Brahmamudi May 31st Episode: బ్రహ్మముడి- కావ్య చెంప చెల్లుమనిపించిన అమ్మమ్మ- అపర్ణపై అత్త ఆగ్రహం- దొరికేసిన అసలు మాయ!-brahmamudi serial 31st episode indiradevi slaps kavya appu mission to find original maya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 31st Episode: బ్రహ్మముడి- కావ్య చెంప చెల్లుమనిపించిన అమ్మమ్మ- అపర్ణపై అత్త ఆగ్రహం- దొరికేసిన అసలు మాయ!

Brahmamudi May 31st Episode: బ్రహ్మముడి- కావ్య చెంప చెల్లుమనిపించిన అమ్మమ్మ- అపర్ణపై అత్త ఆగ్రహం- దొరికేసిన అసలు మాయ!

Sanjiv Kumar HT Telugu
May 31, 2024 07:43 AM IST

Brahmamudi Serial May 31st Episode: బ్రహ్మముడి సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌లో కావ్య చెంపను చెల్లుమనిపిస్తుంది అమ్మమ్మ ఇందిరాదేవి. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత అపర్ణపై విరుచుకుపడుతుంది. నోర్మూయ్ నిన్ను చూస్తే కంపరంగా ఉందని అంటుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 31వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మాయగా వచ్చిన చిత్రతో రాజ్ పెళ్లికి కావ్య ఒప్పుకుంటుంది. నో ఆబ్జెక్షన్ పేపర్స్‌పై సంతకం చేస్తుంది. అయినా కూడా కావ్యను అసహ్యించుకుంటూ మాట్లాడుతుంది అపర్ణ. నువ్ కేవలం డబ్బు కోసమే ఇంట్లో ఉంటున్నావ్, నీకు భర్త, ఎవరు ఏమై పోయినా పర్లేదు అని నానా మాటలు అంటుంది. నీకు ఏ బంధాలు అక్కర్లేదు అందుకే సంతకం చేశావ్ అని మండిపడుతుంది అపర్ణ.

కావ్యను కొట్టిన ఇందిరాదేవి

ఇంతలో బాగా చెప్పావ్ అని ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. నీ భర్తకు మరో పెళ్లి చేసిన పర్వాలేదని సంతకం చేశావా అని వచ్చి కావ్య చెంపపై కొడుతుంది ఇందిరాదేవి. దానికి అంతా షాక్ అవుతారు. ఆ సంతకం చేసి ఏం సాధించావ్. నీ బతుకు ధారపోసినందుకు ఏ కిరిటం పెట్టింది నీ అత్త. ఎవరి కోసం చేశావ్ ఈ త్యాగం. ఎందుకు చేశావ్ ఈ సాహసం ఛీ.. నువ్ అన్ని తెలిసినదానివి అనుకున్నాను. కానీ, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునే పిచ్చిదానివని ఇప్పుడే తెలిసింది అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.

నీ కాపురం నిలబడెందుకు నేను కోరుకున్న రోజు లేదు. ఈ గొర్రెలమందలో ఒక్కరైనా నీకోసం అండగా నిలబడ్డారా. నీ భర్త కూడా ఆ గొర్రెల మందలోనే ఉన్నాడు. నువ్ సంతకం చేయకుండా నిన్ను ఆపగలిగాడా. తండ్రి స్థానంలో తండ్రిగా నిలబడ్డా నీ మామ భార్య మాటకు ఎదురు చెప్పలేక అసమర్థుడిగా నిలబడ్డాడే. చూస్తూ చూస్తూ ఒక ఆడది సవతిని తెచ్చుకుంటుందా. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్లు ఉన్నారే ఒక్కరూ కూడా ఆపలేరా.. ఎందుకే ఇలా చేశావ్. ఎందుకే ఇంకా ఇంకా ఎన్ని కష్టాలు అనుభవించాలని సంతకం చేశావ్ అని ఇందిరాదేవి కోప్పడుతుంది.

