Baahubali 3 OTT: రాజమౌళిపై బాహుబలి 3లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన నటుడి కామెంట్స్.. అప్పుడు రాలేదంటూ!-baahubali crown of blood prabhas voice artist sharad kelkar about rajamouli baahubali 3 ott release disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baahubali 3 Ott: రాజమౌళిపై బాహుబలి 3లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన నటుడి కామెంట్స్.. అప్పుడు రాలేదంటూ!

Baahubali 3 OTT: రాజమౌళిపై బాహుబలి 3లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన నటుడి కామెంట్స్.. అప్పుడు రాలేదంటూ!

Sanjiv Kumar HT Telugu
May 24, 2024 12:20 PM IST

Baahubali Crown Of Blood Prabhas Voice Sharad Kelkar: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ వెబ్ సిరీస్‌లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన హిందీ నటుడు శరద్ కేల్కర్. ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పడం, రాజమౌళిపై శరద్ కేల్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బాహుబలి 3లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన హిందీ నటుడు.. రాజమౌళిపై కామెంట్స్
బాహుబలి 3లో ప్రభాస్‌కు వాయిస్ ఇచ్చిన హిందీ నటుడు.. రాజమౌళిపై కామెంట్స్

Baahubali 3 OTT Prabhas Voice Sharad Kelkar SS Rajamouli: బాహుబలికి అంటే ప్రభాస్‌కు తన గాత్రాన్ని అందించిన బాలీవుడ్ పాపులర్ యాక్టర్ శరద్ కేల్కర్ తన నటనపై ఉన్న ప్రేమ గురించి, తెరపై ఎక్కువగా కనిపించడంపై ఆసక్తికర విషయాలు చెప్పాడు. "నేను మొదట నటుడిని. నేను కొత్త పాత్రలను, కొత్త పనిని చేయాలనుకుంటున్నాను" అని శరద్ కేల్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మాహిష్మతి రాజ్యం, అలాగే బాహుబలి విశ్వంలో చెప్పని, గమనించని, ఇంకా సాక్ష్యం లేని కథలు, సంఘటనలు చాలా ఉన్నాయని ఇటీవల దర్శకదిగ్గజం రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల యానిమేటెడ్ సిరీస్ "బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్"ను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్ర ఫ్రాంచైజీలలో ఒకటైన బాహుబలి నుంచి వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతోంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అండ్ గ్రాఫిక్ ఇండియా ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ కథలో, బాహుబలి, భల్లాలదేవ మాహిష్మతి రాజ్యాన్ని భయంకరమైన యుద్దవీరుడు రక్తదేవ నుంచి రక్షించడానికి ఒక్కటవుతారు. ఈ క్రమంలో శత్రువుతో చేతులు కలుపుతాడు కట్టప్ప. ఇలా డిఫరెంట్ నెరేషన్‌తో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఉంది.

ఇదిలా ఉంటే, హిందీ నటుడు శరద్ కేల్కర్ తన నటనతో ఎంతో ఆదరాభిమానాలు పొందాడు. నటనతోపాటు విలక్షణమైన గాత్రానికి ప్రసిద్ధి చెందాడు. బాలీవుడ్ పరిశ్రమలో పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి పాపులర్ వెబ్ సిరీసులలో కూడా ఆయన నటించాడు.

ఇక ఇటీవల బాహుబలి సిరీస్‌లో ప్రభాస్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు శరద్ కేల్కర్. డిస్నీ+హాట్‌స్టార్ 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్'లో ప్రభాస్ పాత్రకు తన గాత్రాన్ని అందించాడు. కేల్కర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా అలాగే ఆన్-స్క్రీన్ స్టార్‌గా డ్యూయల్ రోల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఆలరిస్తున్నాడు. ఈ క్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు.

"నేను బాగా డబ్బింగ్ చేస్తాను. అలా అని మంచి వాయిస్ అవసరమయ్యే పాత్రను నేను చేస్తాను అని కాదు. నేను మొదట నటుడిని, నేను నటించగలను. ఇక నా వాయిస్ విషయానికి వస్తే నేను దానిని ఏదైనా స్థాయికి తీసుకెళ్లగలను. అదృష్టవశాత్తూ.. గత రెండేళ్లలో చాలా మంది నాపై విశ్వాసం చూపించారు. నేను టైప్‌కాస్ట్‌లో చిక్కుకోకుండా వివిధ రకాల పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాను. నేను రాబోయే మంచి సమయాల కోసం ఎదురు చూస్తున్నాను" అని శరద్ కేల్కర్ తెలిపారు.

"బాహుబలికి నాకు వాయిస్‌ని అందించిన ఘనత అంతా రాజమౌళి సర్‌కే చెందుతుంది. అందుకు నన్ను ఎంచుకుని, నేను పాత్రను గ్రహించినందున డబ్బింగ్ చెప్పుకునే స్వేచ్ఛను ఇచ్చారు. మొదటి భాగం సమయంలో, అతను సాయంత్రం వచ్చి డబ్స్ అన్నీ చెక్ చేసేవారు. రెండవ భాగానికి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన రాలేదు. ఆయన నన్ను పూర్తిగా నమ్మారు. నీ పని మీరు చేయండి అని చెప్పారు" అని శరద్ కేల్కర్ వెల్లడించారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మూడు ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటగా రెండు ఎపిసోడ్స్ డిజిటల్ ప్రీమియర్ చేయగా.. వారానికొక ఎపిసోడ్ వదులుతున్నారు మేకర్స్.

టీ20 వరల్డ్ కప్ 2024