Brahmamudi May 24th Episode: బ్రహ్మముడి.. రాజ్‌తో మాయ పెళ్లి.. కావ్యను అవమానించిన అపర్ణ.. సుభాష్‌కు కొత్త కోడలు ఝలక్
Brahmamudi Serial May 24th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 24వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌తో మాయకు పెళ్లి చేసేందుకు అపర్ణ అనుకుంటున్నట్లు కల్యాణ్‌తో అనామిక, కావ్యతో స్వప్న, సుభాష్‌తో చిత్ర చెబుతారు. తర్వాత సుభాష్‌కు పెద్ద ఝలక్ ఇస్తుంది చిత్ర. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో బెడ్ రూమ్‌లో అనామిక ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో కల్యాణ్ వస్తే.. మీ వదిన గురించి చెబితే ఏమో అనుకున్నా కానీ, మాములు తెలివైంది కాదు. అమ్మో ఆమె తెలివి తేటలను అంచనా వేయలేం అని అనామిక అంటుంది. కల్యాణ్ చూస్తూ ఉంటాడు. బిడ్డ తల్లిని తీసుకొచ్చింది. అసలు అలా ఎవరు ధైర్యం చేయలేరు. దాన్ని బట్టే తెలుస్తుంది కావ్య ఎంత తెలివైందో అని. నేను అయితే అలా చేయలేను అని అనామిక అంటుంది.
న్యాయం చేయాలంటే పెళ్లి చేయాలి
నీకు కావ్య వదినకు జరిగిన నష్టం గురించే ఎక్కువ సంతోషం ఉన్నట్లు ఉంది అని కల్యాణ్ అంటాడు. బిడ్డ తల్లి వచ్చింది. ఇక ఇంట్లోంచి కావ్య వెళ్లిపోతుంది అని అనామిక అంటుంది. వదినా ఇంట్లోంచి వెళ్లిపోతుందని ఎవరు చెప్పారు అని కల్యాణ్ అంటాడు. ఎవరు చెప్పడమేంటి. చూస్తుంటే తెలుస్తోంది కదా. బిడ్డ తల్లి మాయ వచ్చింది. ఆమెకు న్యాయం చేయాలంటే పెళ్లి చేయాలి. రాజ్ బావకు ఇచ్చి పెళ్లి చేసిన మరుక్షణం కావ్య స్థానం ఏమవుతుంది. కోడలి స్థానం పక్కనపెట్టు. అసలు ఇంట్లో ఉండే స్థానం ఉంటుందా అని అనామిక అంటుంది.
అలా ఎప్పటికీ జరగదు. అలా జరుగుతుంటే అందరూ చూస్తూ ఊరుకోరు. మీ పెద్దమ్మ పెళ్లి చేయాలని చూస్తుంది. అడ్డు చెప్పేవారు అయితే ఇంట్లోకి రాగానే చెప్పేవారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఎందుకు అంటారు అనేసి వెళ్లిపోతుంది అనామిక. దాంతో ఆలోచనలో పడిపోతాడు కల్యాణ్. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీళ్లేదు. ఎలాగైనా వదినకు సహాయం చేయాలి అని కల్యాణ్ అనుకుంటాడు. జరిగిందంతా సుభాష్ ఆలోచిస్తుంటాడు.
బయటకు పంపించాలి
బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి చేయాలన్న అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటాడు సుభాష్. ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. అపర్ణ అనుకున్నట్లు పెళ్లి చేయాలనుకుంటే కావ్య కూడా ఏం చేయలేదు. ఆ దారుణం జరక్కముందే నేను ఏదో ఒకటి చేయాలి. మాయ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టి నాటకం ఆడుతున్న మనిషిని బయటకు పంపించేయాలి అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు కావ్యను పిలిచి తిడుతుంది స్వప్న.
