Ketu transit: 11 నెలల పాటు ఈ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్న కేతువు.. అందులో మీరు ఉన్నారా?
Ketu transit: అంతు చిక్కని గ్రహంగా పరిగణించే కేతువు రానున్న 11 నెలల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకున్నారా?
Ketu transit: జ్యోతిష్య శాస్త్రంలో కేతువును అంత చక్కని గ్రహంగా పరిగణిస్తారు. అందుకే కేతువు సంచారానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తుంది.
2023 అక్టోబర్ 30వ తేదీ కేతువు తులా రాశిని వీడి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. 2025 మే వరకు ఇదే రాశిలో తన ప్రయాణం సాగిస్తాడు. కేతువు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి భారంగా ఉంటుంది. మరికొందరికి అదృష్టాన్ని ఇస్తుంది. కన్యా రాశిలో కేతువు సంచరించడం వల్ల రాబోయే పదకొండు నెలల పాటు ఈ రాశుల వారికి మేలు జరుగుతుంది. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.
మేష రాశి
రాబోయే పదకొండు నెలలు కేతువు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. వ్యాపారంలో మంచి ప్రణాళికలతో విజయాలు సాధిస్తారు. ఈ కాలం వ్యాపారస్థులకు మంచి పెట్టుబడులను తీసుకొస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి
రాబోయే 11 నెలల పాటు కర్కాటక రాశి వారికి కేతువు స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడం మంచిది. డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమేపీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ట్రిప్ కి వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కేతువు సంచారం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి ఒప్పందాలు పొందుతారు. కేతువు శుభ ప్రభావంతో ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ధనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒత్తిడికి దూరంగా ఉండండి.
కేతు సంచారం దుష్ప్రభావం తొలగించే నివారణలు
కేతు సంచారం అశుభ స్థానంలో ఉంటే అవమానాలు, కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వీటి నుంచి బయట పడేందుకు కొన్ని పనులు చేయడం మంచిది.
రాహు, కేతువులు దురదృష్టాన్ని ఇస్తాయని అంటారు. అయితే కొన్ని నివారణలు పాటించడం వల్ల వీటి దుష్ప్రభావాల ప్రభావాల నుంచి బయటపడవచ్చు. జాతకంలో రాహు, కేతు స్థానాలు బలపరుచుకునేందుకు ఇలా చేసి చూడండి.
శనివారం రోజు అవసరమైన వ్యక్తికి వస్త్రాలు, ఆకలితో ఉన్నవారికి ఆహారం దానం చేయడం మంచిది. అలాగే వస్త్రాలు, నువ్వులు, ముల్లంగి మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేతు దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు అలాగే దుర్గా సప్తసతి పఠించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. రాహు కేతు చెడు ప్రభావాల నుంచి బయటపడతారు.
హనుమాన్ సహస్రనామ పారాయణం చేయడం వల్ల కేతు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అలాగే పూజ గదిలో వెండి ఏనుగు ప్రతిమను ఉంచుకుంటే మంచిది. ఇలా చేస్తే కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. గంధం పొడిని నీటిలో కలుపుకొని వరుసగా మూడు నెలల పాటు స్నానం చేయడం వల్ల కేతు దుష్ప్రభావాల నుంచి బయటపడతారు.