Donation benefits: ఈ పప్పులు దానం చేశారంటే మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది-donate these pulses for good luck and prosperous life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Donate These Pulses For Good Luck And Prosperous Life

Donation benefits: ఈ పప్పులు దానం చేశారంటే మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది

Gunti Soundarya HT Telugu
Mar 14, 2024 11:29 AM IST

Donation benefits: దానం అన్నింటికంటే మంచి గుణం. జ్యోతిష్య శాస్త్రంలో కూడా దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పప్పులు దానం చేయడం వల్ల మీ ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది.

ఈ పప్పులు దానం చేస్తే మంచిది
ఈ పప్పులు దానం చేస్తే మంచిది

Donation benefits: సనాతన ధర్మంలో దానాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. దానం చేసే ఆచారం ప్రాచీన కాలం నుంచి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ప్రజల మనశ్శాంతి కొరకు, వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం, దైవ అనుగ్రహం పొందడం కోసం, గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం… ఇలా ఏదో ఒక విధంగా దానాలు చేస్తూనే ఉంటారు.

ట్రెండింగ్ వార్తలు

ఇతరులకు సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఎటువంటి ఫలితం ఆశించకుండా దానం చేస్తే మంచిది. అయితే మీరు దానం చేసే విధానాన్ని బట్టి మీకు పుణ్యం ఉంటుంది. మీ జీవితంలో శాంతి, సామరస్యం కొనసాగించాలనుకుంటే కొన్ని వస్తువులు, ప్రత్యేకంగా ఈ పప్పులు దానం చేయడం మంచిది.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పప్పు ధాన్యాలు దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇవి కేవలం ఆరోగ్యకరమైనవి మాత్రమే కాదు మతపరమైన కార్యక్రమాలలో కూడా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. పప్పు దినుసులు దానం చేయడం వల్ల వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతాడు. ఈ పప్పులు దానం చేయడం వల్ల మీ అదృష్టాన్ని, శ్రేయస్సుని తిరిగి తీసుకొస్తాయి. ఏయే పప్పులు దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నల్ల మినపప్పు

జ్యోతిష శాస్త్ర ప్రకారం శనివారం నల్ల మినపప్పు దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇవి శుభప్రదం అని కూడా నమ్ముతారు. శనివారం శని దేవుడికి అంకితం చేయబడిన విషయం అందరికీ తెలిసిందే. పప్పు దానం చేయడం వల్ల శని ఆశీర్వాదాలు లభిస్తాయి. ప్రతికూల శక్తి నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి. వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగించుకునేందుకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలాగే మీరు చెడు శక్తి, నర దృష్టితో ఇబ్బంది పెడుతున్నట్లయితే నల్ల పప్పు దానం చేయడం మంచిది. నల్ల పప్పు కొద్దిగా తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ తిప్పి దక్షిణ వైపు విసరాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి.

కందులు

మీ జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్న, గురు దోషంతో బాధపడుతున్నా, మీ వైవాహిక జీవితం సమస్యలతో ఆటంకాలతో నిండిపోయినట్లయితే మీరు బుధవారాలలో కందులు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది. గురు భగవానుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు.

ఎర్ర పప్పు

జాతకంలో అంగారకుడు స్థానం బలహీనంగా ఉంటే లేదా అంగారక దోషంతో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు ప్రతి మంగళవారం ఎర్ర పప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అంగారకుడు అనుగ్రహంతో జీవితం సంతోషంగా ఉంటుంది.

మూంగ్ దాల్

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూంగ్ దాల్ లేదా పెసరపప్పు బుధవారం నాడు దానం చేయాలి. ఇవి విరాళం ఇవ్వడం వల్ల గణేషుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. మీ పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. వీటితోపాటు ఆర్థిక లాభాలు పొందుతారు. అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. అలాగే వినాయకుడిని పూజించేటప్పుడు మూంగ్ దాల్ సమర్పించడం ఫలవంతంగా ఉంటుంది.

శనగలు

జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం విష్ణువుకి అంకితం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందడం కోసం శనగలు దానం చేయాలి. కష్టాలు, సమస్యలతో జీవితం నిండిపోయి ఉంటే మీరు గురువారం రోజు శనగలు దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. బృహస్పతి చెడు ప్రభావాల నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది.

WhatsApp channel