Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి-krishna mukunda murari serial may 16th episode krishna shares her doubts about mukunda behaviour with murari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Gunti Soundarya HT Telugu
May 16, 2024 08:16 AM IST

Krishna mukunda murari serial may 16th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కృష్ణకి పట్ట పగలే చుక్కలు చూపించాలని ముకుంద డిసైడ్ అవుతుంది. అటు మీరా సరోగసి మథర్ గా ఉండటం వెనుక ఏదైనా కుట్ర ఉందేమోనని కృష్ణ అనుమానపడుతుంది.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 16వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 16వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial may 16th episode: నువ్వు చేసే పనుల వల్ల సమస్యకు దూరం కావడం కాదు దగ్గర అవుతున్నామని కృష్ణ అంటుంది. అయితే పెళ్ళిని ఆపేయండి. ఆదర్శ్ నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు. కానీ మీకు కజిన్ కదా తనే ఈ పెళ్లి వద్దని అనుకునేలా చేయండి. అంతే కానీ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని బరువు నా నెత్తి మీద వేయకండి అంటుంది.

మధు చెంప పగలగొట్టిన రజిని

కడుపులో బిడ్డ ఉండటం వల్ల నాకు నీరసంగా ఉందని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోతుంది. సంగీత మధు దగ్గరకు తనని హీరోయిన్ చేయమని అడుగుతుంది. వద్దు నువ్వు అమాయకురాలివి ఈ ఫీల్డ్ లోకి రావద్దు ఇందులో బయట కూడా నటించాలని అంటాడు. ఎవరైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని భుజం మీద చెయ్యి వేసి చెప్తాడు.

రజిని వెంటనే మధుని చెంప మీద కొడుతుంది. నా కూతురు భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతావా? అని తిడుతుంది. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దని సంగీత తల్లిని ఎదిరిస్తుంది. కృష్ణ,మురారి మీరా చేసిన పనికి తలలు పట్టుకుని కూర్చుంటారు.

పెళ్లి ఎలా ఆపాలి?

ఇప్పుడు ఏం చేద్దామని ఒకేసారి అంటారు. ముకుంద వల్ల ఇద్దరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైందని మురారి అంటాడు. అందుకే మీరా సరోగసి మథర్ అంటే టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు చూడండి ఈ పెళ్లి ఎలా ఆపాలో చేయాల్సి వస్తుందని కృష్ణ బాధగా చెప్తుంది.

పెద్దత్తయ్య కళ్ళలో కళ్ళు పెట్టి అబద్ధం చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. బిడ్డ కావాలని కలలు కంటే ఆ అవకాశం లేకుండా పోయింది. వేరే కడుపున మోసే అవకాశాన్ని ఉపయోగించుకుందామని అంటే అడుగడుగునా ఆటంకాలు ఏం చేయాలని కృష్ణ చాలా బాధపడుతుంది.

ఇవే కాదు చాలా సమస్యలు వస్తాయి వాటిని అధిగమించాలి. ముందు ఈ పెళ్లి జరగకుండా ఆపాలని మురారి అంటాడు. ఇప్పుడు నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదని కృష్ణ అంటుంది. వీల్లేదు ఇప్పుడు నిజం బయట పెడితే చాలా సమస్యలు వస్తాయని మురారి చెప్తాడు.

ఆదర్శ్ పెళ్లి బాధ్యత మీదే 

ఎదురుగా భవానీ ఉంటుంది. తనని చూసి ఇద్దరూ టెన్షన్ పడతారు. ఏమైందని భవానీ అడుగుతుంది. దేని గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారని అంటే ఆదర్శ్ పెళ్లి గురించని మురారి, కృష్ణ అబద్ధం చెప్తారు. ఏ టెన్షన్ లేదు కదాని భవానీ మరోసారి అడుగుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని చెప్తారు.

ఆదర్శ్, మీరాల పెళ్లి బాధ్యతను మీ మీద పెడుతున్నానని భవానీ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి ఏసీపీ సర్ ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేయగలమా అని కృష్ణ అడుగుతుంది. ముకుంద తెగ సిగ్గుపడిపోతూ డైరీ రాసుకుంటుంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.

ఒకవైపు గర్భవతి అనే అబద్ధం, మరోవైపు పెళ్లి ఆపె బాధ్యత. ఇవి చాలు కృష్ణని ఇంట్లో నుంచి బయటకు పంపించేయడానికి. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే రోజు నా చెంప మీద కొట్టావు. ఈరోజు నుంచి నువ్వు బయటకు వెళ్ళే వరకు పట్టపగలు చుక్కలు చూపిస్తానని అనుకుంటుంది.

