Krishna mukunda murari serial: మీరానే సరోగసి మథర్.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్న భవానీ
Krishna mukunda murari serial may 13th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సరోగసి మథర్ అనే విషయం మురారి కృష్ణకి చెప్పేస్తాడు. అటు భవానీ ఆదర్శ్, ముకుందకి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేందుకు రెడీ అవుతుంది.
Krishna mukunda murari serial may 13th episode: అమృత కూడా ముకుందని చెక్ చేసి షాక్ అవుతుంది. కృష్ణ వైపు చూస్తుంది. తను టెన్షన్ గా కనిపిస్తుంది. నువ్వు కరెక్ట్ కృష్ణ ఇది జనరల్ వీక్ నెస్ భవానీ ఏం కాలేదు తను బాగానే ఉందని అబద్ధం చెప్తుంది.
ఆదర్శ్ ఆరాటం
అమృత అబద్ధం చెప్పేసరికి తను సీనియర్ గైనకాలజిస్ట్ కదా నేను తప్పుగా ఏమైనా చెక్ చేశానా ఏంటని కృష్ణ అనుకుంటుంది. ముకుంద స్పృహలోకి వచ్చినట్టు లేస్తుంది. సడెన్ గా నీరసంగా అనిపించిందని కళ్ళు తిరిగిపడిపోయినట్టు చెప్తుంది.
ముకుంద మీద ఆదర్శ్ తెగ ప్రేమ చూపిస్తాడు. ఏం తినకుండా చావు దగ్గరకు వెళ్ళింది అదే ఆలోచనలో ఉండి ఉంటుందని ఆదర్శ్ అంటాడు. ఇక అందరూ పూజ దగ్గరకు వెళతారు. మీరా తమ కోసం అబద్ధం చెప్పిందని మురారి అనుకుంటాడు. కృష్ణ ఒంటరిగా నిలబడి మీరా గురించి ఆలోచిస్తుంది.
తల్లిని కావడం లేదా?
పెళ్లి కాకుండా ఇలా జరిగిందని నేను చెప్పలేకపోయానని కృష్ణ అంటుంది. ఎవరు అతను అంటే ఆదర్శ్ అని కృష్ణ చెప్తుంది. పెద్దత్తయ్య కూడా వాళ్ళకు పెళ్లి చేయాలని అనుకుంటుందని కృష్ణ చెప్తుంది. వెంటనే పెద్దత్తయ్యతో మాట్లాడి వాళ్ళ పెళ్లి జరిపించి తర్వాత విషయం చెప్తానని కృష్ణ అంటుంది.
ముకుంద కృష్ణ, అమృత చెప్పిన అబద్ధం గురించి ఆలోచిస్తుంది. పెళ్లి కాకుండా తల్లి అయ్యిందని చెప్తే నా పరువు పోతుందని చెప్పలేదా? అందరితో కాకుండా కనీసం అమృత ఆంటీ భవానీ అత్తయ్యతో అయినా చెప్పొచ్చు కదా. లేకపోతే నేను నిజంగానే తల్లిని కావడం లేదా?
సరోగసి ప్రాసెస్ సరిగా జరగలేదా? అసలు నేనే సరోగసి మథర్ అని కృష్ణకి తెలుసా? కృష్ణకి చెప్పాడా లేదా అనుకుంటుంది. వెంటనే ఈ విషయం గురించి మురారికి మెసేజ్ చేస్తుంది. సరోగసి మథర్ నేనే అని కృష్ణకి చెప్పారా అంటే లేదని చెప్తాడు.
మీరా ప్రెగ్నెంట్
మీరా ఈ మెసేజ్ చేసిందంటే తల్లి కాబోతుందా లేదా అని డౌట్ వచ్చిందేమో? సరోగసి ప్రాసెస్ సక్సెస్ కాలేదా నిజంగానే మీరా తల్లి కావడం లేదా అని మురారి కూడా టెన్షన్ పడతాడు. మురారి మెసేజ్ చేయబోతుంటే కృష్ణ వచ్చి లాగేసుకుంటుంది.
ఘోరం జరిగిపోయింది. ముందు నుంచి చెప్తున్న మీరా మంచిది కాదని. వెంటనే ఆలస్యం చేయకుండా ఆదర్శ్ తో మీరా పెళ్లి చేయాలని అంటుంది. వాళ్ళ పెళ్ళికి ఏం తొందర వచ్చిందని మురారి కోపంగా నిలదీస్తాడు.
మీరా గర్భవతి. పూజలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా అప్పుడే తెలిసింది తను తల్లి కాబోతుందని చెప్తుంది. మురారి ఊపిరి పీల్చుకుంటాడు. మురారి టెన్సిన్ గా రిలీఫ్ అవుతాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని అంటాడు.
మీరా తల్లి కాబోతుందని అందరికీ తెలిసే లోపు ఆదర్శ్ తో పెళ్లి చేస్తే ఏ సమస్య ఉండదని కృష్ణ అంటుంది. ఆదర్శ్ తో పెళ్లి అంటావ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అని సీరియస్ అవుతాడు. మీరా తల్లి కావడానికి ఆదర్శ్ కారణమని కృష్ణ అంటుంది.
మీరానే సరోగసి మథర్
పెద్దత్తయ్యకి చెప్పి వెంటనే వాళ్ళ పెళ్లి చేద్దామని అంటుంది. వాళ్ళ పెళ్లి జరగడానికి వీల్లేదని మురారి అనేసరికి కృష్ణ షాక్ అవుతుంది. ఆదర్శ్ కి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధం లేదని చెప్తాడు. మరి దానికి కారణం ఎవరో మీకు తెలుసా అని నిలదీస్తుంది.
