Nava panchama yogam: 12 ఏళ్ల తర్వాత నవపంచమ యోగం.. ఏ పని చేపట్టినా అందులో విజయం ఈ రాశుల వారిదే-after 12 years jupiter and ketu form nava panchama yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nava Panchama Yogam: 12 ఏళ్ల తర్వాత నవపంచమ యోగం.. ఏ పని చేపట్టినా అందులో విజయం ఈ రాశుల వారిదే

Nava panchama yogam: 12 ఏళ్ల తర్వాత నవపంచమ యోగం.. ఏ పని చేపట్టినా అందులో విజయం ఈ రాశుల వారిదే

Gunti Soundarya HT Telugu
May 07, 2024 09:09 AM IST

Nava panchama yogam: సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత నవపంచమ యోగం ఏర్పడింది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అన్నింటా విజయం సిద్ధిస్తుంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

12 ఏళ్ల తర్వాత నవ పంచమ యోగం
12 ఏళ్ల తర్వాత నవ పంచమ యోగం

Nava panchama yogam: గ్రహాల సంచారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొంతమందికి ఆనందం కలిగిస్తే మరికొందరికి ఇబ్బందులు కలుగుతాయి. దేవగురువు బృహస్పతి సంచారం జ్యోతిష్య శాస్త్రంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది.

శుభకరమైన బృహస్పతి మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. దీనికి విరుద్ధంగా కేతువు 2023, అక్టోబర్ నుంచి కన్యా రాశిలోనే తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. ఆయా రాశులలోఈ రెండు గ్రహాల స్థానం కారణంగా నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సింహ రాశిలో ఏర్పడుతుంది.

నవ పంచమ యోగం అంటే ఏమిటి?

తొమ్మిది, ఐదు గృహాలలో బృహస్పతి లేదా అంగారకుడు లేదా కేతు గ్రహాలు కొన్ని ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అంగారకుడు, కేతువు తొమ్మిదో ఇంట్లో, బృహస్పతి ఐదో ఇంట్లో ఉంటే నవ పంచమ యోగం ఏర్పడుతుంది.

దేవ గురువుగా భావించే బృహస్పతి ఏడాదికి ఒక సారి రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. అలా ఈ ఏడాది వృషభ రాశిలోనే సంచరిస్తాడు. గురు గ్రహ సంచారం కొందరి జీవితాలతో పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. గురు అనుగ్రహంతో ఒక వ్యక్తి అదృష్టవంతుడు అవుతాడు. సమస్యలను అదృశ్యం అవుతాయి. జీవితం సంపద, శ్రేయస్సుతో సమృద్ధిగా ఉంటుంది. అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి.

మేలో నవపంచమ యోగం ఏర్పడటం వల్ల బృహస్పతి, కేతువుల ప్రత్యేక స్థానాల ఫలితంగా కొన్ని అదృష్ట రాశులు అదృష్టాన్ని అనుభవిస్తారు. ఆర్థిక లాభం, గొప్ప విజయాలు రెండింటినీ అనుభవించే అవకాశాలను కలిగి ఉంటాయి. నవపంచమ యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి

కొంతకాలంగా నిలిచిపోతూ వస్తున్న పనులు పూర్తి చేయడానికి మంచి అవకాశం వస్తుంది. నవపంచమ యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సీనియర్ అధికారులు మీకు సహాయం చేస్తారు. ఉద్యోగం శ్రద్ధగా చేయడం వల్ల అధికారులు ఇతర బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఈ సమయంలో అదృష్టం అంటే మీదే అనేట్టుగా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుస్తాయి. మీ విశ్వాసం పెరుగుతుంది. ఇంటలిజెన్స్ కమ్యూనికేషన్ సామర్ధ్యాలు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి డబ్బు సంపాదించే అవకాశం వస్తుంది.

సింహ రాశి

సింహ రాశి పదో ఇంట్లో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకు మెరుగుదల, పురోగతికి స్పష్టమైన మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారవేత్తలకు సానుకూలమైన సమయం. పనిలో మంచి జీతం సంపాదిస్తారు. డబ్బు ఎక్కడైనా నిలిచిపోతే ఇప్పుడు దాన్ని తిరిగి పొందుతారు. శ్రద్ధ మరియు నిబద్ధతతో, మీరు ఎలాంటి అడ్డంకినైనా జయించగలరు. చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. సొంత వాహనం లేదా ఇంటి లక్ష్యం నెరవేరుతుంది.

మకర రాశి

మకర రాశి వారు నవపంచం యోగం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. న్యాయపరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. యజమానులు తమ ఉద్యోగుల పని, శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ సమయంలో మీ సూపర్‌వైజర్‌లు మీ పనితీరుతో సంతోషిస్తారు. ప్రాజెక్టులో మీకు ప్రధాన బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. జీవితంలోనే అన్ని కోణాల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ప్రియమైన వారితో సమయం గడిపేందుకు మీకు అవకాశం వస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే ప్రయత్నంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. మీరు ఉన్నత స్థాయి అధికారులతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటారు.

 

Whats_app_banner