Sun Venus Conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక.. 3 రాశుల వారికి శుభ ఘడియలు-sun venus conjunction in aries will give fortune to these 3 zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Venus Conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక.. 3 రాశుల వారికి శుభ ఘడియలు

Sun Venus Conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక.. 3 రాశుల వారికి శుభ ఘడియలు

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 10:39 AM IST

Sun Venus Conjunction: మేష రాశిలో సూర్యుడు, శుక్రుల కలయిక కొన్ని రాశుల జాతకులకు అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. ఈరోజు శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఈ నేపథ్యంలో ఈ కలయిక ఫలితాలను తెలుసుకుందాం.

venus-sun-conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక
venus-sun-conjunction: మేష రాశిలో సూర్య శుక్రుల కలయిక (Pexels)

సంపదకు, విలాసాలకు కారకుడైన శుక్రుడు నిన్న రాత్రి 11.58 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ గ్రహాల రాజు సూర్యుడు ఇప్పటికే సంచరిస్తున్నాడు. మేష రాశిలో సూర్య శుక్రలు కలయిక కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తుంది. వృత్తిలో సానుకూలం మార్పులు కనిపిస్తాయి. పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం అందుకుంటారు. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేషరాశిలోని సూర్య శుక్రుల కలయిక వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

శుక్రుడు, సూర్యుల కలయిక మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తిలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అప్రయిజల్ లభిస్తుంది.

కన్య రాశి

శుక్రుడి సంచారంతో కన్యా రాశి జాతకుల అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు కెరీర్‌లో అపారమైన విజయాలను పొందుతారు. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.

తులా రాశి

శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించడంతో తులా రాశి వారు ప్రతిరోజూ ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు.