Krishna mukunda murari serial: మురారి దక్కకపోతే బిడ్డని తీయించేస్తానని బెదిరించిన ముకుంద.. నిజం దాచిన కృష్ణ-krishna mukunda murari serial today may 23rd episode krishna stunned after mukunda reveals her true identity to her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: మురారి దక్కకపోతే బిడ్డని తీయించేస్తానని బెదిరించిన ముకుంద.. నిజం దాచిన కృష్ణ

Krishna mukunda murari serial: మురారి దక్కకపోతే బిడ్డని తీయించేస్తానని బెదిరించిన ముకుంద.. నిజం దాచిన కృష్ణ

Gunti Soundarya HT Telugu
May 23, 2024 07:58 AM IST

Krishna mukunda murari serial today may 23rd episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తానే ముకుంద అని జరిగిన విషయాలు మొత్తం కృష్ణకి చెప్పేస్తుంది. మురారి దక్కేవరకు ఇలాగే ఆట సాగుతుందని బెదిరిస్తుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 23వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 23వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 23rd episode: సరోగసి ద్వారా మళ్ళీ బిడ్డని కనబోతున్నామని కృష్ణ చెప్తుంది. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది. సరోగసి చేయించుకోవడం వల్ల కదా ఇంట్లో చెప్పకుండా ఇబ్బంది పడుతున్నారు కొద్ది రోజులు ఆగాక చేయవచ్చు కదాని అంటుంది.

చెంప పగలగొట్టిన కృష్ణ 

ఇప్పుడు కూడా ఇంట్లో చెప్పి చేయాలనే అనుకుంటున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు ఇంకేమైనా ఉంటే చెప్పమని కృష్ణ అడుగుతుంది. ఇంకేమైనా చెప్పాలా అని కృష్ణ పదే పదే రెట్టించి అడుగుతుంది. ఏం లేదని అనేసరికి కృష్ణ లాగిపెట్టి మీరా చెంప పగలగొడుతుంది.

నా బిడ్డని నీ కడుపులోనే ఉంచుకుని తీయించేశానని అబద్ధం చెప్పావని అంటుంది. ఎందుకు మాతో అబద్ధం చెప్పావు, బిడ్డని నీ కడుపులోనే పెట్టుకుని ఎందుకు నాటకాలు ఆడుతున్నావని తన జుట్టు పట్టుకుని అడుగుతుంది. నీ లాంటి దుష్టురాలి కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే నిజం కలిచి వేస్తున్నా పెరుగుతుంది నా బిడ్డ కాబట్టి వదిలేస్తున్నా అంటుంది.

అసలు ఎవరు నువ్వు?

మీరా నవ్వుతుంది. ఎందుకు అబద్దం ఆడావు, ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్? నీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు పాముల్లా వాడుకుంటున్నావ్? అసలు ఎవరు నువ్వు? నా కుటుంబానికి నీకు ఏంటి సంబంధమని అడుగుతుంది.

దర్జాగా కుర్చీలో కూర్చుని దాహంగా ఉంది వాటర్ తీసుకురా నాకోసం కాదు నా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమని అంటుంది. నీకు ఎవరి పేరు వింటే కోపం చిరాకు పుట్టుకు వస్తాయో, ఎవరిని చూస్తే తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుందో ముకుంద.. ఆ ముకుందని నేనే.

ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ముకుంద ఏంటి?నిజం చెప్పమంటావ్ చెప్తే నమ్మవు. నేను మీరా కాదు ముకుంద. ముకుందలా ఉండి మురారిని గెలవలేనని అర్థం అయ్యింది. అందుకే చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా మీరాలా మారిపోయాను.

అందుకే రూపం మార్చుకున్నా 

మురారిని చూసి నాకు ఈ ఐడియా వచ్చింది. తను రూపం మార్చుకున్నాడు తనని పొందటం కోసం నేను రూపం మార్చుకుంటే తప్పు ఏంటి?పైగా ఆ రూపం నాకు కలిసి రాలేదు. వేరే రూపంతో ట్రై చేద్దామని ఈ రూపానికి వచ్చాను.

ఈ రూపం నాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఒకప్పుడు మురారిని తాకడానికి ఛాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మురారి బిడ్డని కడుపులో పెట్టుకుని మిమ్మల్ని శాసించే స్థాయికి వచ్చాను. నిన్ను జైలుకి పంపించే పని మా నాన్నకి చెప్తే మా నాన్న మురారిని జైలుకు పంపించాడు.