కథ అంతా నా గుప్పిట్లోనే 

ముకుంద అంతరాత్మ బయటకు వస్తుంది. అది అంత ఈజీ కాదని అంటుంది. ఈ బిడ్డ కోసం పెళ్లి ఖచ్చితంగా ఆపుతారు. నేనే సరోగసి మథర్ అని తెలిసిపోతుంది. కృష్ణ చేసిన నేరానికి ఈ ఇంట్లో ఉండనివ్వరు. ఉండనిచ్చినా ఎవరికీ మొహం చూపించలేక బయటకు పోతారు. అప్పుడు మురారి నా వాడు అవుతాడు.

ఒకవేళ నువ్వే ముకుంద అని బయట పడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తారు ఇప్పుడు కృష్ణ ఉన్న పరిస్థితిలో ఏం చేసినా నన్ను ఏం చేయలేరు. మురారి కూడా ఏం చేయలేడు. ఎప్పుడైతే మురారి బిడ్డ నా కడుపులోకి వచ్చేసిందో అప్పుడే మొత్తం నా గుప్పిట్లోకి వచ్చేసింది.

భవానీ తర్వాత ఈ ఇంట్లో రాజమాత సింహాసనం నాదే అని ముకుంద అనుకుంటుంది. ఇప్పటి వరకు కృష్ణ మీద విజయం సాధించినదే లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాదు ఆలోచించి తీసుకోమని అంతరాత్మ అంటుంది. ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో తాను లేనని మురారి ప్రేమ కోసం ఏమైన చేయడానికి సిద్ధమని అంటుంది.

మీరా ఆలోచన వెనుక కుట్ర ఉందా?

కృష్ణ తల దువ్వుకుంటుంటే దువ్వెన ఎగిరి మురారి మొహం మీద పడుతుంది. నిన్న మీరా పుట్టినరోజు కదా ముకుంద పుట్టిన రోజు కూడా అదే అలా ఎలా అయ్యిందో అని కృష్ణ డౌట్ పడుతుంది. కానీ మురారి మాత్రం అలా ఏం లేదు ఏవేవో ఊహించుకోవద్దని చెప్తాడు.

నాకు మాత్రమే ఈ డౌట్ ఎందుకు వస్తుందని, నేను అపోహ పడుతున్నానా? అనుకుంటుంది. మీరా సరోగసి మథర్ గా ఉండాలని అనుకుంటున్నట్టు ముందే ఎందుకు చెప్పలేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? నాకు ఎందుకో అనుమానంగా ఉందని చెప్తుంది.

మీరా ప్రవర్తన చిరాకు తెప్పిస్తుందే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పెళ్లి ఆపడం, తన కడుపులో ఉన్న బిడ్డని బాగా చూసుకోవడం అంటాడు. భవానీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడం కోసం పంతులిని పిలిపిస్తుంది. ఆదర్శ్ చాలా ఆత్రంగా ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని అడుగుతాడు.

బాగా ఇరుక్కున్నారు 

మురారి, కృష్ణ పంతులు ముహూర్తాలు పెట్టడం చూసి షాక్ అవుతారు. కృష్ణ వాళ్ళ పరిస్థితి చూసి ముకుంద తెగ సంబరపడిపోతుంది. దగ్గరలో ముహూర్తాలు లేకపోతే బాగుండని కృష్ణ అనుకుంటుంది.

కృష్ణకి నెలలు నిండకముందే పెళ్లి జరిగిపోవాలి, ఈ తింగరి అల్లరి చేస్తేనే ఆనందంగా ఉంటుంది. ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అలా అని పనులన్నీ నెత్తిన వేసుకోకు. ఈ పెళ్లి బాధ్యత మీ ఇద్దరిదే అంటుంది. బాగా ఇరుక్కున్నారని ముకుంద అనుకుంటుంది. అక్కడితే నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది. 

తరువాయి భాగంలో..

భోజనం చేస్తుంటే ముకుందకు వాంతులు అవుతాయి. మురారి వెంటనే వెళ్ళి తన చెవులు మూస్తాడు. ఇప్పుడు ఒకేనా అని అడుగుతాడు. ఇప్పటి నుంచి నువ్వు నా వెంట పడతావని ముకుంద సంతోషపడుతుంది. కడుపుతో ఉన్న కృష్ణకి వాంతులు రావడం లేదు పెళ్లి కానీ ముకుంద వాంతులు చేసుకుందని రజిని అంటుంది.

 

IPL_Entry_Point