Brahmamudi: కావ్య మాటలకు ఖంగుతిన్న మామ సుభాష్- రాజ్‌తో సవాల్- శైలేంద్రకు తండ్రి వార్నింగ్- బయటపడనున్న మీరా ప్రెగ్నెన్సీ
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది ప్రోమోల్లో చూస్తే..
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో కావ్య ఉగ్రరూపం చూపించి అత్తయ్య, మావయ్య, భర్త అందరినీ నిలదీస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ, అనామికలకు చురకలు అంటిస్తుంది. తనకు సత్తా లేదు కానీ, రాజ్ తీసుకొచ్చిన బిడ్డ రహస్యం నిజం బయట పెట్టే సత్తా నీకు ఉందా అని కావ్యను తిరిగి ప్రశ్నించి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది అపర్ణ. దాంతో కావ్య షాక్ అవుతుంది.
ఎక్కడ మూలం పడిందో
కట్ చేస్తే.. గొడవ అంతా అయ్యాక కావ్యతో మామ సుభాష్ మాట్లాడుతాడు. నేను ఈ పరిస్థితులకు, ఈ సమస్యలకు ఎక్కడ మూలం పడిందో దాని గురించి చెప్పాలనుకున్నాను అని సుభాష్ అంటాడు. అందుకే ఆపాను మావయ్య గారు అని కావ్య జవాబు ఇస్తుంది. దానికి అర్థం కానట్లు అయోమయంగా చూస్తాడు సుభాష్. నాకు మొత్తం తెలుసు మావయ్య గారు అని కావ్య చెబుతుంది.
కావ్య మాటలు విని ఒక్కసారిగా ఉలిక్కి పడి షాక్ అవుతాడు సుభాష్. కావ్యను షాకింగ్‌గా చూస్తాడు. కావ్యకు నిజం ఎలా తెలిసిందా అని ఖంగుతిన్న సుభాష్ ఆలోచిస్తుంటాడు. మరోవైపు భర్త రాజ్‌తో కావ్య మాట్లాడుతుంది. సప్తసముద్రాల అవతల పగడాల దీవిలో ఒంటి స్తంభం మేడలో.. ఆ బిడ్డ తల్లి దాగి ఉన్న సరే.. నేను అవన్ని దాటుకుని వెళ్లి ఆమెను తీసుకొచ్చి తీరుతాను అని రాజ్‌తో కావ్య సవాల్ చేస్తుంది.
అడ్డు రాకండి
దానికి కావ్యవైపు షాకింగ్‌గా రాజ్ చూస్తాడు. తీసుకొచ్చి మీ అమ్మగారి ముందు నిలబెడతాను. దయచేసి అడ్డు రాకండి అని కావ్య అంటుంది. కావ్య మాటలకు రాజ్ సైలెంట్‌గా ఉంటాడు. అయితే, తనకు నిజం తెలిసిందన్న విషయం రాజ్‌కు కావ్య చెప్పిందా లేదా అనేది సస్పెన్స్‌గా ఉంచారు.
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో మను నోటీసీలు ఇవ్వడం, అతనిపై వసుధార, మహేంద్ర కోపంగా ఉండటం నిజమని నమ్ముతాడు శైలేంద్ర. తనకు ఎండీ సీటు గురించి ఇచ్చిన ఆఫర్ గురించి డిన్నర్ టైమ్‌లో పరధ్యానంగా ఆలోచిస్తుంటాడు శైలేంద్ర. అలా ప్లేట్‌లో బదులో టేబుల్‌పై అన్నం, కర్రీ వేసుకుని కలుపుతాడు. అది చూసి ఫణీంద్ర ఫైర్ అవుతాడు.
తాట తీస్తానని
ధరణి చెప్పినట్లుగానే.. శైలేంద్ర మరో అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడని తండ్రి ఫణీంద్ర కోప్పడతాడు. కొడుకుకు క్లాస్ పీకుతాడు. వెధవ వేశాలు వేస్తే తాట తీస్తానని హెచ్చరిస్తాడు. అనంతరం ఫణీంద్ర దగ్గరికి వచ్చి మను నోటీసుల గురించి చెబుతారు వసుధార, మహేంద్ర. మను అసలు రంగు ఇప్పుడు బయటపడింది అని దేవయాని మండిపడుతుంది.
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ముకుంద కావాలనే కళ్లు తిరిగి పడిపోతుంది. దాంతో అంతా కంగారుపడిపోతారు. అప్పుడు మీరాను చెక్ చేసిన కృష్ణ తాను ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అవుతుంది. మురారి కూడా కృష్ణ నిజం బయటకు చెబితే మీరా నింద మోయాల్సి వస్తుందని భయపడతాడు. కానీ, కృష్ణ నిజం చెప్పదు. నీరసం వల్ల కళ్లు తిరిగాయని కృష్ణ అబద్ధం చెబుతుంది.
ఎందుకు అడ్డు వస్తున్నావ్
ఏ ఇంటి బిడ్డో మా ఇంటికి చేరింది. మాకు ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసింది. తనకు ఎవరు లేరని తనను చూడమని అమృతకు చెబుతుంది భవానీ. మురారి, కృష్ణ కంగారుపడుతుంటారు. నేను చూశాను కదా అని కృష్ణ అంటే.. ఏయ్.. తింగరి ప్రతిదానికి ఎందుకు అడ్డు వస్తున్నావ్. నిన్న నిన్ను చూస్తానంటే వద్దన్నావ్. ఇప్పుడు ముకుందను కూడా చూడనివ్వవా అని భవానీ అంటుంది.
తర్వాత మీరాను అమృత చెక్ చేస్తుంది. కృష్ణ అంటే చెప్పలేదు. కానీ, అమృత ఆంటీ చెబుతుంది కదా అని మురారి కంగారుపడుతాడు. మీరాను చూసిన అమృత షాక్ అవుతుంది. తను ప్రెగ్నెంట్ అని కనిపెట్టినట్లు మొహం అదోలా పెడుతుంది. ఏమైందని భవానీ అడుగుతుంది. చూస్తుంటే మీరా ప్రెగ్నెంట్ అనే విషయం అమృత బయటపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.