Mars transit: కుంభ రాశిలోకి కుజుడు.. ఏయే రాశుల వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందుతారంటే
Mars transit: మార్చి 15వ తేదీన కుజుడు కుంభ రాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇవి రెండు శత్రు గ్రహాలు కావడం వల్ల ఏయే రాశుల వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం.
Mars transit: ప్రస్తుతం మకర రాశిలో ఉన్న కుజుడు మార్చి 15న కుంభరాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ప్రవేశించిన మూడు రోజుల వ్యవధిలో శని అస్తంగత్వ దశ నుంచి ఉదయించబోతున్నాడు.
శక్తి, భూమి, ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి కుజుడు కారకుడిగా భావిస్తారు. కుజుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి ఆరోగ్యంగా, మనస్సు సంతోషంగా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు.
కుంభ రాశిని శని పాలిస్తాడు. అంగారకుడి అనుగ్రహంతో నాయకత్వ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శని, కుజుడు రెండు శత్రు గ్రహాలు కావడం వల్ల కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. కుంభ రాశిలో కుజుడు సంచారం ఈ రాశుల వారికి ప్రయోజనంగా ఉంటుంది.
మేష రాశి
మేష రాశి జాతకులకు కుజుడు ఒకటి, ఎనిమిది గృహాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఫలితంగా వారి కోరికలు నెరవేరుతాయి. ప్రస్తుతం కుజుడు మేష రాశి పదో ఇంట్లో సంచరిస్తాడు. అంగారకుడు సంచారం మేష రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయ వనరులు సమృద్ధిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభపడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు
వృషభ రాశి
కుజుడి అనుగ్రహంతో కెరీర్ పరంగా ఈ సమయం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం ఎదురవుతుంది. మీ పనిని అధికారులు గుర్తిస్తారు. కీర్తి, గౌరవం పొందుతారు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయవద్దు. ఈ సమయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన విషయాలలో విజయాలు సాధించే అవకాశం ఉంది. శ్రమతో కూడిన లాభాలు పొందుతారు. తెలివిగా పెట్టుబడులు పెట్టండి. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
సింహ రాశి
సింహ రాశి ఏడో ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవాళ్లు ఈ సమయంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహ ఉద్యోగులతో తగాదాలు పెంచుకోవద్దు. ఆర్థికంగా లాభపడతారు. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు.
ధనుస్సు రాశి
అంగారకుడు ధనుస్సు రాశి మూడవ ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. పని సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందుతారు. లాభాలతో పాటు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు సమసిపోతాయి.
కుంభ రాశి
కుంభ రాశిలోనే కుజుడు సంచరించబోతున్నాడు. ఈ సమయంలో కొద్దిగా చిరాకుగా ఉంటారు. కార్యాలయంలో మీరు చేసే పనులు నిర్ణిత సమయం కంటే ముందుగానే పూర్తి చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. ఆర్థికంగా మద్యస్థంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.
వీరికి ప్రతికూలం
కుంభ రాశిలో అంగారకుడి సంచారం ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడి ప్రభావంతో రాజకీయ నాయకులు ఆలోచనత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ అధికారులకు ఈ సమయం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఏ ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో చూద్దాం.
మిథున రాశి
ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తిపరంగా మీ ప్రత్యర్ధులు మీ పరువుకి భంగం కలిగించేలా ప్రయత్నిస్తారు. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో వాదనలు జరుగుతాయి.
కర్కాటక రాశి
వృత్తిపరమైన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహ ఉద్యోగులు సీనియర్ల నుండి మీకు మద్దతు లేకపోవడం వల్ల పని ఆలస్యం అవుతుంది. మనసు నిరాశతో నిండిపోతుంది. ఆర్థికంగా కొద్దిగా ఆందోళన కలుగుతుంది. రుణం తీసుకోవాలని ఆలోచిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. వ్యక్తిగత జీవితంలో అపార్ధాలు, అహం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు.
కుజుడిని శాంతపరిచే పరిహారాలు
కుజుడి స్థానం బలపరిచేందుకు కొన్ని ప్రభావంతమైన నివారణలు పాటించడం మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ఇంట్లో ఏదైనా శుభ ప్రదేశంలో మంగళ యంత్రాన్ని అమర్చి పూజించాలి. జాతకం ప్రకారం కుడి చేతికి ఎర్రటి పగడపు ఉంగరాన్ని ధరించండి. పేదలకు రాగి పాత్రలు, బట్టలు మొదలైన వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.