Krishna mukunda murari serial: ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న భవానీ కుటుంబం.. మురారి నిజం బయటపెడతాడా?-krishna mukunda murari serial today may 24th episode doctor reveals mukunda pregnancy matter to bhavani family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న భవానీ కుటుంబం.. మురారి నిజం బయటపెడతాడా?

Krishna mukunda murari serial: ముకుంద ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న భవానీ కుటుంబం.. మురారి నిజం బయటపెడతాడా?

Gunti Soundarya HT Telugu
May 24, 2024 09:08 AM IST

Krishna mukunda murari serial today may 24th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద కళ్ళు తిరిగిపడిపోవడంతో డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. చెక్ చేసిన డాక్టర్ ముకుంద ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 24వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 24వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 24th episode: మురారిని దక్కించుకోవడం కోసం వేషం మార్చుకుని వచ్చానని తాను చనిపోలేదని ముకుంద చెప్పడంతో కృష్ణ షాక్ అవుతుంది. తనకు ఇష్టం లేని ముకుంద కడుపులో తన బిడ్డ పెరగడం కృష్ణ జీర్ణించుకోలేకపోతుంది.

ఈ బాధలు, నరకం అనుభవించడం తన వల్ల కాదని చెప్పి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటానని తన చిన్నాన్న పెద్దపల్లి ప్రభాకర్ ఇంటికి వెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..

నా బిడ్డ తల్లికాబోతుంది

కృష్ణ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ముగ్గురు ఆడవాళ్ళు ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి పైకి లేవబోతుంటే వద్దు అసలే ఒట్టి మనిషివి కూడా కాదంటూ ఆపుతారు. అసలు ఆ ఇంట్లో స్థానం ఉంటుందో లేదో అనే పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించిన తన బిడ్డ ఇప్పుడు ఆ ఇంటికి వారసుడిని అందించబోతుందని శకుంతల సంతోషంగా వాళ్ళతో చెప్తుంది. కృష్ణ మాత్రం బాధపడుతుంది. అది ప్రభాకర్ గమనిస్తాడు.

అటు ఇంట్లో పెళ్లి సందర్భంగా ఆదర్శ్, ముకుంద ఫోటో షూట్ చేస్తూ ఉంటారు. ఫోటోస్ తీస్తుండగా ముకుంద కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఇంట్లో అందరూ కంగారుపడిపోతారు. భవానీ దేవి డాక్టర్ ని పిలిపించి టెస్ట్ చేయిస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తుంది. డాక్టర్ ముకుందని చెక్ చేసి మీరు అనుకుంటున్నట్టుగానే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది. దీంతో ఆదర్శ్ తో సహా అందరూ షాక్ అవుతారు.

ఇదంతా ముకుంద కుట్ర?

అందరికీ తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియాలనే ఉద్దేశంతో ముకుంద కావాలని కళ్ళు తిరిగిపడిపోయినట్టు నాటకం ఆడి ఉంటుంది. అయితే ముకుంద ప్రెగ్నెంట్ అనే విషయం ముందు నుంచి భవానీ చెప్తూనే ఉంటుంది. అయితే దానికి కారణం ఆదర్శ్ అని అపోహ పడుతుంది. ఇప్పుడు తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే ఆదర్శ్ తో పెళ్లి ఆగిపోతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణ బండారం బయట పెట్టేందుకు ఇలా చేసి ఉండవచ్చు.

ప్రభాకర్ కి నిజం తెలుస్తుందా?

కృష్ణ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉండటం పెద్దపల్లి ప్రభాకర్ గమనిస్తాడు. అసలు ఏం జరిగిందని అడిగితే కృష్ణ నిజం చెప్తుందా? ముకుంద చనిపోలేదని ఇదంతా తను ఆడుతున్న డ్రామా అని, తన గర్భం పోయేలా ముకుంద చేసిందనే విషయాలు తన చిన్నాన్నకు చెప్తుందో లేదో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

ముకుంద నిజం చెప్పేస్తుందా?

భవానీ ఆదర్శ్ ని నిలదీస్తే ముకుంద కడుపులో బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదర్శ్ నిజం చెప్పే అవకాశం ఉంది. తన కడుపుకు కారణం ఆదర్శ్ కాదు మురారి అని ముకుంద చెప్పే అవకాశం కూడా ఉంది. ఇంట్లో అందరి ముందు కృష్ణని దోషిని చేసే అవకాశం కోసం ఇప్పటికే ముకుంద ఎదురుచూస్తుంది.

అందులో భాగంగానే కృష్ణ గొడ్రాలు అని చెప్పేసినా చెప్పేస్తుంది. సరోగసి ద్వారా మురారి వాళ్ళు బిడ్డని కంటున్నారని, ఆ సరోగసి మథర్ తానేనని చెప్పేస్తుందా? ఒకవేళ భవానీకి నిజం తెలిస్తే కృష్ణని క్షమించి ఆదరిస్తుందా? లేదంటే ఇంటికి బిడ్డని ఇస్తున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి ఆపేసి మురారికి ఇచ్చి పెళ్లి చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అదే నిజమయితే ముకుంద కల నెరవేరినట్టే.

టీ20 వరల్డ్ కప్ 2024