Coin plant vastu tips: అప్పుల బాధ తొలగించే కాయిన్ ప్లాంట్.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఈ మొక్క పెట్టుకోవాలి?-feng shui vastu tips bring coin plant to home for being happiness and money wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Coin Plant Vastu Tips: అప్పుల బాధ తొలగించే కాయిన్ ప్లాంట్.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఈ మొక్క పెట్టుకోవాలి?

Coin plant vastu tips: అప్పుల బాధ తొలగించే కాయిన్ ప్లాంట్.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఈ మొక్క పెట్టుకోవాలి?

Gunti Soundarya HT Telugu
Feb 26, 2024 05:45 PM IST

Coin plant vastu tips: కాయిన్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహంతో సిరిసంపదలు నెలకొంటాయి. అప్పుల బాధ తొలగిపోతుంది.

అప్పుల బాధ తొలగించే కాయిన్ ప్లాంట్
అప్పుల బాధ తొలగించే కాయిన్ ప్లాంట్ (pixabay)

Coin plant vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఎక్కువ మంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో అందరూ ఇళ్లలోనూ మనీ ప్లాంట్ గార్డెన్ లేదా బాల్కనీలో కనిపిస్తుంది. డబ్బు సమస్యలు తొలగించుకునేందుకు మనీ ప్లాంట్ మాత్రమే కాదు ఈ కాయిన్ ప్లాంట్ పెట్టుకున్నా మంచి ఫలితాలు పొందుతారు.

ఫెంగ్ షూయి చిట్కాలు పాటించడం వల్ల జీవితంలో అనేక సమస్యలను అధిగమించవచ్చని చాలా మంది నమ్ముతారు. అందుకే ఫెంగ్ షూయి సూచించిన కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుంటున్నారు. లాఫింగ్ బుద్ధ, తాబేలు, లక్కీ వెదురు మొక్క, మూడు కాళ్ళ కప్ప, చైనీస్ నాణేలు వంటి వాటిని ఇంట్లో లేదా ఆఫీస్ లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి ఉండటం వల్ల సంపదకు ఎటువంటి అవాంతరాలు ఉండవని నమ్ముతున్నారు. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట సిరిసంపదలు తులతూగుతాయని నమ్ముతారు.

ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం ఇంట్లో కాయిన్ ప్లాంట్ పెట్టుకోవడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని వల్ల కుటుంబ సభ్యులకు ధన కొరత ఉండదని, ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని విశ్వసిస్తారు. ఇంట్లో కాయిన్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంపదకు దారులు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది.

మనీ ప్లాంట్ కంటే కాయిన్ ప్లాంట్ ఎక్కువ శక్తివంతమైనదిగా చెప్తారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆర్థిక సంపద పెరుగుతుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ తో పోలిస్తే కాయిన్ ప్లాంట్ వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అంటారు.

కాయిన్ ప్లాంట్ వాస్తు చిట్కాలు

వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో కాయిన్ ప్లాంట్ పెట్టుకోవడం అత్యంత శుభప్రదం. ఇది మీ జీవితంలో సంపదను తీసుకొస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా మీరు పని చేసుకుని ప్రదేశంలో ఆగ్నేయ దిశలో కాయిన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీని వల్ల పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.

వాస్తు ప్రకారం కాయిన్ ప్లాంట్ మొక్కని పొరపాటున కూడ పడకగదిలో పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మనస్పర్థలు తలెత్తుతాయి.

కాయిన్ ప్లాంట్ పెట్టడం వల్ల ప్రయోజనాలు

ఇంట్లో కాయిన్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆర్టిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాస్తు నియమాల ప్రకారం ఈ మొక్కను ఏర్పాటు చేసుకుంటే పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపార పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ఈ మొక్క పెట్టుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల సానుకూల శక్తి ప్రసరణ పెరుగుతుంది.

కాయిన్ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వ్యాపారంలో లాభావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయాన్ని పెంచుతుంది. అది మాత్రమే కాదు డబ్బు ఆదా చేసుకునేందుకు మీకు సహాయపడుతుంది.

కాయిన్ ప్లాంట్ రెండు రకాలు

ఈ మొక్కల పరిరక్షణ కూడా చాలా సులువుగా ఉంటుంది. చిన్న కుండీలో లేదా నేల మీద అయినా ఈ మొక్కను నాటుకోవచ్చు. ఎక్కువగా నీరు పోసే అవసరం కూడా ఉండదు. కాయిన్ ప్లాంట్ రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది నిజమైన కాయిన్ ప్లాంట్ అయితే రెండోది నకిలీ మొక్కలు తయారు చేసి అమ్ముతారు. పాత చీని లేదా భారతీయ నాణేలు ఉపయోగించి నకిలీ కాయిన్ ప్లాంట్ మొక్కలు తయారు చేస్తారు.

Whats_app_banner