Brahmamudi May 10th Episode: బ్రహ్మముడి- రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య- మాటిచ్చిన కళావతి- తల్లీ కొడుకును చితకబాదిన స్వప్న-brahmamudi serial 10th episode kavya consoles raj swapna beats rudrani rahul anamika emotional brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 10th Episode: బ్రహ్మముడి- రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య- మాటిచ్చిన కళావతి- తల్లీ కొడుకును చితకబాదిన స్వప్న

Brahmamudi May 10th Episode: బ్రహ్మముడి- రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య- మాటిచ్చిన కళావతి- తల్లీ కొడుకును చితకబాదిన స్వప్న

Sanjiv Kumar HT Telugu
May 10, 2024 07:29 AM IST

Brahmamudi Serial May 10th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 10వ తేది ఎపిసోడ్‌లో రాజ్ కన్నీళ్లు తుడిచి ఓదారుస్తుంది కావ్య. అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా తాను ఆపుతానని భర్తకు మాట ఇస్తుంది కావ్య. మరోవైపు దెయ్యం పూనినట్లు చేస్తుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 10వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 10వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో బిడ్డ తల్లితో రాజ్ పెళ్లి చేయిస్తానని అపర్ణ అంటుంది. కావ్య మాత్రం ఏం సుఖం పొందింది. ఇష్టం లేని భర్తతో ఎలా ఉంటుంది. మరోదానితో బిడ్డను కని తెచ్చిన వాడితో ఎలా బతుకుతుంది. నేను కావ్యకు అన్యాయం చేయట్లేదు. ఆ దేవుడే ఆమెకు అన్యాయం చేశాడు. ఆమె తల్లి బలవంతంగా పెళ్లి చేసి అన్యాయం చేసింది. ఇప్పుడు నేను కావ్యకు న్యాయం చేస్తాను అని సుభాష్‌తో అపర్ణ చెబుతుంది.

నేను ఉండి లాభం లేదు

కావ్యను రాజ్ జీవితంలో నుంచి పంపించి.. రాజ్ కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయిస్తాను. అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది. బిడ్డకు, బిడ్డ తల్లికి న్యాయం జరుగుతుంది. ఇక కావ్య పరిస్థితి అంటారా. ఆమె కొత్తగా కోల్పోడానికి ఏం లేదు. అత్తగారి ఇల్లు తప్పా. ఆమె భవిష్యత్ కోసం ఎంత ఆస్తి అయినా రాసిద్దాం. ఇలా చేయిద్దామనే రాజ్‌ను అంతలా బలవంతం చేస్తున్నా. అయినా వాడు నోరు విప్పట్లేదు. తల్లిగా వాడు నా మాటకు విలువ ఇవ్వనప్పుడు నేను ఉండి లాభం లేదు అని అపర్ణ అంటుంది.

నా కళ్ల ముందు వాడు నిస్సారమైన జీవితం గడుపుతుంటే చూడలేక వెళ్లిపోతున్నా. నేనేంటి ఇంత స్వార్థంగా ఆలోచించానని చూస్తున్నారా. సాటి ఆడదానికి అన్యాయం చేస్తున్నాని ఆలోచిస్తున్నారా. తల్లిగా తప్పట్లేదు. రేపు ఉదయంలోపు వాడు నిజం చెప్పకపోతే నేను ఇంట్లోంచి వెళ్లిపోతాను అని చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ. అపర్ణ ఇంత పెద్ద తప్పు చేస్తున్నావ్. నీ ప్రాణాల కోసం నా కొడుకు అన్ని నిందలు పడుతుంటే నువ్ వాడి కాపురం కూల్చేయాలని చూస్తున్నావా అని సుభాష్ అనుకుంటాడు.

అనార్థాలను ఎలా ఆపాలి

పాపం ఏం తెలియని, దేవత లాంటి కావ్యకు అన్యాయం చేయాలని చూస్తున్నావా. వాడు నిజం చెప్పడు. ఇంకా జరిగే అనార్థాలను ఎలా ఆపాలి అని సుభాష్ అనుకుంటాడు. మరోవైపు రుద్రాణితో అపర్ణ బయటకు వెళ్తానని పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని రుద్రాణితో రాహుల్ అంటాడు. తనకు రాజ్‌పై ప్రేమ ఉంది. అందుకే ఇలా ప్లాన్ వేసింది. ఒకవేళ తను ఇంట్లోంచి వెళితే.. అందరూ బతిమిలాడి ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు రాజ్, కావ్య కూడా బయటకు వెళ్లరు. ఆ బాబు గురించి ఎవరు మాట్లాడరు అని రాహుల్ అంటాడు.

నేను వదినను బయటకి వెళ్లేలా చేయను. వదినపై ప్రేమ ఉన్నట్లు నటించి అయినా ఆపుతాను. నువ్ తప్పు చేశావ్ కాబట్టి నీకే శిక్ష పడాలని రాజ్‌ను గాయపరుస్తాను. తల్లిపై నీకున్న ప్రేమ ఇంతేనా అని బాధపడేలా చేస్తాను. వాడు మాట పడటం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది అనుకుంటాడు. నేను అనే మాటలకు వాడే వెళ్లిపోతాడు అని రుద్రాణి అంటుంది. మరోవైపు బెడ్‌పై కావ్య ఉంటుంటుంది. రాజ్ చాలా బాధగా ఏడుస్తూ గదిలోకి వస్తాడు.

రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్య

ఏంటండి ఇది.. అని కావ్య అంటుంటే.. కావ్య భుజంపై ఓదార్పుగా తల వాల్చుతాడు రాజ్. కావ్య రాజ్ కన్నీళ్లు తుడుస్తుంది. స్పృహలోకి వచ్చిన రాజ్ లేచి కూర్చుంటాడు. ఏంటండి ఇది మీరు ఇలా చిన్నపిల్లాడిలా మారడం ఏంటని కావ్య అడిగితే.. వాళ్లందరికి నాపై ఉన్న ద్వేషం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని రాజ్ అంటాడు. అది ద్వేషం కాదు. కఠినమైన వేషం. మీరు నిజం చెప్పట్లేదనే తప్ప మీ అమ్మ గారికి మీపై ద్వేషం లేదు అని కావ్య అంటుంది.

ఆమె దృష్టిలో నేను ఎప్పుడూ నేరస్థురాలినే. కానీ, ఆమె మాత్రం ఇంటి పెద్ద కోడలిగా సమర్ధవంతంగా బాధ్యతలు చేపట్టారు. మీ అత్త, పిన్ని, అనామిక మాటలను భరించారు. అదంతా ఇంట్లో వాళ్లు అంతా కలిసి ఉండాలనే. ఇప్పుడు వెళ్లిపోతున్నాననేది కేవలం మీరు నిజం చెప్పాలనే అని కావ్య అంటుంది. ఇన్నాళ్లు మామ్ స్థిరంగా ఉంది. ఇప్పుడు ఆమె వెళ్లిపోతే ఇల్లు ముక్కలు అవుతుంది అని రాజ్ అంటాడు. అలా జరగకుండా మీ అమ్మ గారు బయటకు వెళ్లకుండా నేను ఆపుతాను అని కావ్య అంటుంది.

బయటకు వెళ్లకుండా ఆపుతాను

నన్ను బయటకు పంపించాలని ఏడాది నుంచి ట్రై చేస్తున్నారు. నేను తట్టుకుని స్థిరంగా ఉన్నాను. అలాగే బయటకు వెళ్లకుండా ఆపుతాను అని కావ్య అంటుంది. నీ దగ్గర ఏమైనా మార్గం ఉందా అని రాజ్ అడుగుతాడు. ఇప్పటికీ లేదు. కానీ, సమయం అయితే ఉంది కదా. నేను ఏదో ఒకటి చేసి మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఆపుతాను అని మాట ఇస్తుంది కావ్య. దాంతో రాజ్ ప్రేమగా చూస్తాడు. మరోవైపు జరుగుతున్న గొడవలు గురించి ఆలోచిస్తుంది అనామిక.

