(1 / 5)
వేదిక శాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులు మారుతూ ఉంటాయి. ఇది.. అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. రానున్న రోజుల్లో.. కుజుడు- శుక్రుడు కలయిక జరగనుంది. ఫలితంగా ధన శక్తి యోగం ఏర్పడనుంది.
(2 / 5)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఫిబ్రవరిలో కుజుడు, శుక్రుడు కలయిక జరగనుంది. ఇది ధన శక్తి యోగానికి కారణం అవుతుంది. పలు రాశుల వారిపై ఇది సానుకూల ప్రభావం చూపించనుంది.
(3 / 5)
ధన శక్తి యోగం కారణంగా మేష రాశి వారికి ధన ప్రవాహం కనిపిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది. అన్ని వైపుల నుంచి గౌరవం లభిస్తుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(4 / 5)
వృషభ రాశి వారికి కెరీర్ దూసుకెళుతుంది. ఆధ్యాత్మికతవైపు అడుగులు వేస్తారు. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కొత్త బిజినెస్ మొదలుపెడతారు. విదేశీ ప్రయాణ అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ బంధం బలపడుతుంది.
(5 / 5)
కన్య రాశి వారికి మత పరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో సంతోషం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. పని ప్రదేశంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి సంతోషం పొందుతారు.
ఇతర గ్యాలరీలు