కల్యాణ్‌పై ఎందుకు కోప్పడ్డావ్

అత్తయ్య.. కావ్య సంతకం పెడితేనే కదా ఈ సమస్యకు పరిష్కారం దొరికేది అని అపర్ణ అంటుంది. ఛీ నోర్మూయ్ అని ఇందిరాదేవి అసహ్యించుకుంటుంది. దానికి అపర్ణ షాక్ అవుతుంది. నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. పెద్ద కోడలిగా అధికారం ఇచ్చాను కదా అని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటావా. భార్యని భర్తని విడదీయడమే సరైనా పరిష్కారం అంటే.. అన్ని తప్పులు చేసిన అనామికను కల్యాణ్‌ వదిలేస్తానంటే ఎందుకు కోప్పడ్డావ్ చెప్పు అని ఇందిరాదేవి నిలదీస్తుంది.

అన్ని నేరాలు చేసిన రాహుల్‌ను వదిలేయమని ఎందుకు స్వప్నకు చెప్పలేదు. ఏం ధాన్యలక్ష్మీ నువ్వు సాటి ఆడదానివే కదా. నీ కోడలి కోసం ఎన్నో గొడవలు సృష్టించావ్. మరి ఈ రోజు నీ కోడలి లాంటిదే కదా కావ్య. అపర్ణను ఎందుకు అడ్డుకోలేకపోయావ్. కావ్యను ఎందుకు ఆపలేదు అని నిలదీస్తుంది ఇందిరాదేవి. అత్తయ్య గారు నేను చెప్పేది అని అపర్ణ అంటుంటే.. వినను. ఇప్పుడే కాదు.. ఎప్పుడు వినను. నువ్ ఆ అర్హతను పోగొట్టుకున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది.

నేను క్షమించను

కావ్యకు ఏ అండ లేదని ఇంత పెద్ద శిక్షవేశావ్. ఏదో ఒక రోజు దేవత లాంటి నీ కోడలికి ఇంత పెద్ద శిక్ష వేసినందుకు నీలో నువ్వే పశ్చాత్తాపంతో కుమిలిపోతావ్. ఆరోజు నీ కోడలు నిన్ను క్షమించినా.. నీ అత్తగా నేను క్షమించను అని వెళ్లిపోతుంది ఇందిరాదేవి. రాజ్ మొహం చూస్తుంది కావ్య. చిత్ర, రుద్రాణి మాత్రం ప్లాన్ సక్సెస్ అన్నట్లుగా నవ్వుకుంటారు. కట్ చేస్తే కావ్య ఒంటరిగా కూర్చుని బాధపడుతుంది. కల్యాణ్ వస్తాడు.

అయ్యో.. ఏంటీ వదినా అశోకవనంలో కూర్చున్నారు. లంకలో అందరూ రాక్షసులు ఉన్నారనా. రేపు అన్నయ్యకు పెళ్లి అయితే ఆ గదిలో మీరుండరు కదా. మాయే ఉంటుంది కదా. రేపటి నుంచి ఎలాగు మీ స్థానం ఇదేనని ఇప్పటినుంచే ఉంటున్నారా. కంగ్రాట్స్ వదినా మీ కాపురాన్ని మీరే ముక్కలు చేసుకున్నందుకు. ఇన్నాళ్లు మీ తెలివితేటల మీద గొప్ప నమ్మకం ఉండేది. కానీ, నా అంచనాలను మించి ఉన్నాయి. మీరు సంతకం చేయడం చూసి మిమ్మల్ని కొనియాడాలని ఉంది అని కల్యాణ్ అంటుంటే కావ్య వెళ్లిపోతుంది.

భర్తనే పంచారు

ఏ వినలేకపోతున్నారా వదినా. నిష్టూరం ధ్వనిస్తోందా. మీ భవిష్యత్తు గురించి దెప్పి పొడుస్తుంటే కోపం వచ్చిందా. మీరు ఈ ఇంట్లో ఏం సాధించారు. మీకు ఏం దక్కింది. కనీసం అన్నయ్య భార్యగా హక్కు కూడా పొందలేకపోయారు. ఇప్పుడు ఏంటీ పెళ్లి కాకముందే తల్లి అయిన ఆ పవిత్రమూర్తి ఇంటి కోడలిగా చెలామణి అవుతుంటే మిమ్మల్ని వంటింటికే పరిమితి చేస్తుంది. భర్తకు ప్రేమను పంచాలి కానీ, మీరు భర్తనే పంచారు అని కల్యాణ్ మాట్లాడుతాడు.

