Chaitra navaratrulu: ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు.. దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన నియమాలు ఇవే-chaitra navaratrulu date and time ghata sthapana details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaitra Navaratrulu: ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు.. దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన నియమాలు ఇవే

Chaitra navaratrulu: ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు.. దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన నియమాలు ఇవే

Gunti Soundarya HT Telugu
Apr 03, 2024 04:14 PM IST

Chaitra navaratrulu: ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. వాటితో పాటు అనేక గ్రహాల కలయికల వల్ల ఏర్పడే రాజయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి.

ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు
ఐదు రాజయోగాలతో చైత్ర నవరాత్రులు (AFP)

Chaitra navaratrulu: చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దుర్గా దేవిని ఆరాధించే వాళ్ళు ఇంట్లో కలశ స్థాపన చేసి అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రులు ఐదు రాజ యోగాలతో ప్రారంభం అవుతున్నాయి.

సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం, ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగంతో పాటు పుష్య నక్షత్రం ఏర్పడుతున్నాయి. ఈసారి నవరాత్రుల సమయంలో గ్రహాల స్థానం చాలా బాగుంది. అందుకే ఈ ఐదు రాజయోగాలు ఏర్పడినట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు.

గ్రహాల కదలికలు

చంద్రుడు ఆరోజున మేష రాశిలో సంచరిస్తాడు. మేష రాశిలో ఉన్న బృహస్పతితో కలయిక జరగడం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. అలాగే మీన రాశిలో గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. ఈ రాశిలో సంపదను ఇచ్చే శుక్రుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా బుధ శుక్ర గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

ఇది మాత్రమే కాకుండా మీన రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక కూడా జరుగుతుంది. దీనివల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. మీన రాశిలో శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ ఏడాది చైత్ర నవరాత్రుల్లో అమృత సిద్ధి యోగం, సర్వార్థి సిద్ధి యోగంతో ఈ ఉత్సవాల కార్యక్రమం కాబోతున్నాయి. ఈ రెండు యోగాలు ఆ రోజు మొత్తం ఉంటాయి. ఈ యోగాలు చాలా ప్రత్యేకమైనవి.

ఈ ఐదు రాజయోగాల వల్ల కొన్ని రాశుల వారి జీవితం అదృష్టంతో నిండిపోతుంది. గ్రహాల కలయిక రాజయోగాల ప్రభావంతో డబ్బుకి కొదవ ఉండదు. మేష, సింహ రాశి జాతకులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. అలాగే వృషభ రాశి కలిగిన వ్యాపారస్తులు ఈ సమయంలో అధిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించిన కుంభ రాశి జాతకులకు మంచి లాభాలు పొందుతారు. నాలుగు రాశుల వారికి ఐదు రాజయోగాల నునకి అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.

గుర్రంపై దుర్గాదేవి రాక

ఉగాది రోజుల ప్రారంభమయ్యే ఈ నవరాత్రులు శ్రీరామనవమి ఏప్రిల్ 17తో ముగుస్తాయి. ఘట స్థాపన చేసేందుకు ఏప్రిల్ 9 ఉదయం 5 నుంచి సూర్యాస్తమయం వరకు మంచి సమయం ఉంది. ఈసారి దుర్గామాత గుర్రంపై స్వారీ చేస్తుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం చైత్ర నవరాత్రులు ప్రారంభం కావడంతో తల్లి వాహనం గుర్రం కానుంది. ఈ వాహనం మీద దుర్గాదేవి రావడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారి ఆరాధన, ఉపవాసం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి నియమాలు పాటించిన వారికి దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.

దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన నియమాలు

నవరాత్రుల సమయంలో దుర్గామాత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించాలి అనుకుంటే అందుకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి వాస్తు నియమాలు తెలుసుకోవాలి. నవరాత్రుల సమయంలో దుర్గామాత విగ్రహాన్ని ఎప్పుడు ఉత్తర లేదా పడమర దిశలో ఉంచాలి. ఈ రెండు దిక్కులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం దుర్గాదేవి విగ్రహం దక్షిణ దిశలో పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది.

వాస్తు ప్రకారం లేత పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు ఇంట్లో దుర్గ మాత విగ్రహం పెట్టాలని అనుకున్నట్లయితే అమ్మ వారి విగ్రహం 3 అంగుళాల కంటే పెద్దదిగా ఉండకూడదు. దుర్గామాత తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే చైతన్యం మేల్కొంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూజ గదిలో దుర్గ మాత విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. కుంకుమ, అక్షింతలు వేసిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన చేయాలి.