ఆలోచిస్తే ఇలా చేయవు. సవతిని తెచ్చి ఇంట్లో ఎవతైనా పెట్టుకుంటుందా. నీకేం నష్టం జరగబొతుందా నీకు అర్థమవుతుందా అని స్వప్న అంటుంది. మా ఆయన నాకు దూరం అవుతాడు అంతే కదా అని కావ్య అంటుంది. అంత సింపుల్‌గా ఎలా అంటున్నావ్. నీ మొగుడుతో కలిసి ఉండేందుకు ఎంత కష్టపడ్డావ్. ఎంతమందిని ఎదిరించావ్. నీ మొగుడే బయటకు పంపినా. ఆఖరికి వర్షంలో నిలబడి పోరాడి మరి ఇంట్లోకి వచ్చావ్. అలాంటిది ఈరోజు నీకు నువ్వే బయటకు వెళ్లాలనుకుంటున్నావా అని స్వప్న అంటుంది.
స్వప్న ప్రశ్నలు
ఇంకోసారి నేను ఇంటి గడప దాటి వెళ్లడం అంటూ జరిగితే అది నా ప్రాణం పోయిన తర్వాతే అని కావ్య చెబుతుంది. మరి ఈమెను ఎందుకు తీసుకొచ్చావ్ అని స్వప్న అడుగుతుంది. అక్కా.. నీకు ఎలా చెబితే అర్థమవుతోంది. ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తున్నావ్ కదా. మా అత్తను ఆపడానికి వేరే దారిలేదు అని కావ్య అంటుంది. సరే మరి నీ సంగతి ఏంటీ. ఇప్పుడు రాజ్‌తో మాయ పెళ్లి చేయాలని మీ అత్త చేస్తే ఏం చేస్తావ్. విడాకులు ఇవ్వాలని చూస్తే ఏం చేస్తావ్ అని స్వప్న ప్రశ్నలు వేస్తుంది.
తెలీదు. నాకు ఇప్పుడు ఏం తెలియదు అని కావ్య అరుస్తుంది. కానీ, మీ అత్త నిన్ను ఓడిస్తుంది అని స్వప్న అంటే.. తను ఎప్పుడు నన్ను ఓడించాలనుకోలేదు. మా ఆయనను గెలిపించాలనుకుంది. నేను అర్థమైనరోజు ఈ ఇంట్లో అందరికంటే గొప్పగా చూసుకునే మనిషి తనే అవుతుంది. తనే నాకు అండగా నిలబడుతుంది. ఆ నమ్మకం నాకుంది. అలా జరగాలంటే ముందు ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చాలి. అది నేను చూసుకుంటాను. అంతవరకు నా విషయంగా ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకు అని కావ్య వెళ్లిపోతుంది.
సుభాష్‌కు ఝలక్
భరించే ఓపిక నీకుందేమో నాకు లేదు. నీ జోలికి వస్తే ఎవరిని లెక్క చేయను. అది మీ అత్త అయినా ఇంకెవరైనా. లాగి ఒకటి పీకుతాను అని స్వప్న అనుకుంటుంది. కట్ చేస్తే మాయ సుభాష్ కలుస్తారు. ఏంటీ మామయ్య గారు నాతో ఏదో మాట్లాడలని చెప్పి సైలెంట్‌గా ఉన్నారు.. హో.. మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికి వచ్చాననా అని చిత్ర అంటుంది. దాంతో సుభాష్ కోపంగా చూడటంతో షాక్ అయిన చిత్ర.. అబ్బో ఇదంతా కోపమే.. అయినా నా మీద మీరు కోపం చూపించలేరు లెండి. మీ పరిస్థితి అలాంటిది అని చిత్ర అంటుంది.