నా భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోయే నలుగురిలో మీరు ముందున్నారు. కానీ ఒక్క విషయం నా జీవితం గురించి మీరే ఇంతలా ఆలోచిస్తున్నారే.. మరి నేను ఎంతలా ఆలోచించాలి. ఇంకా సమయం మిగిలే ఉంది కదా అని వెళ్లిపోతుంది కావ్య. కల్యాణ్ తనపై నమ్మకం ఉన్నట్లుగా నవ్వుతుంటాడు. మరోవైపు కంగ్రాట్స్ అని రుద్రాణికి చెబుతాడు రాహుల్. ఇంకా ముఖ్యమైన ఘట్టం ముందుంది కదా. పెళ్లి జరిగితేనా కదా నాకు అసలైన ఆనందం మొదలు అవుతుంది అని రుద్రాణి అంటుంది.

వాడికి ఒక క్యారెక్టర్ ఉంది

మీ ప్లానింగ్ మీకుంది. కానీ, నాక్కూడా ఎక్కడో ఒక భయం ఉంది. నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. మీ మాట నమ్మి వచ్చాను. ఏదో ఒక రోజు నిజం తెలిసి నన్ను వదిలేస్తే అని మాయ అంటుంది. వాడికి ఇది ఫస్ట్ పెళ్లా. ఇంతకుముందు పెళ్లి కూడా వాడికి నచ్చలేదు. కానీ, విడాకులు ఇవ్వలేదు. రాజ్ నాకు నచ్చడు. కానీ, వాడికి ఒక క్యారెక్టర్ ఉంది. ఇతరులను బాధపెట్టడు అని రాహుల్ అంటాడు. అయితే సంతోషంగా ఉండొచ్చు అని మాయ అంటుంది.

ఈ ఇంట్లో నీకు ఎవరితో సమస్య రాదు. వస్తే గిస్తే నాతోనే వస్తుంది. ఆ కావ్యను కూడా తప్పనిసరిలో ఇరికించి పెళ్లి చేశాను. మిడిల్ క్లాస్ అమ్మాయి కదా. చెప్పినట్లు వింటుంది అనుకున్నాను. అందుకే నిన్ను రప్పించాను. అది అమాయకురాలు కాబట్టి ఇంట్లోంచి పంపిస్తున్నాను. నేను ప్లాన్ చేస్తే వచ్చావ్ కాబట్టి తోక జాడిస్తే పైకి పంపిస్తాను అని రుద్రాణి అంటుంది. ఛీ ఛీ నేను మీకు నచ్చినట్లే ఉంటాను అని మాయ అంటుంది.

పెళ్లికు ఎందుకు ఒప్పుకున్నావ్

ఆ కావ్య ఏంటీ అలా సంతకం చేసింది అని రాహుల్ అంటే.. దానికి ఇంకోదారి లేకుండా చేశాం అని రుద్రాణి అంటుంది. లేదు కావ్య ఏదో ప్లాన్‌లో ఉందని రాహుల్ అంటాడు. అది ఎన్ని ప్లాన్స్ వేసినా మనం అనుకున్నది జరగకుండా ఆపలేదు అని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య, రాజ్, సుభాష్ మాట్లాడుకుంటారు. ప్రతిసారి ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలారా. నువ్వెందుకు పెళ్లికి ఒప్పుకున్నావ్ అని సుభాష్ అంటాడు.

