Holika dahan: హోలికా దహన్ మంటల్లో ఇవి వేయండి.. వైవాహిక జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి-offer these things on holika dahan for being overcome marriage obstacles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Holika Dahan: హోలికా దహన్ మంటల్లో ఇవి వేయండి.. వైవాహిక జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి

Holika dahan: హోలికా దహన్ మంటల్లో ఇవి వేయండి.. వైవాహిక జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu

Holika dahan: హోలికా దహనం నిర్వహించే సమయంలో కొన్ని వస్తువులు వేయడం వల్ల వైవాహిక జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తుంది. ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తుంది.

హోలికా దహనంలో ఇవి వేస్తే కష్టాలు తీరతాయి (pixabay)

Holika dahan: ఏటా హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం వేడుక నిర్వహిస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ వేడుక జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆవు పేడతో చేసిన పిడకలు, వెదురు కర్రలతో హోలికా దహనం ఏర్పాటు చేస్తారు. శుభ ముహూర్త సమయంలో మాత్రమే ఈ హోలికా దహన్ నిర్వహిస్తారు.

ఈ ఏడాది హోలికా దహన్ మార్చి 24వ తేదీన వచ్చింది. మరుసటి రోజు మార్చి 25న హోలీ పండుగ జరుపుకుంటారు. హోలికా దహనం సమయంలో తీసుకునే కొన్ని చర్యలు ప్రభావవంతంగా పనిచేస్తాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే వాటిని తొలగించుకునేందుకు, కెరీర్లో అడ్డంకులు తొలగించుకునేందుకు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హొలికా దహనంలో కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల వైవాహిక జీవితం ఆనందం, ప్రేమతో నిండి ఉంటుంది. భాగస్వాముల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతుంది. కుటుంబ బంధం బలంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హోలికా దహనంలో ఇవి వేయండి. ఫలితంగా మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది.

పెళ్ళిలో ఆటంకాలు తొలగిపోవడానికి..

వివాహంలో అడ్డంకులు, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే హోలికా దహనం సమయంలో అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే హవన సామాగ్రిని వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పెళ్ళి సమయంలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నిండిపోతుంది.

వ్యాధుల నుంచి ఉపశమనం

ఏదైనా ఒక వ్యాధి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే దాని నుంచి ఉపశమనం పొందటం కోసం హోలికా దహనంలో కర్పూరం, పచ్చి యాలకులు వేయాలి. ఈ పరిహారం పాటించడం వల్ల అన్ని రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వేప, కర్పూరం సమర్పించడం వల్ల కూడా వ్యాధుల నుంచి బయట పడతారు.

గోధుమలు వేయవచ్చు

గోధుమలు లేదా బార్లీ బియ్యం హోలికా దహనంలో వేయొచ్చు. ఈ సమయంలో బార్లీతో చేసే ఆహార పదార్థాలు హోలికా దహనానికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీకు అంతా మంచే జరుగుతుంది.

లక్ష్మీదేవి ఆశీస్సులు

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మీరు హోలికా దహనం రోజు ఈ పరిహారం పాటించాలి. ఎండు కొబ్బరిని తీసుకొని అందులో పంచదార, బియ్యం నింపి అగ్నికి దీన్ని సమర్పించాలి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుంది. అగ్నికి వరి ధాన్యాలు, బార్లీ సమర్పించినా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.

వైవాహిక జీవితం కోసం

వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే తమలపాకు మీద పసుపు రాసి హోలికా దహనంలో వేయాలి. ఇలా చేయడం వల్ల పెళ్లికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నట్లయితే హోలికా దహనం రోజు రాత్రి ఉత్తరం వైపున ఒక రాయిపై తెల్లటి వస్త్రాన్ని పరచాలి. దాని మీద నవగ్రహా యంత్రాన్ని ఉంచి శనగపప్పు, బియ్యం, గోధుమలు, కాయధాన్యాలు, నల్ల పప్పు, నువ్వులు వేయాలి. తర్వాత కుంకుమ తిలకం వేసి నెయ్యి దీపం వెలిగించాలి.

ఆర్థిక పురోగతి కోసం..

ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు హోలికా దహనం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ, తమలపాకులు అగ్నిలో వేయాలి. ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి.