Brahmamudi: కావ్యకు విడాకులు-మాయకే ఓటేసిన అపర్ణ- నలిగిపోతున్న రాజ్- శైలేంద్రకు చావు భయం- పరారిలో మురారి-brahmamudi guppedantha manasu krishna mukunda murari serial latest episode promo aparna order raj to give divorce kavya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: కావ్యకు విడాకులు-మాయకే ఓటేసిన అపర్ణ- నలిగిపోతున్న రాజ్- శైలేంద్రకు చావు భయం- పరారిలో మురారి

Brahmamudi: కావ్యకు విడాకులు-మాయకే ఓటేసిన అపర్ణ- నలిగిపోతున్న రాజ్- శైలేంద్రకు చావు భయం- పరారిలో మురారి

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 07:41 AM IST

Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది ప్రోమోల్లో చూస్తే..

కావ్యకు విడాకులు ఇవ్వమని అపర్ణ ఆర్డర్.. తల్లికి రాజ్ ఎదురుచెబుతాడా?.. శైలేంద్రకు చావు భయం.. మురారి పరారి
కావ్యకు విడాకులు ఇవ్వమని అపర్ణ ఆర్డర్.. తల్లికి రాజ్ ఎదురుచెబుతాడా?.. శైలేంద్రకు చావు భయం.. మురారి పరారి

Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో మాయగా వచ్చిన చిత్ర రెండో కుంపటి పెడుతుంది. తనపై రాజ్‌కు చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. ఇద్దరి పెళ్లాల మధ్య రాజ్ నలిగిపోతున్నాడని, అలా నలగకుండా ఉండటానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, మాయకు ఇంటి వారసుడు పుట్టిన విషయం గుర్తు పెట్టుకోమ్మని అపర్ణకు రుద్రాణి హింట్ ఇస్తుంది.

విడాకుల పత్రాలు

కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లోకి లాయర్ ఓ పేపర్స్‌ తీసుకొని వస్తాడు. ఆ పేపర్స్ అపర్ణకు ఇస్తాడు. ఏంటవి అని సుభాష్ ప్రశ్నిస్తాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లో జరిగే గందరగోళం సద్దుమణగడానికి.. మన పెద్దరికాన్ని నిలబెట్టుకుని న్యాయం జరిపించడానికి.. అని అపర్ణ బదులిస్తుంది. అసలు ఆ కాగితాలు ఏంటి వదినా అని ప్రకాశం అడుగుతాడు. దాంతో విడాకుల పత్రాలు అని అపర్ణ చెబుతుంది.

అపర్ణ మాటలు విని కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. రాజ్, సుభాష్, ఇందిరాదేవి షాక్ అయి చూస్తారు. రుద్రాణి ఆశ్చర్యపోయి చూస్తే చిత్ర మాత్రం సంతోషంగా చూస్తుంది. నువ్ కావ్య విడాకులు తీసుకోవాలి అని రాజ్‌కు చెబుతుంది అపర్ణ. దానికి రాజ్, కావ్య షాక్ అవుతారు. కానీ, రాజ్ మాత్రం కావ్యకు విడాకులు ఇవ్వనని చెబుతాడని అనిపిస్తోంది.

కావ్య ఎలా బయటపడుతుంది?

అంతేకాకుండా ఈ విడాకులు జరగకుండా కావ్యకు సపోర్ట్‌గా ఇందిరాదేవి, సీతారామయ్య నిలుస్తారని ఊహించవచ్చు. మరి ఈ విడాకుల గండం నుంచి కావ్య ఎలా బయటపడుతుంది? మాయగా వచ్చిన చిత్ర అసలు బండారం ఎప్పుడు బయటపెడుతుంది? అనే విషయాలు తెలియాలంటే బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్‌లో పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాజీవ్‌ను శైలేంద్ర కలుస్తాడు. నా మరదలు పిల్ల, వాళ్ల మావయ్య కలిసి నన్ను ఇలా దెబ్బ కొడతారని అనుకోలేదు భయ్యా. పక్కాగా ప్లాన్ ఎలా వేశారో తెలియట్లేదు. కచ్చితంగా దీని వెనుకాల ఎవరో ఉన్నారు అని రాజీవ్ అంటాడు. దానికి కంగారుపడిపోయి నేను కాదు బ్రదర్.. బ్రదర్ అని శైలేంద్ర అంటాడు.

చంపేసేలా ఉన్నాడు

అది నువ్వు కాదు భయ్యా. ఇంకెవడో ఉన్నాడు అని రాజీవ్ అంటాడు. వాడెవడో తెలిస్తే ఏం చేస్తావ్ అని శైలేంద్ర అడుగుతాడు. చంపేస్తాను అని రాజీవ్ బదులిస్తాడు. దాంతో శైలేంద్రకు చావు భయం మొదలవుతుంది. తర్వాత దేవయానితో వాడిని చూస్తుంటే ఎవరు ఊహించనట్లుగా చంపేసేలా ఉన్నాడని శైలేంద్ర అంటాడు. వాళ్లేంట్రా నిన్ను ఇలా ఇరికించారు అని దేవయాని అంటుంది.

Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఇంట్లో మురారి కోసం అంతా వెతుతుకుతారు. కానీ మురారి ఎక్కడా లేడని మధు చెబుతాడు. మురారి పైన లేడా.. మురారి ఎక్కడ రేవతి అని అడుగుతుంది భవానీ. ఏమో అక్క ఇందాక డాక్టర్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు అని రేవతి అంటుంది. డాక్టర్ నిజం చెప్పాగానే బండారం బయటపడిపోయిందని పారిపోయాడు పిన్ని అని ఆదర్శ్ అంటాడు.

అప్పుడు ముకుంద

రేయ్ అని రేవతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ ఆదర్శ్.. నా కొడకు అలాంటివాడు కాదు అని రేవతి గట్టిగా చెబుతుంది. మరి లేకపోతే ఏంటిది పిన్ని. తన బిడ్డకు తండ్రి మురారినేని మీరా చెబుతుంది కదా. ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాయాలని అనుకున్నాడు. ఎప్పుడైతే డాక్టర్ వచ్చిన నిజం చెప్పిందే పరారైపోయాడు అని ఆదర్శ్ అంటాడు.

అప్పుడు నేను ప్రేమించినా ముకుందను నాకు కాకుండా చేశాడు. ఇప్పుడు తను తల్లిని చేసిన అమ్మాయిని నాకు భార్యను చేయాలనుకుంటున్నాడు అని అంటాడు. నా కొడుకు నలుగురి మంచి కోసం ప్రయత్నించేవాడే తప్పా ఇలా చేయడని రేవతి అంటుంది.

టీ20 వరల్డ్ కప్ 2024