నాకు నీలా అడ్డదిడ్డంగా మాట్లాడటం రాదు. నేరుగా అడుగుతున్నాను. నువ్ డబ్బు కోసమే వచ్చావని తెలుసు. ఎంత కావాలి. నువ్ ఎంత అడిగితే అంత ఇస్తాను. నీ దారిన నువ్వు వెళ్లిపో అని సుభాష్ అడుగుతాడు. మరి మీ భార్యకు ఏం చెబుతారు అని చిత్ర అడిగితే.. తనకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీ దారిన నువ్వు వెళ్లు. నేను చూసుకుంటాను అని సుభాష్ అంటాడు. మీ తెలివితేటలు అమోఘం. నాకు డబ్బు ఇచ్చి సైలెంట్‌గా పంపించి ఇది మోసగత్తే. అందుకే డబ్బులు తీసుకుంది అని చెప్పి వెనక్కి తీసుకుంటారు కదూ అని చిత్ర అంటుంది.
మహారాణిలా బతికే అవకాశం
లేదు లేదు. అలా నేను ఎప్పటికీ చేయను. నాది మాట అంటే మాటే అని సుభాష్ అంటాడు. మరి మీ భార్య ఉండగా అక్రమసంబంధం పెట్టుకుని బిడ్డను కన్నారు కదా. మీ భార్యకు తాళి కట్టేటప్పుడు మాట ఇచ్చుంటారు. ఆ మాట సంగతేంటీ. మీ డబ్బున్న వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అందిందే జుట్టు లేకుంటే కాళ్లు. అయినా ఇంత పెద్ద కుటుంబంలో మహారాణిలా బతికే అవకాశం ఉండగా మీరిచ్చి చిల్లరికి ఎవరైనా ఆశపడతారా అని చిత్ర అంటుంది.
దాంతో షాక్ అయిన సుభాష్ అంటే ఇంట్లోనే ఎప్పటికీ ఉండాలనుకుంటున్నావా. అది ఎప్పుడు జరగదు. నా ప్రాణం ఉండగా అది జరగదు అని సుభాష్ అంటాడు. మీ భార్య ఉన్నారు కదా. ఇప్పుడు నా విషయంలో మీ భార్య గట్టిగా నమ్ముతున్నారు. మా ఇద్దరికీ పెళ్లి చేసి అఫీషియల్‌గా కోడలిని చేస్తారు. అప్పుడు నేను అనుకుంది జరుగుతుంది కదా. అయ్యయ్యో ఇంత ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ఇది మీరు అందరికీ చెబితే ఎలా అని భయపడినట్లు చిత్ర నటిస్తుంది.
కావ్యకు న్యాయం చేసేలా
ఛ.. ఛ.. అలా ఎప్పటికీ చేయరు. నా నిజం బయటకు వస్తే మీ చీకటి కోణం వెలుగులోకి వస్తుంది. మీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఒక చిన్న తప్పు ఇంతకాలం కాపాడుకున్న పరువు పోయేలా ఉంది. నాలాంటి సాధారణ మనిషిని గొప్పగా బతికేలా చేస్తుంది. ఆడదాన్ని కదా. ఆశలు అవసరాలు చాలానే ఉంటాయి. వెళ్లొస్తాను మావయ్య గారు.. నేను తేల్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అని వెళ్లిపోతుంది చిత్ర. మరోవైపు కావ్య గురించి ఇందిరాదేవి దంపతులు ఆలోచిస్తుంటారు.
కావ్య పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అని సీతారామయ్య అంటే.. మాయను తీసుకురావడానికి కారణం మన మనవడు కదా. దానికి కావ్యకు శిక్ష వేయడం కరెక్ట్ కాదు అని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు ఎవరికీ న్యాయం చేసిన ఇంకొకరికి అన్యాయమే అని సీతారామయ్య అంటాడు. నాది స్వార్థమే అనుకో. నాకు మాత్రం కావ్యకు న్యాయం చేయాలని ఉంది. నేనేంటి పక్షపాతంగా మాట్లాడుతున్న అనుకుంటున్నావా అని ఇందిరాదేవి అంటుంది.
