Women Common Mistakes : వైవాహిక జీవితంలో మహిళలు చేసే 5 సాధారణ తప్పులు ఇవే
ఏ సంబంధమైనా సమస్యలు తప్పవు. ఏదైనా సంబంధం ఆనందం, కోపం, విచారంతో నిండి ఉంటుంది. కానీ కొన్ని ప్రవర్తనా విధానాలు వివాహాలలో సమస్యలు కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో చాలా మంది మహిళలు చేసే 5 తప్పులు ఏంటో చూద్దాం..
పెళ్లయిన తర్వాత చాలా మంది మహిళలు మంచి భార్యగా, తల్లిగా ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలా మంది మహిళలు చేసే తప్పు. కుటుంబం ముఖ్యమైనది అయినప్పటికీ, వారి శారీరక, మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. వ్యక్తిగత ఆసక్తులు, లక్ష్యాలు లేదా స్వీయ సంరక్షణను విస్మరించడం మంచిది కాదు. ఇది వైవాహిక జీవితంలో మొత్తం సంతృప్తిని తగ్గిస్తుంది. అందువల్ల వివాహిత స్త్రీలు వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడం, వ్యక్తిగత, కుటుంబ జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఓపికకు మించి పని చేయకూడదు.
కొంతమంది స్త్రీలు తమ భర్తలు తమ భావాలను, అవసరాలను లేదా కోరికలను వారే అర్థం చేసుకోవాలని అనుకుంటారు. బహిరంగంగా సంభాషించకుండా అర్థం చేసుకోవాలని భావిస్తారు. ఇది అపార్థాలకు దారితీయవచ్చు. మహిళలు కొన్నిసార్లు తమ భర్తలు తమ మనసులో ఏముందో అర్థం చేసుకోవాలని ఆశిస్తారు, ఇది అనవసరమైన ఉద్రిక్తతను సృష్టిస్తుంది. వివాహంలో అవగాహన, బంధాన్ని పెంపొందించడానికి ఓపెన్, నిజాయితీ సంభాషణ కీలకం. కావాల్సింది నేరుగా అడిగేయండి. అర్థం చేసుకోవాలని ఎదురుచూడకూడదు.
వివాహ సంబంధంలో సెక్స్ అనేది సాన్నిహిత్యం మాత్రమే కాదు. అది శారీరక సాన్నిహిత్యానికి మించినది. భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కొంతమంది మహిళలు తమ వివాహంలో సాన్నిహిత్యం ప్రాముఖ్యతను విస్మరిస్తుంటారు. భర్తను అస్సలు దగ్గరకి రానివ్వరు. శృంగారం, భావోద్వేగ వ్యక్తీకరణ లోతైన బంధానికి దోహదం చేస్తాయి. ఈ అంశాలను విస్మరించడం వల్ల దంపతుల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది.
జీవిత భాగస్వామి తనతోనే ఎప్పుడూ ఉండాలని చాలామంది మహిళలు అనుకుంటారు. కానీ ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. మీ జీవితంలో అతడు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వేరే పనులు కూడా ఉంటాయి. మీ భవిష్యత్ కోసం పని చేస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అలిగితే మీ బంధం చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రతి వ్యక్తికి పరిమితులు ఉంటాయని స్త్రీలు గుర్తించడం చాలా ముఖ్యం.
ఏ సంబంధంలోనైనా సంఘర్షణ అనివార్యం. కొంతమంది మహిళలు చిన్న చిన్న గొడవలు కూడా ఎందుకులే అని సైలెంట్ ఉంటారు. ఎప్పుడూ తిపి మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చేదు కూడా జీవితంలో ఉండాలి. అప్పుడే బంధం విలువు తెలుస్తుంది. గొడవ ఎందుకులే అని ఊరుకుంటే పరిష్కరించని సమస్యలు ఒకరోజు గందరగోళంగా మారవచ్చు. ఇది వైవాహిక సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భర్తతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడం తప్పుకాదు. దీని కోసం చిన్న చిన్న తగాదాలు వచ్చినా ఏం కాదు.