Brahmamudi May 25th Episode: బ్రహ్మముడి- ఇంట్లో రెండో కుంపటి- మాయ, రుద్రాణికి కావ్య పనిష్‌మెంట్- కంపెనీ దివాలా!-brahmamudi serial 25th episode kavya punishment to maya rudrani and rahul has a scheme brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 25th Episode: బ్రహ్మముడి- ఇంట్లో రెండో కుంపటి- మాయ, రుద్రాణికి కావ్య పనిష్‌మెంట్- కంపెనీ దివాలా!

Brahmamudi May 25th Episode: బ్రహ్మముడి- ఇంట్లో రెండో కుంపటి- మాయ, రుద్రాణికి కావ్య పనిష్‌మెంట్- కంపెనీ దివాలా!

Sanjiv Kumar HT Telugu
May 25, 2024 07:42 AM IST

Brahmamudi Serial May 25th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 25వ తేది ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రెండో కుంపటి పెడుతుంది మాయగా వచ్చిన చిత్ర. దానికంటే ముందు మాయ, రుద్రాణితో బాబు ముడ్డి కడిగించి పనిష్‌మెంట్ ఇస్తుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 25వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 25వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో చిత్రపై ఇందిరాదేవి, స్వప్న పంచ్‌లు వేస్తారు. చూశావా చెల్లి ఇవన్నీ ఎదుర్కోవాలనే నేను రాను అన్నాను. కానీ, నువ్వే పట్టుబట్టి మరి తీసుకొచ్చావ్. సరేలే.. నా బిడ్డ కోసం ఇవన్నీ భరిస్తాను. సరే నీలాగే నేను కూడా ఎవరెవరికీ ఏం కావాలో సరిగ్గా ఇచ్చానా అని కావ్యను అడుగుతుంది చిత్ర. దాంతో బిడ్డను తీసుకొచ్చిన కావ్య.. అన్ని పనులు బాగానే చేశావ్ కానీ ఈ బిడ్డ తల్లిగా చేయాల్సిన పని మర్చిపోయావ్ అని కావ్య చెబుతుంది.

కడుపు నిండా పాలు పట్టాలి

ఏంటది అని చిత్ర అడిగితే.. తీసుకో చెబుతా అని బాబును ఇస్తుంది. ఇక నుంచి వీడిని నువ్వే చూసుకోవాలి అని కావ్య అంటే.. అవును.. నా బిడ్డ నాకు బరువా అని చిత్ర అంటుంది. బరువు కాదు.. బాధ్యత.. వాడు లండన్ వెళ్లాడు.. తీసుకెళ్లి శుభ్రం చేసి స్నానం చేయించాలి. కాఫీలు టీలు కలపడం సంగతి తర్వాత ముందు వీడికి కడుపు నిండా పాలు పట్టాలి. ముందు స్నానం చేయించుపో అని కావ్య పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దాంతో అసహ్యంగా ఫేస్ పెడుతుంది చిత్ర.

సాయానికి రమ్మని రుద్రాణిని అడుగుతుంది చిత్ర. దానికి రుద్రాణి నా వల్ల కాదు అని తటపటాయిస్తుంది. ఇప్పటిదాకా సానుభూతి చూపించావ్ కదా. ఇన్నాళ్లు కావ్య ఒక్కతే చేస్తే ఎవరికీ తెలిసిరాలేదు అని ఇందిరాదేవి అంటుంది. ఏంటీ రుద్రాణి గారు మీరు ఓ కొడుకును కన్నారు కదా వెళ్లండని కావ్య అంటుంది. రండి రుద్రాణి గారూ అని చిత్ర అడగడంతో అయిష్టంగా వెళ్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ కాఫీ తాగడం చూసి.. సిగ్గుండాలి అని ప్రకాశం అంటాడు.

పనివాళ్లతో కడిగించాను

దాంతో ధాన్యలక్ష్మీ షాక్ అయి చూస్తే.. ఫోన్‌లో మాట్లాడినట్లుగా కవర్ చేస్తాడు ప్రకాశం. మరోవైపు బిడ్డను పట్టుకుని ముక్కు మూసుకుని అసహ్యించుకుంటారు. రుద్రాణికి బాబుని ఇచ్చి కడగమని చెబుతుంది. నేను చేయను అని రుద్రాణి అంటే.. వీడు బాత్రూమ్ పోయాడు. డైపర్ తీసి కడగమని కావ్య చెప్పింది కదా అని చిత్ర అంటుంది. నా కొడుకునే పనివాళ్లకు ఇచ్చి కడిగించాను అని రుద్రాణి అంటే.. నేను కూడా అలాగే చేయనా అని చిత్ర అంటుంది.

