డాక్టర్ చెక్ చేస్తుంది. దాన్ని చూస్తుంటే చస్తదో బతుకుతదో తెలియట్లేదు అక్క అని అప్పు అంటుంది. దాంతో ఏడుస్తూ కుమిలిపోతుంది కావ్య. మా అత్తగారు ఆ దొంగ మాయకు మా ఆయనకు పెళ్లికి ముహుర్తం పెట్టారు. ఇప్పుడు ఇదే అసలు మాయ అని తెలిస్తే కానీ పెళ్లి జరగదు. మావయ్యకు, ఆయనకు ఈ పెళ్లి జరగదని మాటిచ్చాను అని కావ్య అంటుంది. ఇంతలో డాక్టర్ వస్తే ఎలా ఉందని అడుగుతారు.
నీతిమాలిన ఆడది చిత్ర
బ్లడ్ చాలా పోయింది. కండిషన్ సీరియస్‌గా ఉంది. ఇప్పుడేం చెప్పలేం. స్పృహలోకి టైమ్ పడుతుంది. ఈ రాత్రి గడవాలి అని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్. దాంతో మరింత బాధపడిపోతుంది కావ్య. నీకోసమైన మాయ బతుకుతుంది. నేను ఇక్కడ ఉంటాను. నువ్వెళ్లు అని అప్పు చెబితే తను ఎలా ఉందో గంటగంటకు కాల్ చేసి చెప్పు అని వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు చిత్ర దగ్గరికి రాజ్ వెళ్తాడు. అలాగే చూస్తుంటాడు. అక్కడే ఆగిపోయావ్ లోపలికా రా అంటుంది దొంగ మాయ.
నేను పరాయి ఆడది గదిలోకి రాను అని రాజ్ అంటే.. కానీ, బిడ్డ పుట్టుకొచ్చాడు. ఎంత విచిత్రమో కదా అని మాయ అంటుంది. ఆ విచిత్రం నువ్ క్రియేట్ చేసింది చిత్ర అని రాజ్ అంటాడు. దాంతో చిత్ర షాక్ అవుతుంది. చిత్ర.. అలియాస్ మాయ అని రాజ్ అంటే.. చిత్ర ఎవరు అని మాయ అంటే.. తనకు కానీ బిడ్డను తల్లిగా చెప్పుకునే ఒక ఆడది. నీతిమాలిన, విలువ లేని ఆడది చిత్ర. నువ్ ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చావో అంతా నాకు తెలిసిపోయిందని రాజ్ అంటాడు.
పోలీసులకు అప్పగిస్తాను
మీకు చాలా తెలుసే.. కానీ, నువ్ ఏది రుజువు చేయలేవు అని చిత్ర అంటుంది. అంటే మీ నాన్నపేరు గణపతి అని కూడా రుజువు చేయలేనా అని చిత్ర అంటుంది. గణపతి ఎవరు అని చిత్ర అంటే.. నీకు ఎంత మంది నాన్నలు ఉన్నారు అని రాజ్ అంటాడు. దానికి కోపంగా చిత్ర అరుస్తుంది. షటప్ అని రాజ్ మరింత ఫైర్ అవుతాడు.
నీ తండ్రి నీకంటే పెద్ద ఫ్రాడ్. వాడు పనిచేసే బ్యాంక్ నుంచే కోటి రూపాయలు కొట్టేసి పారిపోయాడు. అప్పటి నుంచి వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ డబ్బు కట్టకపోతే పోలీసులు జైల్లో పెడతారు. ఆ డబ్బు కోసం ఇంటికి వచ్చావ్. నీ ఇంటికి వెళ్తే నీ తండ్రి ఎవరో తెలిసిపోతుంది. నాకు నీ తండ్రిని పట్టుకోవడం క్షణాల్లో పని. వాడిని పోలీసులకు అప్పజెప్పడం మరింత సులువు. అలా చేస్తే నువ్ ఇప్పటిదాకా పడ్డ కష్టం వృథా అవుతుంది. నీ నాటకానికి తెరదించి వచ్చిన చోటుకే మూట ముల్లే సర్దుకుని వెళ్లిపో. రాత్రికి రాత్రే బయలుదేరు. ఈ రాత్రి వరకే నీకు గడువు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రాజ్.
చరిత్రలో నిలిచిపోతారు
దాంతో భయపడిపోయి కుప్పకూలిపోతుంది చిత్ర. లాభం లేదు. అన్ని నిజాలు తెలుసుకున్నాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించిన చిత్ర వెంటనే రుద్రాణికి చెప్పాలి అనుకుంటుంది. కట్ చేస్తే అపర్ణ దగ్గరకి వెళ్లిన స్వప్న మీ పెద్దరికం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనామిక తప్పు చేసిందని అందరికీ తెలుసు. నిన్న గాక మొన్న వచ్చిన అనామికను ధాన్యలక్ష్మీ ఆంటీ అంతలా సపోర్ట్ చేసింది అని స్వప్న అంటుంది.
అది వాళ్ల ఇష్టం. దాంట్లో నీకొచ్చిన నొప్పి ఏంటీ అని అపర్ణ అడుగుతుంది. అనామిక అత్తగా ధాన్యలక్ష్మీ సపోర్ట్ చేశారు. మరి కావ్య అత్తగా మీరేం చేశారు. పైగా నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. మీ కొడుకు చేసిన తప్పుకు నా చెల్లికి సవతిని తెస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. నా చెల్లికి తప్పా. నా చెల్లిని మీరు ఎంతలా అవమానించినా.. మీకు తల్లి స్థానం ఇచ్చి మర్యాదా కాపాడుతు వచ్చింది. దానికి మీరు మంచి బహుమతి ఇచ్చారు అని స్వప్న అంటుంది.
గెలిచేది నేనే
చరిత్రలో నిలిచిపోయే పని చేస్తున్నారు అని చెప్పేసి వెళ్లిపోతుంది స్వప్న. రుద్రాణి బయట ఊయలలో ఉంటుంది. కావ్య వస్తుంది. బయటకు వెళ్లిన పని పూర్తయిందా. అయింటుందిలే. ఏంటా పని అని రుద్రాణి అడుగుతుంది. నేను ఎక్కడ ఏం చేస్తానో అని భయపడి చస్తారు అని కావ్య అంటుంది. ఏం చేసినా నీమీద గెలవడానికేగా అని రుద్రాణి అంటుంది. ఎంతలా దెబ్బ కొట్టాలని చూసిన గెలిచేది నేనే అని కావ్య అంటుంది.
దాంతో నవ్వుతూ కాన్ఫిడెన్స్. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను. నీ మొగుడుతో మాయ పెళ్లి అయ్యాక పోతుంది అని రుద్రాణి అంటుంది. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుందో చూస్తాను అని కావ్య అంటుంది. హాల్లో అంతా చీరలు చూస్తుంటారు. ఇంతలో కావ్య వస్తుంది. చీరలు చూసి కావ్య షాక్ అవుతుంది.
టాపిక్