Mars venus conjunction: కుజుడు, శుక్రుడు కలయిక.. ఈ రాశుల జాతకులకు సంపద రెట్టింపు కాబోతుంది
Mars venus conjunction: 30 సంవత్సరాల తర్వాత అంగరాకుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఈ రాశిలో శుక్రుడు, శని సంచరిస్తున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వాళ్ళు అదృష్టం పొందబోతున్నారు.
Mars venus conjunction: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని ఉన్న గ్రహాల అధిపతిగా పరిగణిస్తారు. ఈ గ్రహ సంచారం ప్రజల జీవితాల మీద గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. మార్చి 15న కుజుడు కుంభరాశి ప్రవేశం చేశాడు.
సోదర భావం, శక్తి, ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి కుజుడు కారకుడుగా భావిస్తారు. మేషం, వృశ్చిక రాశులను పాలిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు అదృష్ట స్థానంలో ఉంటే వాళ్ళు నిర్భయంగా, ధైర్యంగా ఉంటారు. అలాగే ప్రతికూల స్థానంలో ఉంటే జీవితంలోని వివిధ రంగాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఆటంకాలు ఎదురవుతాయి.
దాదాపు 30 సంవత్సరాల తర్వాత కుజుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు సంపదని ఇచ్చేవాడు. అటువంటి శుక్రుడు, కుజుడు కలిసినప్పుడు సంపదని ఇచ్చే శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ధన శక్తి యోగం అదృష్టమైనదిగా పరిగణిస్తారు. ఏప్రిల్ 22 వరకు కుజుడు కుంభ రాశిలోనే ఉండనున్నాడు.
అంగారకుడు ప్రవేశించిన కుంభ రాశిలో ఇప్పటికే శుక్రుడు, శని సంచరిస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రహాలతో కుజుడు కలయిక ఏర్పడనుంది. కుజ, శుక్ర కలయిక వల్ల బాధలు, కష్టాలు తొలగిపోనున్నాయి. సంపద పెరగనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశిలో కుజ, శుక్ర సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు కలయిక కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది ఈ గ్రహాలు కలయిక వల్ల మేలు పొందే లక్కీ రాశులు ఏవో చూద్దాం.
మేష రాశి
కుజుడు, శుక్రుడు కలయిక ప్రభావం మేషరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. పాత పెట్టబడులు మీకు లాభాలను ఇస్తాయి. అనేక ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
తులా రాశి
శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పనికి సంబంధించి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి జాతకులుకు ఈ రెండు గ్రహాల కలయిక శుభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్య, మేధోపరమైన పనుల పట్ల ఆసక్తిగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కుంభ రాశి
ఈ రాశిలోనే శుక్రుడు, కుజుడు, శని కలయిక జరుగుతుంది. ఫలితంగా కుంభ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కెరీర్ ఇదిగదలకు కొత్త అవకాశాల కనిపిస్తాయి. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పునః ప్రారంభించి పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యతలు అందుకుంటారు.