రాజ్ చెప్పుంటాడు
నీకున్న కనువిప్పు నాకు లేదని బాధపడుతున్నా. నాకు కావ్యకు న్యాయం చేయాలని ఉన్నా ధైర్యంగా చెప్పలేకపోతున్నా అని సీతారామయ్య అంటాడు. మనం కావ్య పుట్టింటివాళ్లకు అండగా ఉంటామని మాటిచ్చాం. ఎవరు ఏమనుకున్నా మనం కావ్య వైపే నిలబడుదాం. తనకే న్యాయం జరిగిలా ప్రయత్నిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. నా మనసులో మాటను చెప్పావ్. తప్పకుండా అలాగే చేద్దాం అని సీతారామయ్య అంటాడు.
హాల్లో అంతా ఉంటారు. కిచెన్‌లో ఎందుకు అంతా కష్టపడుతున్నావ్ చెల్లి.. నేను చేశాను కదా అని చిత్ర అంటే.. నువ్విచ్చినా ఎవరు తీసుకోరు అని కావ్య అంటుంది. అలాగా అని కాఫీ ఇచ్చేందుకు వెళ్తుంది చిత్ర. ఇంట్లో ఒక్కొక్కరికి టంగ్ టేస్ట్ ఉందని రుద్రాణి అంటే.. ఎవరెవరికీ ఏం కావాలో చెబుతంది చిత్ర. ఇవన్నీ నీకెలా తెలుసు అని ధాన్యలక్ష్మీ అంటే.. రాజ్ చెప్పుంటాడు అని రుద్రాణి అంటుంది. తర్వాత అందరికీ ఏది కావాలో అది ఇస్తుంది చిత్ర.
చిత్ర కాఫీ తీసుకున్న అపర్ణ
స్వప్నకు ఇస్తే తాగను అంటుంది. నువ్ నాకు నచ్చలేదు. మా ఆయనకు ఇవ్వు. సిగ్గు శరం లేకుండా తాగుతాడు అని స్వప్న అంటుంది. తర్వాత ఇందిరాదేవికి కాఫీ ఇస్తే వద్దంటుంది. నాకు మా కావ్య ఇచ్చిన కాఫీనే నచ్చుతుంది అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత అపర్ణకు చిత్ర కాఫీ ఇస్తుంది. ఇంతలో కావ్య కూడా తెచ్చి ఇస్తుంది. కానీ, చిత్ర తెచ్చిన కాఫీ తీసుకుని కావ్యను అవమానిస్తుంది అపర్ణ. దాంతో కావ్య షాక్ అవుతుంది.
చూశావా అమ్మ వదినా కూడా తీసుకుంది. పాపం మాయ ఉదయాన్నే లేచి ఎవరెవరికీ ఏం కావాలో తెస్తే మాయను ఎందుకు బాధపెడతావ్ అని రుద్రాణి అంటుంది. బాధ గురించి నువ్వే చెప్పాలి. ఒక్కరోజే మాయ తెస్తే అంటున్నావ్. సంవత్సరం పాటు కావ్య చేసిన పనిని మెచ్చుకున్నారా. పైగా ఏదో ఒక వంక పెట్టి నిందించారని చెప్పిన ఇందిరాదేవి కావ్య కాఫీ తీసుకుంటుంది. నేను మీకు నచ్చినట్లు లేను అమ్మమ్మగారు మీకు నచ్చేలా మారుతాను అని చిత్ర అంటుంది.
కావ్యను తోసేసి
నీకు మారే అలవాటు ఉందేమే కానీ నాకు లేదు అని ఇందిరాదేవి అంటుంది. నువ్ మా అత్తకు బాగా నచ్చుతావ్. మీ ఇద్దరికి బాగా దగ్గరి పోలికలు ఉన్నాయి అని స్వప్న అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య అందరికీ డిన్నర్ పెడుతుంటే.. చిత్ర వచ్చి కూడా వడ్డిస్తుంది. ఎవరెవరికీ ఏది ఇష్టమో తెలుసని.. రాజ్‌కు పెసరట్టు ఉప్మా అని చెబుతుంది. ఇంతలో రాజ్ వస్తే.. కావ్యను పక్కకు తోసి కూర్చోమని చెబుతుంది.
టాపిక్