Monday Motivation : పొగడ్తలోని అబద్ధం, విమర్శలోని నిజాన్ని తెలుసుకో..
Monday Motivation : ప్రశంసలు.. పని మీద ఇంట్రస్ట్ కలిగిస్తాయి. కానీ ఓన్లీ పొగడ్తల్లో మునిగిపోతే.. మనమే మునిగిపోతాం. పొగడ్తలను ఎక్కడ వరకూ తీసుకోవాలో అనే విషయం మీకు తెలిసి ఉండాలి.
ఎంత గొప్ప రాజు అయినా.. పొగడ్తలకు పడిపోతాడు. దిల్లీకి రాజైనా.. మీరు తోపు అంటే.. లోపల ఏదో తెలియని ఆనందం. కానీ పొగిడే వాళ్లందరూ.. మన మంచి కోరుకోరు. కొందరు మన నాశనాన్ని కూడా కోరుకుంటారు. అందుకే పొగడ్తలకు పడిపోకూడదు. విమర్శలను కూడా సరిగా తీసుకోవాలి. మిమ్మల్ని పొగిడేవారికంటే.. విమర్శించే వారితోనే మీకు లాభాలు ఎక్కువ.
జీవితంలో పొగడ్తలను అందరూ ఇష్టపడతారు. ఏదో పైకి మాత్రం.. నో.. నో నేను అస్సలు పడిపోను అని చెబుతారు. కానీ తమని పది మంది మెచ్చుకోవాలని అందరికీ ఉంటుంది. కొంతమంది తమను అందరూ పొగడాలని.. చూస్తారు. కొంతమంది.. తమ చుట్టూ పొగిడేవారిని చేర్చుకుంటారు. ఇక వాళ్లు ఎప్పుడూ భజన చేస్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు పొగడ్తలు మిమ్మల్ని మంచి పనులు చేసేలా చేస్తాయి. మరికొన్ని సార్లు మిమ్మల్ని ముంచేస్తాయి.
ఇతరులు మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రశంసించాలని మీరు అనుకుంటే.., ముందుగా మీరు ఏదైనా మంచి పని చేయాలి. మంచి పనిని ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు, మంచి వ్యక్తులు ఆ ప్రశంసలను వినయంగా స్వీకరిస్తారు. కొంతమంది మాత్రం గర్వంగా తీసుకుంటారు. వాళ్లే సమస్యలు ఎదుర్కొంటారు. ప్రశంసించేవాళ్లను, పొగిడేవాళ్లను గుర్తించడం అనేది మీ పని. ఎవరు ఎందుకు పొగుడుతున్నారో తెలుసుకోవాలి. అప్పుడే మీరు ముందుకు వెళ్లగలరు. విమర్శించే వాళ్లను కూడా మీరు పరిశీలించాలి. మీ ఎదుగుదలకు ఉపయోగపడేది విమర్శలే.
ప్రశంసలు అందుకున్న వ్యక్తికి ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే తప్పుడు ప్రశంసలు అజాగ్రత్తపరుడిగా, బలహీనంగా చేస్తుంది. పొగడ్తలకు దూరంగా ఉండాలి. ప్రశంసలను తెలివైన వ్యక్తి వినయంగా స్వీకరిస్తాడు. అదే ప్రశంసలు మూర్ఖుడిని గర్విగా తయారు చేస్తాయి. పొగడ్తల్లో దాగివున్న అబద్ధాన్ని, విమర్శలో దాగి ఉన్న నిజాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్లే ముందుకు వెళ్తారు. ఎదుటివారిని పొగిడేందుకు మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి.
సంబంధిత కథనం