Krishna mukunda murari serial today: కృష్ణకి షాకుల మీద షాకులు ఇస్తున్న మీరా.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
Krishna mukunda murari serial today may 15th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. కృష్ణకి ముకుంద షాకుల మీద షాకులు ఇస్తుంది. ఆదర్శ్ తో చనువుగా ఉంటూ కృష్ణ వాళ్ళని టెన్సిన్ పెడుతుంది.
Krishna mukunda murari serial today may 15th episode: ఆదర్శ్ , ముకుందకు వీలైనంత త్వరగా పెళ్లి చేద్దామని రేవతి కూడా అంటుంది. కృష్ణ కంగారుగా వద్దని అరుస్తుంది. ఎందుకు వద్దని అంటున్నావని రేవతి అడుగుతుంది. వాళ్ళ పెళ్లి అనగానే పక్కన బాంబు పడినట్టు ఉలిక్కిపడ్డావ్, మొహంలో కంగారు ఏమైందని భవానీ అడుగుతుంది.
నిజం చెప్పమన్న భవానీ
వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదని కృష్ణ అంటుంది. నువ్వు పడే కంగారు అలా అనిపించడం లేదు నా కళ్ళలోకి చూసి చెప్పమని భవానీ అడుగుతుంది. అంతే వేరే కారణం లేదని కృష్ణ కవర్ చేస్తుంది.
ఆదర్శ్ చేసుకుంటానని రాయబారం పంపించాడు ఇంకేముందని అంటుంది. మీరా ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అంటుంది. ఇష్టం లేకుండానే వాడితో షాపింగ్ కి వెళ్తుందా? వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు. ఇష్టం లేకపోతే ఆదర్శ్ తో అంత చనువుగా ఉండదని భవానీ చెప్తుంది.
పొద్దున్న డైనింగ్ టేబుల్ దగ్గర నేను అన్న మాటకు ఆదర్శ్ ని చూసి సిగ్గుపడింది. ఇక ఇష్టాయిష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా అని ఎదురుచూస్తున్నారని రేవతి కూడా చెప్తుంది. అప్పుడు ముకుందతో కూడా ఇలాగే తొందరపడి పెళ్లి చేశారు కదా తర్వాత ఏం జరిగిందో చూశాం కదా.
ముకుందకు ఆ అర్హత ఉంది
ఏదో ఒకటి రెండు సంఘటనలు చూసి అలా అనుకోవడం కరెక్ట్ కాదు. తను ఆదర్శ్ కి సరిపోతుందో లేదో పెళ్లి చేసినా ఇద్దరు సంతోషంగా ఉంటారో లేదో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని కృష్ణ చెప్తుంది. ఇంకేం అవసరం లేదు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను.
నీకు ఈ ఇంటి కోడలు అయ్యే అర్హతలు ఎన్ని ఉన్నాయో అన్ని అర్హతలు ఆ అమ్మాయికి ఉన్నాయి. ఆదర్శ్ గురించి చెప్పాల్సిన పని లేదు పేరు మార్చి ముకుంద అని పెట్టుకున్నాడని భవానీ అంటుంది. ఈ పెళ్లి జరగడం అన్ని రకాలుగా మంచిదని రేవతి కూడా చెప్తుంది.
టెన్సిన్ లో మురారి
ఎప్పుడైతే నీ కడుపున బిడ్డ పడిందో అప్పటి నుంచి మంచి రోజులు మొదలయ్యాయని ఏమి ఆలోచించవద్దని భవానీ అంటుంది. కృష్ణ ఏడుస్తుంటే మురారి ఏమైందని అడుగుతాడు. జరిగింది మొత్తం మురారికి చెప్తుంది. ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది ఇప్పుడు ఏం చేయాలని అంటుంది.
ఇలా జరుగుతుందని ముందే ఆలోచన వచ్చినా ఎలాగోలా ఆపేవాళ్ళం ఇప్పుడు ఏం చేయాలని మురారి టెన్షన్ పడతాడు. మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కానీ ఎంచుకున్న మనిషి కరెక్ట్ కాదు. పెద్దత్తయ్య పెళ్లి ప్రస్తావన తీసుకుని వస్తుందని తెలుసు కానీ ఇప్పుడే చేస్తుందని అనుకోలేదని అంటుంది.
పెద్దమ్మ ఒక నిర్ణయానికి వస్తే అసలు ఆగదని అంటాడు. ఈ పెళ్లి ఇష్టం లేదని మీరా ఒక్క మాట చెప్తే పెద్దత్తయ్య పెళ్లి చేయదని కృష్ణ అంటుంది. కానీ మీరాని చూస్తే చెప్పేలా లేదని, మన బిడ్డని మోసేది పెద్దమ్మ సంతోషం కోసమని అంటుంది. ఈ పెళ్లి కూడా పెద్దమ్మ సంతోషం కోసమని చెప్తుంది.
కృష్ణ ఊర్లో పెళ్లి
రేపు పెద్దమ్మ సంతోషం కోసం పెళ్లి తప్పదు అంటే మన బిడ్డ పరిస్థితి ఏంటని మురారి చాలా టెన్షన్ పడతాడు. కృష్ణ ధైర్యం చెప్పడానికి చూస్తుంది. మీకు తోడుగా నేను, నాకు తోడుగా మీరు ఉంటారు. మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ప్రపంచాన్ని గెలుస్తాం ఈ సమస్యని గెలవలేమా అంటుంది.
ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలని అంటాడు. బిడ్డ కావాలంటే పెళ్లి జరగదు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అంటాడు. ఆదర్శ్, ముకుంద పెళ్లి గ్రాండ్ గా జరిగేలా ఫంక్షన్ హాల్ చూడమని భవానీ మధుకి చెప్తుంది. ఫంక్షన్ హాల్ ఎందుకు మన కృష్ణ ఊర్లో పెళ్లి చేద్దామని రేవతి సలహా ఇస్తుంది.
అవును మంచి ఐడియా అని భవానీ అంటుంది. పెళ్లంటూ కుదిరితే ఎక్కడ అంటే అక్కడ చేసుకోవచ్చని మురారి అంటాడు. కుదిరితే ఏంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని భవానీ అడుగుతుంది. అప్పుడే ముకుంద వచ్చి అటూ ఇటూ చూస్తుంది.
ఆదర్శ్ గిఫ్ట్ మురిసిన ముకుంద
ఆదర్శ్ కోసం వెతుకుతుందని రజిని అంటుంది. నేను ఆదర్శ్ కోసం వెతకడం లేదు కానీ అందరూ అలాగే అనుకోవాలి అప్పుడే కృష్ణ కుళ్ళి కుళ్ళి చస్తుందని ముకుంద మనసులో అనుకుంటుంది. మురారి మీరా వైపు కోపంగా చూస్తాడు.
అప్పుడే ఆదర్శ్ వస్తాడు. ముకుంద ముందు మోకాళ్ళ మీద కూర్చుని గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ బర్త్ డే విసెష్ చెప్తాడు. ఐలవ్యూ చెప్తాడని కృష్ణ కంగారుపడుతుంది. గిఫ్ట్ తీసుకుని థాంక్స్ చెప్తుంది. ఆదర్శ్ తెలుసుకుని విసెష్ చెప్పాడని అంటుంది.
గిఫ్ట్ ఏంటో చూడమని సంగీత అంటే తర్వాత చూస్తానని ముకుంద అంటుంది. కానీ చూడమని అందరూ అనేసరికి ఓపెన్ చేస్తుంది. అందులో లవ్ సింబల్ చూసి చాలా బాగుందని ముకుంద అంటుంది.
మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తా
ముకుంద బర్త్ డేకి నీ గిఫ్ట్ ఏంటని ఆదర్శ్ అడుగుతాడు. నిన్నే గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నట్టు భవానీ చెప్తుంది. మీ పెళ్ళికి త్వరలోనే ముహూర్తాలు పెట్టించాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. ఆదర్శ్ సంతోషంగా ఉంటాడు. ముకుంద కూడా తెగ సిగ్గుపడుతుంది.
కృష్ణ, మురారి అర్థం కాక అయోమయంగా చూస్తారు. ఇలా నిన్ను ఏడిపించే రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదని ముకుంద అనుకుంటుంది. కృష్ణ, మురారి రెస్టారెంట్ లో ముకుంద కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
ముకుంద వస్తుంది. మీకేం కారులో వచ్చారు నేను క్యాబ్ లో వచ్చాను. అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. పక్కన ఎవరైన తోడుగా ఉంటే బాగుంటుంది కదా అనేస్తుంది. నువ్వు నిజంగానే మా బిడ్డ కోసం ఇలా ఆలోచిస్తున్నావా అని కృష్ణ అడుగుతుంది.
డ్రామా మొదలుపెట్టిన ముకుంద
మీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తుంటే నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని ముకుంద అంటుంది. నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ గా ఉన్నాయా? అని నిలదీస్తుంది. ఆదర్శ్ నీ మీద ఆశలు పెట్టుకుంటున్నాడని తెలుసు కదా వీలైనంత దూరంగా ఉండాలి కదా. తను గిఫ్ట్ ఇస్తే తీసుకోవడం ఏంటి? సిగ్గుపడటం ఏంటని మురారి అడుగుతాడు.
నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు ఆయన ఇస్తే తీసుకోలేదని చెప్తుంది. ఇప్పటి వరకు పెద్దత్తయ్యకి మీ పెళ్లి చేస్తే బాగుండేదని ఆలోచన ఉండేది. ఈ మధ్య నువ్వు సిగ్గుపడుతూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి కన్ఫర్మేషన్ వచ్చేసిందని కృష్ణ అంటుంది.
ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నారని ముకుంద ఏడుస్తూ మాట్లాడుతుంది. గర్భం లేని నీకే మీ అత్తయ్య వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. నేను నిజమైన గర్భవతిని నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా.
నువ్వు గొడ్రాలివి
నీ గర్భం పోయింది. గొడ్రాలివి అని బయట పడకుండా ఉండటం కోసం ఇంట్లో బ్రహ్మాండంగా నాటకం ఆడుతున్నావ్ అనేసరికి మురారి కోపంగా ముకుంద అంటాడు. ఏ మాత్రం ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తే కారణం ఏంటని అడుగుతాడు. ఎంత చెప్పినా నిజం బయట పడిపోతుంది.
అందుకే నీ అంత కాకపోయినా అదే రేంజ్ లో నటిస్తున్నాని డ్రామా ఆడుతుంది. నువ్వు చేసే ప్రతి పని సమస్యకు దగ్గర అయ్యేలా చేస్తుందని కృష్ణ అంటే అప్పుడు ఆ పెళ్లి ఆపమని మీరా అంటుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
ఇంట్లో ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడానికి భవానీ పంతులిని పిలిపిస్తుంది. ఈ పెళ్లి బాధ్యత కృష్ణ, మురారికి అప్పగిస్తుంది. వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పేసరికి కృష్ణ షాక్ అయిపోతుంది.
టాపిక్