అందరిదృష్టిలో ఆ బిడ్డకు తండ్రి నేను. మామ్ న్యాయంగానే ఆలోచించింది అని రాజ్ అంటాడు. ఏంటీ న్యాయం ఓ మోసగత్తెతో తాళి కట్టించడమా. మీ అమ్మకు తెలియని నిజానికి కావ్య జీవితం నాశనం చేయడం కరెక్టా అని సుభాష్ నిలదీస్తాడు. విడాకులు తీసుకోనని ధైర్యంగా చెప్పినదానివి దీనికి ఎలా ఒప్పుకున్నావ్. ఒప్పుకోకుంటే మనకు సమయం ఉండేది అని రాజ్ అంటాడు. మీరెందుకు గొడవ పడతారు. దీనికి నేను కారణం. ఇక చాలు నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అని సుభాష్ అంటాడు.

నాకు సవతిని తెచ్చుకుంటానా

అంతా సులువుగా చెప్పేది అయితే.. బాబును తీసుకొచ్చిన రోజే చెప్పేవారే అని రాజ్ అంటాడు. కానీ, ఈ పెళ్లి ఎలా ఆపుతామని సుభాష్ అంటే.. ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. నీకు ఆ నమ్మకం ఉంటే చాలు అని సుభాష్ వెళ్లిపోతాడు. నాకు నమ్మకం లేదు. ఒకటకి రెండు చేస్తావ్. మళ్లీ ఏ మాయనో ఛాయనో తీసుకొస్తావ్ అని రాజ్ అంటాడు. చూస్తూ చూస్తూ నాకు సవతిని తెచ్చిపెట్టుకుంటానా. మీకు పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా అని కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు అసలు మాయ కోసం అప్పు వెతుకుంటుంది. ఇదే ఆ మాయ ఇల్లు. చుట్టు ఉన్నవాళ్లను అడగాలి. కానీ ఆ మాయ ఎలా ఉంటుందో తెలియదు అని అప్పు అనుకుంటుంది. చుట్టూ పక్కలవాళ్లను అడుగుతుంది అప్పు. ఎవరు తెలియదంటారు. అలసిపోయి ఓ షాప్‌లో వాటర్ బాటిల్ తీసుకుంటుంది అప్పు. బాటిల్ ఇచ్చిన ఆవిడ ఏంటమ్మా అటు ఇటు తిరుగుతున్నావా అని షాప్ ఆమె అంటుంది. ఇద్దరూ సరదాగా మాటలు అనుకుంటారు.

దొరికేసిన మాయ అడ్రస్

ఆ ఇంట్లో మాయ అని నా ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు అని అప్పు అంటే లేదు కదా. వేరే అడ్రస్‌లో ఉంటుంది కదా అని అసలు మాయ ఉండే అడ్రస్ చెబుతుంది షాప్ ఆమె. దాంతో థ్యాంక్స్ చెప్పి సంతోషంతో వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు ఇందిరాదేవి ఆలోచిస్తుంటుంది. కావ్య వచ్చి కాఫీ ఇస్తుంది. అక్కర్లేదు.. నచ్చలేదు. నచ్చంది కాఫీ కాదు. ఆ అలవాటు. ఇప్పుడు నువ్ చేస్తున్న పనులవల్ల నువ్ ఇంట్లో ఉంటావన్న నమ్మకం పోయింది. ఏదో ఒక రోజు నీ దారి చూసుకుంటావని అర్థమవుతోంది అని ఇందిరాదేవి అంటుంది.

ఇన్నాల్లు చెడు వ్యసనాలు అతిగా తిరగడం అనుకున్నాను. కానీ, ఒకరిని చాలా నమ్మడం కూడా అని ఇందిరాదేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య ఓడిపోయిందని తన ముందే దెప్పి పొడుస్తుంది రుద్రాణి. చెప్పినంత ఈజీ కాదు నాతో గెలవడం అని రుద్రాణి అంటుంది. మరోవైపు మాయ ఇంటికి అప్పు వెళ్తుంది. వెళ్లి డోర్ కొడుతుంది. ఎవరో తలుపు తీస్తే అప్పు చూస్తుంది. కట్ చేస్తే కావ్యకు కాల్ చేసి ఆ ఒరిజినల్ మాయ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాను అని చెబుతుంది.

Whats_app_banner