మీరా తల్లి కావడానికి కారణం మనమే అని చెప్తాడు. మీరా కడుపులో పెరుగుతుంది మన బిడ్డ అనేసరికి కృష్ణ షాక్ అయిపోతుంది. సరోగసి మథర్ ఎవరని అడిగావ్ కదా అది ఎవరో కాదు ఆ మీరానే. తనే ఇప్పుడు మన బిడ్డని మోస్తుంది. అందుకే ఆదర్శ్ తో పెళ్లి చేయడం కుదురదని చెప్తాడు.
మధు కథ రాస్తుంటే భవానీ వస్తుంది. మంచి కథ రాస్తే తానే నిర్మిస్తానని మాట ఇస్తుంది. మధుని చూసి సంగీత మురిసిపోతుంది. సరోగసి మథర్ ని దగ్గరుండి చూసుకుంటానని అన్నావ్ కదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అని మురారి అడుగుతాడు.
మీరా మంచిది కాదు
అదే నా ప్రాబ్లం మీరా కాకుండా ఎవరైన అయితే బాగుండేది. నా బిడ్డని మోస్తుందని తెలిస్తే ఎగిరి గంతేసే దాన్ని అంటుంది. మీరా మన బిడ్డని మోస్తే ఏంటి సమస్య అంటాడు. మీరా మనం అనుకున్నంత మంచిది కాదు. పైకి ఒకలాగా ఉంటుంది లోపల మరొకలాగా ఉంటుందని చెప్తుంది.
తన ఆలోచనల్లో ఏదో తప్పు ఉందని భయంగా ఉంది. సరోగసి మథర్ గా ఉండమని మీరు బతిమలాడారా? అంటే లేదు తన ఇష్టంతోనే ముందుకు వచ్చిందని చెప్తాడు. అదే నా డౌట్ ఒక ఆడది సరోగసికి ఒప్పుకోవడం ఎంత కష్టమో తెలుసా?
పెళ్లి చేసుకున్న వాళ్ళు సరోగసిగా ఉండటానికి చాలా ఆలోచిస్తారు. అలాంటిది పెళ్లి కాని అమ్మాయి ముందుకు వచ్చిందంటే ఏ ఆశ ఆలోచన లేకుండా వచ్చిందంటే నమ్ముతారా అంటుంది. తనకు మన కుటుంబం అంటే ఇష్టం. పెద్దమ్మ వారసులు లేక బాధపడుతున్నారని తన బాధ చూడలేక సరోగసి చేయాలని అనుకుందని అంటాడు.
అందుకే చెప్పలేదు
వారసులుగా ఉండటానికి ఎవరైనా ఒప్పుకోవచ్చు కానీ ఇలా చేసిందంటే ఒక రకంగా తన జీవితాన్ని త్యాగం చేసినట్టు. ఎంత ఆశ్రయం ఇచ్చినా ఏ లాభం లేకుండా ఇంత త్యాగం చేస్తుందంటే నమ్మాలని లేదని చెప్తుంది.
ఈ ప్రాసెస్ జరగడానికి ముందే మీకు చెప్పింది కదా ముందే ఎందుకు చెప్పలేదని అంటుంది. సరోగసి మథర్ మీరా అని చెప్పి థ్రిల్ చేయడానికి నీ దగ్గరకు వచ్చాను కానీ అప్పటికే నువ్వు మీరా మీద చెడు అభిప్రాయంతో ఉన్నావ్. చెప్తే వద్దని అంటావని చెప్పలేదని అంటాడు.
సరోగసి మథర్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. ఒకవైపు పెద్దమ్మ నువ్వు నెల తప్పావని సంబరాలు మొదలుపెట్టింది. ఆ టైమ్ లో దేవతలా వచ్చింది మీరా. ఈ విషయంలో సంతోషించకుండా మనసులో ఏవేవో అనుమానాలు పెట్టుకుని టెన్షన్ పడతావ్ ఏంటి?
ఆదర్శ్ మీరాని ప్రేమిస్తున్నాడు
మీరాని తప్పుగా అర్థం చేసుకున్నావ్ కొంచెం పాజిటివ్ గా ఆలోచించు. మన బిడ్డని మోసే ఆవిడ మన పక్కనే మన ఇంట్లో ఉంటుంది ఇంకేంటి ప్రాబ్లం అంటాడు. అదే ప్రాబ్లం ఏసీపీ సర్ వేరే ఎక్కడైనా ఉంటే నేనేమైనా చేసేదాన్ని హాస్పిటల్ చెకప్ అని చెప్పి తనని చూసుకునే దాన్ని.
కానీ ఇప్పుడు తను మన ఇంట్లోనే ఉంటుంది. సరోగసి అంటే హాస్పిటల్, టెస్ట్ అంటారు. తల్లి కాబోతుందని తెలిసిపోతుంది. నిజం బయటపడుతుంది. అప్పుడు ఏం చేస్తారు. పైగా దీని వల్ల మనం ఆదర్శ్ ని బలి చేస్తున్నాం. ఆదర్శ్ మీరాని ప్రేమిస్తున్నాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
భవానీ కృష్ణ, రేవతిని పిలిచి మాట్లాడుతుంది. ఆదర్శ్, ముకుందకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నట్టు చెప్తుంది. పంతులిని పిలిపించి ముహూర్తం పెట్టించాలని అంటే కృష్ణ వద్దని కంగారుగా చెప్తుంది. అటు మురారి కూడా షాక్ అవుతాడు. వాళ్ళ పెళ్లి అనగానే పక్కన బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డావ్ ఏమైందని భవానీ కృష్ణని అడుగుతుంది.