Vastu tips for money: అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నారా? ఇలా చేయండి మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయ్
Vastu tips for money: కొంతమంది చేసిన అప్పులు తీర్చలేక ముప్పు తిప్పలు పడతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రుణ బాధలు వదలడం లేదా అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి. అప్పుల సమస్యల నుంచి ఇట్టే బయట పడతారు.
Vastu tips for money: ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా ఏదో ఒక సమయంలో అప్పు చేయాల్సి వస్తుంది. అయితే వాటిని తిరిగి చెల్లించే సమయానికి ఏదో ఒక ఖర్చు, ఆటంకం రావడం వల్ల వాటిని తీర్చలేకపోతారు. అలా అప్పులు పెరిగిపోతూ తల మీద భారంగా మారిపోతాయి. అటువంటి పరిస్థితి రావడానికి వాస్తు లోపం కూడా ఒక కారణం కావచ్చు.
హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు దోషం వల్లే ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురవుతాయి. సంపద పోగు పడేందుకు, ఆర్థిక పురోగతికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు గురించి చక్కగా వివరించారు. చాలా సార్లు సమస్యలు అధికం కావడం వల్ల రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఆ అప్పులు తిరిగి చెల్లించలేకపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రుణం తిరిగి చెల్లించే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడతారు. అటువంటి పరిస్థితుల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. అప్పుల బాధలను వదిలించుకోవడానికి ఈ పరిహారాలు అవలంభించవచ్చు. వీటివల్ల మీకు రుణ సమస్యలు తొలగిపోతాయి.
సంపద పొందేందుకు వాస్తు పరిహారాలు
వాస్తు ప్రకారం రుణం నుంచి బయటపడేందుకు ప్రధాన ద్వారానికి సమీపంలో మరొక చిన్న ద్వారం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఉండటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి రాక స్థిరంగా ఉంటుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు.
వాస్తు ప్రకారం సాధ్యమైనంత త్వరగా రుణం నుంచి బయటపడేందుకు డబ్బును ఇల్లు లేదా దుకాణంలో ఉత్తర దిశలో ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేరుడు కొలువై ఉంటారని అంటారు. ఇలా చేయడం వల్ల అప్పుల నుంచి విముక్తితో పాటు సంపద కూడా లభిస్తుంది.
ఇంటి నైరుతి భాగంలో నిర్మించిన బాత్రూమ్ కూడా వ్యక్తిపై అప్పుల భారాన్ని పెంచుతుంది. అందుకే ఈ దిశలో బాత్రూమ్ నిర్మించకూడదు.
ఆర్థిక లాభాల కోసం ఇల్లు లేదా దుకాణాల్లో ఈశాన్య దిశలో గాజు వస్తువులు అమర్చుకోవడం శుభకరంగా పరిగణిస్తారు. అయితే ఆ గ్లాస్ రంగు ఎరుపు, కుంకుమ, మెరూన్ రంగులో ఉండకుండా చూసుకోవాలి.
వాస్తు ప్రకారం రుణ వాయిదాలను తిరిగి చెల్లించేందుకు మంగళవారం ఎంచుకోండి. ఈ రోజున డబ్బు తిరిగి ఇవ్వడం ద్వారా మీ అప్పు త్వరగా తీరిపోతుందని నమ్ముతారు.
కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేకపోయినా, డబ్బు నిలవకపోయినా మీ ఇంట్లో ఉండే ఫర్నీచర్ దిశ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఈ దిశలో ఆకుపచ్చ, నీలం లేదా నలుపు రంగు సోఫాలు లేదా కర్టెన్ లు ఉండకూడదు. అవి ఉంటే వెంటనే వాటిని తొలగించి పసుపు రంగువి వేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇంట్లోని మెట్లు కూడా ఆర్థిక అభివృద్ధికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఇంట్లో ఒకవేళ మెట్లు నిర్మించుకుంటున్నట్లయితే అందుకు దక్షిణం, పడమర, నైరుతి, ఉత్తమ దిశలు. ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మెట్లు పొరపాటున కూడా నిర్మించకూడదు. అలాగే వీటి కింద ఎటువంటి గదులు నిర్మించకూడదు. ఈ దిశలో మెట్లు ఉంటే చెడు ఫలితాలు ఇస్తుంది. కుటుంబ పురోభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇంటి పెద్దపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.