అప్పుడు కానీ కావ్య అందరికి తెలిసేలా చేయదు. నటించాడనికి వచ్చావ్ కదా. ఇవన్నీ కూడా చేయాలి అని రుద్రాణి అంటుంది. సరే నీళ్లు పోసి హెల్ప్ చేయండని చిత్ర అంటే.. ఇక తప్పుతుందా అని రుద్రాణి అంటుంది. అతి కష్టంగా బాబుకు డైపర్ తీస్తుంది చిత్ర. రుద్రాణి నీళ్లు పోస్తుంది. అది చూసిన స్వప్న నవ్వుతూ అద్భుతంగా ఉంది. ఏంటీ అని రుద్రాణి అంటే.. మీరు వాడి ముడ్డి కడగడం. ఇవన్నీ బాగా అలవాటు చేసుకోండి. నాకు పుట్టిన బిడ్డకు కూడా మీరే చేయించాలి. నేను మీతో చేయిస్తాను కదా అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.

నీకు ఏడుపే మిగులుతుంది

ఇంతలో కావ్య వస్తుంది. కావ్య నవ్వుతుంటుంది. అది చూసిన రుద్రాణి ఈ నవ్వు ఎన్నాళ్లు ఉంటుందో చూస్తాను. దీన్ని అస్త్రంగా ఇంటిపై వదలబోతున్నాను. నా కొడుకును మరో అస్త్రంగా ఆఫీస్‌కు పంపిస్తున్నాను. నేను కొట్టే దెబ్బకు నవ్వు పోయి ఏడుపే మిగులుతుంది అని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో ఆంటీ నీళ్లు పోయండి.. ఎండిపోయేలా ఉందని చిత్ర అంటుంది. దాంతో అందుకేగా ఇక్కడ ఉందని రుద్రాణి పోస్తుంది.

మరోవైపు రాహుల్ ఇదివరకు స్మగ్లింగ్ గోల్డ్ డీల్ పెట్టుకున్న అతనికి కాల్ చేసి ఈసారి ఎవరు అడ్డు చెప్పరు. మనం డీల్ చేద్దాం అని ఫోన్‌లో చెబుతాడు. లేదు ఇదివరకు ఇలాగే చెప్పి లాస్ట్‌లో హ్యాండ్ ఇచ్చావ్. కావ్య, రాజ్ ఉన్నంతరవకు ఏం చేయలేమని మా అన్నయ్య చెప్పాడు. కాబట్టి వద్దు అని అతను చెబుతాడు. మీ అన్నయ్య చెప్పింది కరెక్టే. కానీ, మీ అన్నయ్యకు చెప్పు రాజ్ కావ్య కంపెనీ వైపు చూసే అవకాశమే లేదు. ఇకనుంచి నేనే ఎండీని అని రాహుల్ అంటాడు.

50 పర్సంట్ వాటా కావాలి

ఏంటీ నిజమా అని అతను అడిగితే.. అవును, నీకు నమ్మకం లేకుంటే ఇంకో పార్టీ ఉంది. దాంతో డీల్ చేస్తా అని రాహుల్ అంటాడు. అలా కోప్పడకండి సార్ అని అతను అంటే.. ఈసారి పది కేజీలు కాదు 50 కేజీలు అయినా ఈజీగా మ్యానేజ్ చేస్తాను. కానీ, ఇంతకుముందులా 20 పర్సంట్ కాదు 50 శాతం వాటా కావాలి. దానికి మీ అన్నయ్య ఒప్పుకుంటేనే డీల్‌కు రమ్మని రాహుల్ అంటాడు. సరే అని అతను కాల్ కట్ చేస్తాడు.

రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకునేలోపు నేను కోటీశ్వరుడిని అయిపోవాలి. కంపెనీ దివాలా తీయాలి అని రాహుల్ అనుకుంటాడు. తర్వాత ఇంట్లో అందరికీ టిఫిన్ రెడీ అని చిత్ర చెబుతుంది. కావ్య నువ్ చేయలేదా అని ఇందిరాదేవి అంటుంది. ఇవి నేను చేసినవే అని కావ్య చెబుతుంది. ఇంట్లో రెండో కుంపటి మొదలైందని రుద్రాణి అంటుంది. మీకు చాలా సంతోషంగా ఉంది కదా అని స్వప్న అంటే.. అది సరే రాజ్ ఎక్కడా అని రాహుల్ అడుగుతాడు.

ముక్కు కోసి కుక్కలకు వేస్తా

ఆయనకు నా చేత చేసిన టిఫిన్ అంటే ఇష్టం కదా. నేను వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారేమో అని చిత్ర అంటుంది. మీ గిల్లుడు మొదలయ్యేదాకా ఆకలి ఆగదుకదా అని రుద్రాణి అంటుంది. ఇప్పటికి పెట్టిన మంట చాలదా ఇంకా వంట చేశావ్. ఓ మూలన ఉండకా ఇవన్నీ ఎందుకు అని స్వప్న అంటుంది. అదేంటీ స్వప్న అక్క కావ్య చెబితేనే కదా వచ్చింది అని చిత్ర అంటుంది. అక్క అంటే ముక్కు కోసి కుక్కలకు వేస్తాను అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

తర్వాత ఒక్కొక్కరికి ఓక్కో టేస్ట్ ఉందని రుద్రాణి అంటే.. అందరికీ ఏ టిఫిన్ ఇష్టమో చెబుతుంది చిత్ర. రాజ్‌కు ఇడ్లీ నచ్చదని, పెసరట్టు ఉప్మా ఇష్టమని చెబుతుంది. దీని బట్టే తెలుస్తోంది మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఎంతలా ఉందో అసలు రాజ్ హెడ్ ఆఫీస్‌కు వెళ్తున్నాడనుకున్నా.. బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశాడన్నమాట అని రుద్రాణి అంటుంది. ఊటిలో. సెక్రటరీగా వచ్చిన నన్ను అపాయింట్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరం ప్రేమలో పడ్డాం. ఆ తర్వాత అని చిత్ర చెబుతుంది రుద్రాణి ఆపుతుంది.

