Mars nakshtra transit: రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు-mars nakshatra transit these zodiac signs will increase bank balance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Nakshtra Transit: రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు

Mars nakshtra transit: రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu

Mars nakshtra transit: అంగారకుడు మరో రెండు రోజుల్లో తన నక్షత్రాన్ని మార్చుకుంటాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి ధనవంతులు కాబోతున్నారు.

నక్షత్రం మారబోతున్న కుజుడు

Mars nakshtra transit: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశి చక్రాన్ని మాత్రమే కాకుండా నక్షత్రాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి. ఇది మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కుజుడు మే నెలలో రాశిని మార్చుకోడు కానీ మే 15న తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు.

ధైర్యం, శౌర్యం, శక్తి, ఆత్మవిశ్వాసానికి కారకుడిగా అంగారకుడిని పరిగణిస్తారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు అంగారక గ్రహం నక్షత్ర సంచారం లేదా రాశి మార్పు వల్ల ప్రభావితం అవుతాయి. మే 15 నుంచి కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రేవతి నక్షత్ర ప్రభావం

ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. విద్యలో చక్కగా రాణిస్తారు. డబ్బుని ఖర్చు పెట్టె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఇతరులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. అందువల్ల విజయం వీరిని త్వరగా చేరుకుంటుంది. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని సునాయాసంగా దాటుకుంటూ విజయతీరాలు చేరుకుంటారు.

మిథున రాశి

కుజుడి నక్షత్ర మార్పుతో మిథున రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. తోబుట్టువుల మద్దతుతో ధనలాభం పొందేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి ప్యాకేజ్ తో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారి కలలు ఈ సమయంలో నిజమవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి సంపద పొందుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అకస్మాత్తుగా డబ్బు సంపాదించేందుకు నూతన మార్గాలు లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమేపీ పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి

అంగారక గ్రహం అనుగ్రహం వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉండనుంది. ఈ సంచారం వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో తెలివిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

ధనుస్సు రాశి

అంగారకుడు ధనుస్సు రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి

కుంభ రాశి జాతకులకు కుజుడు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. ఉద్యోగ వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు ఫలితం ఉంటుంది. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.