ఇప్పుడీ ఇంట్లో ఎప్పుడు ఎవరు బయటకు వెళ్లిపోతారో తెలియట్లేదు. ఇప్పుడు మా అత్తగారిని మంచి చేసుకోవాలి. లేకుంటే ఒంటరిదాన్ని అయిపోతాను అనుకున్న అనామిక ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తుంది. అనామికను చూసి వెళ్లిపోతున్న ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంటే ఆపి నాపై ఇంకా కోపం తగ్గలేదా అని అనామిక అంటుంది. నీతో మాట్లాడే అవసరం ఏముంది. అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నప్పుడు అని ధాన్యలక్ష్మీ అంటుంది.

కొడుకుకి నచ్చజెపుతాను

మీరు మాట్లాడక.. మీ కొడుకు మాట్లడకపోతే నా పరిస్థితి ఏంటీ అని ఏడుస్తూ అంటుంది అనామిక. అది చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని ధాన్యలక్ష్మీ కరిగిపోతుంది. నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో మీలాగే మీ కొడుకు దూరం పెడుతున్నారు అని అనామిక అంటుంది. అయ్యో నేను వాడితో మాట్లాడి నచ్చజెప్పుతాను. వాడు నా కొడుకు. నా మాట వింటాడు అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతున్నాను. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అత్తను దారికి తెచ్చుకున్నాను. త్వరలోనే కల్యాణ్‌కు దారికి తెచ్చుకుంటాను అని అనామిక అనుకుంటుంది.

మరోవైపు స్వప్న దగ్గర ఉన్న కోటి రూపాయలు కొట్టేయడానికి వెళ్తారు రాహుల్, రుద్రాణి. స్వప్న గురకపెట్టి నిద్రపోతుంటుంది. దొంగల్లా ముసుగు వేసుకుని రాహుల్, రుద్రాణి. కప్ బోర్డ్‌లో మనీ ఉందనీ, తాళాలు స్వప్న బొడ్లో ఉన్నాయని రాహుల్ చెబుతాడు. రాహుల్, రుద్రాణి గుసగుసలు పెట్టుకోవడం చూస్తుంది స్వప్న. కావాలనే పడుకున్నట్లు నటిస్తుంది. ఇంతలో రాహుల్‌కు తాళాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా తీస్తాడు రాహుల్.

దెయ్యం పూనినట్లుగా

తాళాలు దొరికాయని సంబరపడిపోతారు. రాహుల్, రుద్రాణి వెళ్లిపోతుంటే.. స్వప్న అరిచి లేచి కూర్చుంటుంది. జుట్టు విరబూసుకుని ఒరేయ్ ఫణి భూషన్ రావ్. ఆస్తి కొట్టేశావ్ అంటూ అరుస్తుంది. ఈరోజు నిన్ను వదిలిపెట్టన్రా అని స్వప్న అంటే.. ఇద్దరూ భయపడిపోతారు. రుద్రాణి వెళ్లి బెడ్ పక్కకు దాక్కుంటుంది. దాంతో దెయ్యం పూనినట్లుగా రాహుల్‌ను చితకబాదుతుంది స్వప్న. దాంతో నేను అసిస్టెంట్. ఫణి భూషన్ రావ్ ఆ బెడ్ వెనుక ఉన్నాడని రాహుల్ అంటాడు.

దాంతో స్వప్న రుద్రాణి దగ్గరకు వెళ్లి ఎడాపెడా వాయిస్తుంది. రాహుల్, రుద్రాణి ఇద్దరిని కలిపి చితకబాదుతుంది స్వప్న. మొత్తానికి తప్పించుకుని ఇద్దరూ బయటపడిపోతారు. అనంతరం లైట్ ఆన్ చేసి కిందపడిన తాళాలు తీసుకుంటుంది స్వప్న. మరోవైపు అపర్ణ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తాడు సుభాష్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point