నీ గర్భసంచి పోగొట్టింది నేనే 

మురారిని విడిపించుకుని అత్తయ్య దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి మళ్ళీ మన ఇంట్లోకి అడుగుపెట్టాను. నువ్వు పిల్లల్ని కంటే మురారి నాకు దక్కడని నీ గర్భసంచిని పోగొట్టి సరోగసి ఐడియా నేనే ఇచ్చి బిడ్డని నేనే సరోగసి మథర్ అయి సక్సెస్ ఫుల్ గా బిడ్డని నా కడుపులో పెట్టుకుని ఇలా నీ ముందు నిలబడ్డాను.

ఇదంతా నిజం కృష్ణ. అయినా నమ్మకపోతే నా కడుపులో ఉన్న నీ బిడ్డ మీద ఒట్టు అనగానే కృష్ణ ముకుంద అని గట్టిగా అరుస్తుంది. ఎంతకు తెగించావే నువ్వు అసలు మనిషివేనా అంటుంది. మురారి కోసం ఎంతకైనా తెగిస్తాను.

నేనే ముకుంద అని తెలిసిపోయింది కాబట్టి ఈ విషయం ఎవరితో అయినా చెప్పి నన్ను ఏదో చేయాలని ఆలోచిస్తున్నావ్ ఏమో పొరపాటున ఈ విషయం ఎవరితో అయినా చెప్తే బిడ్డని తీయించేసుకుని నీకు గర్భం రాదని నీకు జీవితాంతం బిడ్డలు పుట్టరని గొడ్రాలిగా ఉంటావని భవానీ అత్తయ్యకు నిజం చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించి మురారిని నా వాడిని చేసుకుంటాను.

మురారి కావాలి 

స్టాపిడ్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ నీకు ఏం కావాలని కృష్ణ అడుగుతుంది. మురారి కావాలి నువ్వు ఇచ్చే వరకు నేను తీసుకునే వరకు ఇలాగే జరుగుతుంది. నీ బిడ్డ సాక్షిగా చెప్తున్నా ఇది నిజం అనేసి వెళ్ళిపోతుంది. కృష్ణ ఒక్కసారిగా కూలబడిపోతుంది.

మురారి టెన్షన్ గా ఇంటి దగ్గర కృష్ణ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. ఏమైందని అడుగుతుంది. గట్టిగా నిలదీస్తే ఆట పట్టించడానికని చెప్పిందని అబద్ధం చెప్తుంది. మురారి దగ్గర నిజం దాస్తుంది. వేరే కారణం ఏమి లేదు కదాని మురారి మళ్ళీ అడుగుతాడు. లేదని అంటుంది.

మీరాని జాగ్రత్తగా చూసుకుందాం 

జరిగింది మర్చిపోయి మీరాని జాగ్రత్తగా చూసుకుందామని చెప్తాడు. రెండు రోజులు చిన్నాన్న దగ్గరకు వెళ్తానని కృష్ణ అడుగుతుంది. మురారిని కూడా రమ్మని అడిగితే మనం ఎవరం లేకపోతే మీరాని ఎవరు చూసుకుంటారని అంటాడు.

కృష్ణ బాధగా భవానీ దగ్గరకు వస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావని భవానీ అంటుంది. అదేమీ లేదని చెప్తుంది. చిన్నాన్న దగ్గరకు వెళ్ళి వస్తానని అడుగుతుంది. హ్యాపీగా వెళ్ళి రమ్మని చెప్తుంది. కృష్ణ ఏడుపు ఆపుకోలేక భవానీ కాళ్ళ మీద పడుతుంది.

ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావని ప్రేమగా అడుగుతుంది. మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కానీ మోసం చేస్తున్నానని కృష్ణ బాధపడుతుంది. పెద్దపల్లి ప్రభాకర్ భార్య పీడకల వచ్చిందని భయపడుతుంది. కిట్టయ్యకి కీడు జరుగుతున్నట్టు వచ్చిందని అంటుంది.

మనం అంతా ఉండగా కిట్టయ్యకి ఏం కాదని ప్రభాకర్ తిడతాడు. అప్పుడే కృష్ణ ఇంటికి వస్తుంది. తనని చూసి చాలా సంతోషిస్తారు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024