krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ
krishna mukunda murari serial today may 20th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అబార్షన్ చేయించుకున్నట్టు మీరా కృష్ణ వాళ్ళకి చెప్తుంది. దీంతో కృష్ణ బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
Krishna mukunda murari serial today may 20th episode: మీరా ఫోన్ చేసి కలవాలని చెప్పినట్టు మురారికి చెప్తుంది. వాళ్ళు బయటకు వెళ్లబోతుండగా భవానీ పిలుస్తుంది. మీరా బయట నుంచి రాగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని గట్టిగా చెప్తుంది.
రెస్టారెంట్ లో ఉన్న మీరా దగ్గరకు మురారి, కృష్ణ వస్తారు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావ్ అసలే ఒట్టి మనిషివి కూడా కాదని కృష్ణ వాళ్ళు కంగారుగా అడుగుతారు. ఏమైంది ఎక్కడికి వెళ్ళావని కృష్ణ మళ్ళీ అడుగుతుంది.
అబార్షన్ చేయించుకున్న మీరా
మీరా ఒక లెటర్ కృష్ణకి ఇస్తుంది. అది చూసి కృష్ణ షాక్ అవుతూ ఏడుస్తుంది. మురారి ఆ లెటర్ తీసుకుని చూసి కోపంతో రగిలిపోతాడు. కృష్ణ కోపంగా మీరా చెంప చెల్లుమనిపిస్తుంది. ఎంత పని చేశావే నా బిడ్డని నీ కడుపులో చల్లగా పెంచుతానని మాట ఇచ్చి గర్భం తీయించుకుంటావా?
నా బిడ్డని పొట్టన పెట్టుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఎవరిని అడిగి చేశావని నిలదీస్తుంది. కారణం నువ్వే కృష్ణ నీకోసమే చేశానని అంటుంది. నాకోసం నా బిడ్డని నాకు కాకుండా చేయడం ఏంటని నిలదీస్తారు.
కృష్ణ కోసమే ఇలా చేశాను
కృష్ణ కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కడుపులో ఉండటం కంటే తీసేయడమే మంచిదని చేశానని చెప్తుంది. చంపేస్తానని కృష్ణ కోపంగా మీరా గొంతు పట్టుకుంటుంది.
బిడ్డ కోసం ఎన్ని పాట్లు పడ్డానో తెలుసా? నాకు ఆ యోగం లేదని ఎంత కుమిలిపోయానో తెలుసా? మామాన మేము ఎవరో ఒక మంచి ఆవిడ దొరకపోతుందా అని ఎదురుచూస్తుంటే సంబంధం లేకుండా నువ్వు మధ్యలో వచ్చి నా బిడ్డని నీ కడుపులో వేసుకుని ఇప్పుడు ఏదో కారణంతో తీసేసి నేనే కారణం అంటావ్ ఏంటి?
అవును నువ్వే కారణం. నీ బాధ చూడలేక నేను బిడ్డని తీసేశాను. గర్భం ఉందని ఎన్ని రోజులు నాటకం ఆడుతావ్. మోసం చేస్తున్నాననే బాధతో ఎంత కుమిలిపోతావు. ఆ బాధ చూడలేక తీసేశాను. ఇప్పుడు బిడ్డ లేదు వెళ్ళి చెప్పేసేయ్. ఏదో ఒక కారణం వల్ల నీ గర్భం పోయిందని చెప్పు ఏ గోల ఉండదు.
మళ్ళీ సరోగసి చేయించుకోండి
ఇంకా సానుభూతి కూడా వస్తుందని అంటుంది. ఆ మాత్రం చెప్పలేక ఇన్ని పాట్లు పడిందని అంటాడు. ఇప్పుడు చేయించుకున్నట్టే సరోగసి చేయించుకోండి. మళ్ళీ ఇంకోకరిని చూసి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నేను కాకుండా వేరొకరు అయితే లాభం కూడా.
పెళ్లి ఆపాలనే టెన్షన్ కూడా ఉండదు. ఒకవేళ ఆపినా దొరికిపోతామనే భయం ఉండదు. నీ కడుపులో ఉన్న నా బిడ్డ ఆదర్శ్ తో పెళ్ళికి అడ్డం అందుకే బిడ్డని తీసేసి ఏవేవో కారణాలు చెప్తున్నావ్. ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్న బిడ్డని తీసేశావ్. అసలు నువ్వు మనిషివేనా అంటుంది.
ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఎందుకు సరోగసికి ఒప్పుకుంటాను. ముందు ఆదర్శ్ పెళ్లి చేసుకుంటాడని నమ్మకం లేదు ఇప్పుడు పెద్దమ్మ ముహూర్తాలు పెట్టేసరికి ఆశ కలిగింది ఏమోనని మురారి అంటాడు. అలాంటి దురాశ నీ మనసులో ఉంటే మాకు చెప్పొచ్చు కదా.
మొత్తం విన్నాను
మేమే మీ పెళ్లి చేసి తొమ్మిది నెలలు బిడ్డని మోసే అవకాశం ఇవ్వమని ఆదర్శ్ కాళ్ళు పట్టుకుని బతిమలాడేవాళ్ళం కదా అని కృష్ణ ఏడుస్తుంది. రాత్రి నువ్వు భవానీ మేడమ్ తో మాట్లాడింది నేను విన్నాను. నాకు టెస్ట్ చేసి గర్భవతి అని తెలిస్తే ఏమవుతుందని నువ్వు పడిన టెన్షన్ చూశాను.
నీ చేత్తో నువ్వు నీ బిడ్డని తీయాల్సి వస్తుందని నేనే తీసేశాను. ఇదంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేనని వెళ్ళిపోతుంది. కృష్ణ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆదర్శ్ ఇంటి దగ్గర ముకుంద ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడే ముకుంద వస్తుంది. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి వెళ్ళినట్టు అబద్ధం చెప్తుంది. భవానీ వచ్చి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఆదర్శ ముకుందని వెనకేసుకొస్తుంటే భవానీ కృష్ణ రానివ్వు అంతా బయట పడుతుందని అంటుంది.
చచ్చిపోవాలని అనిపిస్తుంది
కృష్ణ బాధపడుతుంటే మురారి ఓదార్చడానికి చూస్తాడు. నేనే లేకపోయి ఉంటే మీ జీవితం బాగుండేది. నా దురదృష్టం మీకు అంటుకుంది. చచ్చిపోవాలని అనిపిస్తుందని కృష్ణ ఏడుస్తుంది. తప్పు నాదే మీరా గురించి నువ్వు చెప్పినా వినిపించుకోలేదు.
నువ్వే కరెక్ట్ తను బయటకు కనిపించేది వేరు లోపల వేరు. మనల్ని అడగకుండానే బిడ్డని వేసుకుంది ఇప్పుడు తీసేసిందని అంటాడు. ఇప్పుడు పెద్దత్తయ్యకి ఏం చెప్పాలని కృష్ణ బాధపడుతుంది. ఇకపై నీ కడుపులో బిడ్డ జాగ్రత్త అనే ప్రతి సారి గుండెల్లో గుచ్చినట్టు అనిపిస్తుందని ఏడుస్తుంది.
మనం ఎందుకు నిరుత్సాహపడటం.. స్టార్టింగ్ లోనే ఇలా జరిగింది. ఇది మన మంచికేనని అంటాడు. మనం ఒకరికొకరం ఎప్పటికీ తోడుగా ఉందామని ధైర్యం చెప్తాడు. రజిని ఒంటరిగా ఉంటే భవానీ వచ్చి మాట్లాడుతుంది. నీ కొడుకుతో నా కూతురు పెళ్లి చేస్తావని ఆశతో వస్తే అడియాసలు అయ్యాయని అంటుంది.
అప్పుడు ముకుంద ఇప్పుడు మీరా
ఇష్టం లేని వ్యక్తితో ఎలా కాపురం చేస్తామని నీ కూతురు చాలా క్లియర్ గా ఉంది దాని గురించి పట్టించుకోవద్దని భవానీ అంటుంది. అప్పుడు ముకుంద అడ్డు వచ్చింది, ఇప్పుడు మీరా అడ్డు వచ్చింది. నువ్వు ఇచ్చిన మాట తప్పావని రజిని అంటుంది.
చేసుకునేవాడికి ఇష్టం ఉండాలి. ఇప్పటికే భార్యని కోల్పోయాడు. ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసి ప్రయోజనం ఏముంది. బంగారం లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానని భవానీ రజినికి మాట ఇస్తుంది.
కృష్ణ వాళ్ళు బాధగా ఇంటికి వస్తారు. అప్పుడే ఇంటికి పెళ్లి కళ వచ్చింది అందరూ ఎంత సంతోషంగా ఉన్నారని అంటుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
కృష్ణ భోజనం చేస్తుంటే పొలమారుతుంది. మీరా మంచి నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ చెవిలో చిన్నగా మాట్లాడుతుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీరే ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. ఆపలేదంటే మీ విషయం మొత్తం చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీంతో కృష్ణ కళ్ళు తిరిగిపడిపోతుంది.
టాపిక్