Goddess lakshmi devi: మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి.. అవి లక్ష్మీదేవికి నచ్చవు
Goddess lakshmi devi: లక్ష్మీదేవికి నచ్చని అలవాట్లు కొన్ని ఉన్నాయి. మీరు కూడా వాటిని అవలంభిస్తుంటే వెంటనే వాటిని మానుకోండి. లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు.
ఆనందం, శ్రేయస్సు, డబ్బులు ఇచ్చేది లక్ష్మీదేవి. అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటే ఆనందకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, మీకున్న అలవాట్లు వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలే పరిస్థితి వస్తుంది. పర్యవసానంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఈ అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. దురదృష్టాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నట్టే అవుతుంది. లక్ష్మీదేవిని నచ్చని అలవాట్లు ఏంటో తెలుసా?
అపరిశుభ్రమైన ఇల్లు
కొంతమంది ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటారు. అద్దంలా ఉంచుకుంటారు. కానీ మరి కొందరు మాత్రం బద్ధకంగా ఉండి ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉండదు. అందుకే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా మురికి లేకుండా ఉంచుకోవాలి. మురికి ఉంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటుంది.
భార్యని అగౌరవపరచకూడదు
వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవాలి. మంచి, చూడు సమయంలో ఒకరికొకరు మద్దతుగా ఉండాలి. ఒకరి భావాలకు మరొకరు విలువ ఇస్తూ అర్థం చేసుకుంటూ ప్రేమానురాగాలతో జీవితం కొనసాగించాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలా కాకుండా నేనే గొప్ప అంటూ భార్యని భర్త తక్కువ చేసి మాట్లాడటం అగౌరవపరచడం చేయకూడదు. ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం. అందుకే ఎప్పుడు భార్యని గౌరవించాలి. అలా లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీ ఇంటి మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవు.
సూర్యోదయం తర్వాత నిద్రపోవడం
ఈ రోజుల్లో ప్రజలు జీవనశైలిలో ప్రధానమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఒత్తిడి, నిద్రలేమి కారణాల వల్ల తెల్లవారుజామున కూడా నిద్రపోతున్నారు. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు. ఫలితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ అలవాటును మానుకోవడం మంచిది.
ఆహారాన్ని గౌరవించాలి
ఆహారం ఎక్కువగా వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం ఎప్పుడు పారేయకూడదు. ఆహారాన్ని అగౌరవ పరచడం లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు. ధాన్యాలను గౌరవంగా చూడని ఇంట లక్ష్మీదేవి ఉండేందుకు అయిష్టత చూపిస్తుందని చెబుతారు. ఆనందం, శ్రేయస్సు సమృద్ధిగా ఉండాలంటే మీరు ఆహారాన్ని గౌరవించాలి.
అబద్ధాలు చెప్పకూడదు
మోసం చేయకూడదు. ఎవరైనా అబద్ధం చెబితే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. కొందరు వ్యక్తుల కోరుకున్నది సాధించేందుకు ఎదుటివారిని మోసగించేందుకు చాలా అబద్ధాలు చెబుతారు. అలా చేయడం వలన మీకు దీర్ఘకాలంలో వచ్చే ప్రభావాలు దూరం అవుతాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు.
పెద్దలను గౌరవించాలి
తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను గౌరవించాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. తల్లిదండ్రులు, వృద్ధుల మీద అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు వారిని దూషించే వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం చూపించదు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై నిరంతరం ఉండాలని కోరుకుంటే పెద్దలను గౌరవించాలి.
ఆతిథ్యం బాగుండాలి
అతిథి దేవోభవ అంటారు. అతిథిని భగవంతుడు స్వరూపంగా చెప్తారు. కానీ కొంతమంది వ్యక్తులు ఇంటికి వచ్చిన అతిథులకు సరిగా మర్యాదలు చేయడం నిరాకరిస్తారు. వారితో గొడవ పడేందుకు దిగుతారు. అటువంటి ప్రవర్తన లక్ష్మీదేవికి అసలు నచ్చదు. అందుకే మీ ఇంటికి వచ్చిన అతిథులను భారంగా చూడటం మానేసి గౌరవించడం వల్ల లక్ష్మీదేవి మీ మీద కరుణ చూపిస్తుంది. మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
టాపిక్