కోపంగా రాజ్

మీరు ప్రేమలో పడ్డారు. తర్వాత కడుపులో బిడ్డ పడ్డాడు. కొన్నాళ్లకు భూమ్మీద పడ్డాడు. ఇప్పుడు ఇంట్లో పడ్డాడు అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్ వస్తే.. కావ్యను పక్కకు తోసేసి రా రాజ్ నీకోసం ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశానని చిత్ర చెబుతుంది. దాంతో రాజ్ కోపంగా చూస్తాడు. కోపంగా చూసి లాభం ఏముంది రాజ్. బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయకముందు ఆలోచించాలి అని రుద్రాణి అంటుంది. నాకు ఏం కావాలో నాకు తెలుసు అత్త అని రాజ్ అంటాడు.

నా ఇష్టాలు మారిపోయాయి. డైటింగ్ చేస్తున్నాను. కళావతి నేను సాండ్‌విచ్ అడిగాను కదా. చేశావా అని రాజ్ అడిగితే.. కావ్య వెళ్లి తీసుకొస్తుంది. నేను గదిలో తింటాను అని రాజ్ వెళ్లిపోతాడు. దాంతో కోపంగా కావ్య కూడా వెళ్లిపోతుంది. సరే మీరు తినండి అని చిత్ర అడిగితే.. సుభాష్, ఇందిరాదేవి, ప్రకాశం, స్వప్న అంతా వెళ్లిపోతారు. అపర్ణ చూసి షాక్ అవుతుంది. అపర్ణ, రాహుల్, రుద్రాణి డిన్నర్ టేబుల్ దగ్గర ఉంటారు.

నలిగిపోతున్నాడు

ఇంకా మౌనంగా ఉంటే ఎలా వదినా. రాజ్ ఇద్దరి పెళ్లాల మధ్య నలిగిపోతున్నాడు. నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ, నిర్ణయం తీసుకోడానికి ముందు మాయకు ఇంటి వారసుడు పుట్టాలని గుర్తుంచుకో అని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే అప్పుకు జరిగింది విషయం చెబుతుంది కావ్య. అదంతా అలా చేస్తుంటే నువ్వు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావని అప్పు అంటే.. నేను తీసుకొచ్చాను. అప్పుడు అది అబద్ధం చెప్పాను. నేను అది అబద్ధం అని ఎలా చెప్పను అని కావ్య అంటుంది.

అది నీకు పెద్ద సమస్య తీసుకొచ్చేలా ఉంది అని అప్పు అంటే.. అది కాదు సమస్య. ఇప్పుడు మా అత్త గారితో ఉంది. మా ఆయనతో పెళ్లి చేసేలా ఉంది. నేనే కదా తీసుకొచ్చింది ఒప్పుకుని తీరాలి అంటుంది కావ్య చెబుతుంది. అప్పుడు దొంగమాయ అని చెబుదామని అప్పు అంటే.. దానికి అన్ని విషయాలు తెలుసు. మామయ్య గారి చెప్పేస్తుంది అని కావ్య అంటుంది. ఇలా ఇరుక్కుపోయామేంటీ. అసలు ఆ నిజమైన తల్లి ఎక్కడుంది. అంతా బయటకొస్తున్నారు కానీ, తను మాత్రం బయటకు రావట్లేదు అని అప్పు అంటుంది.

అది తెలుసుకుంటాను

అసలు ఈ విషయం ఎలా మర్చిపోయాను. ఆ అసలు తల్లిని పట్టుకుని మామయ్యకు ఆమెకు సంబంధం ఉందా లేదా అని కనుక్కుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ అసలు మాయను వెతికి పట్టుకుని ఈ దొంగ మాయం మోసాన్ని బయటపెట్టాలి. ఎక్కడుందో వెతికి తీరుతాను. ఎక్కడ ఓ చోట ఆ మాయ తప్పు చేసి ఉంటుంది. అది తెలుసుకుంటాను అని కావ్య అంటుంది.

కట్ చేస్తే ఆలోచిస్తున్న రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. ఎక్కడికీ వెళ్లావ్. కొంచమైనా బుద్ధిందా. కనీసం బాధ్యతైన ఏడ్చిందా. ఎప్పుడెళ్లావ్ ఎప్పుడొస్తున్నావ్ అని కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

టీ20 వరల్డ్ కప్ 2024