Trigrahi yogam: 18 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఇక వీరి కష్టాలు తీరినట్టే
Trigrahi yogam: 18 సంవత్సరాల తర్వాత మీన రాశిలో మూడు గ్రహాల కలయిక జరుగుతుంది. అందువల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వాళ్ళు కష్టాల నుంచి గట్టెక్కుతారు.
Trigrahi yogam: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందం, విలాసం, ప్రేమ, సంపద, కీర్తి, ఆనందం, శ్రేయస్సు ప్రసాదించే శుక్రుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 31న మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ ఇప్పటికే గ్రహాల రాజు సూర్యుడు, నీడ గ్రహంగా పేర్కొనే రాహువు సంచరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు 18 సంవత్సరాల తర్వాత మీన రాశిలో శుక్రుడు, రాహువు, సూర్య గ్రహాలు కలవబోతున్నాయి. శుక్రుడు, రాహువు కలయిక వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. పనులలో ఆటంకాలు తొలగి వస్తు సంపద పెరుగుతుంది. ఈ గ్రహాల కలయిక 12 రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శుక్రుడు రాశి చక్రం మార్పు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఇస్తుంది.
గ్రహాల రాశి మార్పు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నెలలో శుక్రుడు రెండు సార్లు రాశి మార్చుకుంటాడు. ఒక రాశిలో మూడు గ్రహాలు కలయిక జరిగితే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. మరికొన్ని రోజుల్లో శుక్రుడు మీన రాశి ప్రవేశం చేయడంతో రాహువు, సూర్యుడితో సంయోగం జరగనుంది. ఫలితంగా మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా శక్తివంతమైన యోగం. ఈ యోగం ఏయే రాశుల వారిని ప్రభావితం చేస్తుందో చూద్దాం.
మేషం
త్రిగ్రాహి యోగం ప్రభావంతో మేష రాశి వారికి శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.
మిథున రాశి
ఒకే రాశిలో మూడు గ్రహాలు కలయిక వల్ల ఏర్పడే త్రిగ్రాహి యోగం ప్రభావంతో మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు నిర్విగ్నంగా పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల సహాయంతో ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. శారీరక సౌఖ్యాలు పొందుతారు.
కుంభ రాశి
శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశి ప్రవేశం చేస్తాడు. ఫలితంగా కుంభ రాశి వారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. ఆఫీసులో కొత్త పరిచయాలు అవుతాయి. చేసిన పనులకు ప్రశంసలు దక్కుతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది.
మీన రాశి
సూర్యుడు, రాహువు, శుక్రుడు మీన రాశిలోనే సంయోగం చెందబోతున్నారు. ఫలితంగా ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వృత్తి జీవితంలో మీ కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి. మీ పనితనాన్ని అందరూ గుర్తిస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో కొద్దిగా ఖర్చులపై నియంత్రణ పాటించాలి. వ్యాపారస్థులకు పెట్టుబడిదారులు దొరుకుతారు. మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల ప్రభావంతో కెరీర్ లో ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.