Venus moon conjunction: శుక్రుడు, చంద్రుడు కలయిక.. ఈ రాశుల జాతకుల సంపద పెరిగి ధనవంతులు అవుతారు-venus moon conjunction in kumbha rashi these zodiac signs get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Venus Moon Conjunction In Kumbha Rashi, These Zodiac Signs Get Wealth

Venus moon conjunction: శుక్రుడు, చంద్రుడు కలయిక.. ఈ రాశుల జాతకుల సంపద పెరిగి ధనవంతులు అవుతారు

Gunti Soundarya HT Telugu
Mar 09, 2024 10:54 AM IST

Venus moon conjunction: శుక్రుడు సంచరిస్తున్న కుంభ రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు. ఏయే రాశుల వాళ్ళకి ఈ అదృష్టం దక్కుతుందో చూద్దాం.

శుక్రుడు, చంద్రుడు కలయిక
శుక్రుడు, చంద్రుడు కలయిక

Venus moon conjunction: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడుని సంపద, కీర్తి, విలాసవంతమైన జీవితం, సంతోషం, శ్రేయస్సు, కళలకు కారకుడుగా భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు శనికి చెందిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 8వ తేదీ రాత్రి చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశి ప్రవేశం చేశాడు. భావోద్వేగాలు, మనసు, సునితత్వానికి చంద్రుడు ప్రతీకగా చెప్తారు.

ట్రెండింగ్ వార్తలు

శనికి చెందిన కుంభ రాశిలో చంద్రుడు, శుక్రుడు కలయిక కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తుంది. భౌతిక ఆనందాలు, వైవాహిక సంతృప్తి, ఆనందం, లగ్జరీ, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, ఫ్యాషన్ డిజైన్, రొమాన్స్ వంటి వాటిని శుక్రుడు ప్రభావితం చేస్తాడు. వృషభం, తులా రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.

జాతకంలో శుక్ర స్థానం బలంగా ఉంటే దంపతులు, ప్రేమికుల మధ్య ప్రేమ బలపడుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుక్రుడు ఈ నెలలో రెండు సార్లు తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. శివరాత్రికి ఒక రోజు ముందు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. మళ్ళీ మార్చి 31న కుంభ రాశి వదిలి మీన రాశి ప్రవేశం చేస్తాడు. శుక్రుడు, చల్లని చూపు చూసే చంద్రుడి కలయిక ప్రభావం ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

శుక్రుడు, చంద్రుడి కలయికతో కొత్త పనులకు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు. పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. కుటుంబం, స్నేహితులతో సంబంధాల మధ్య ప్రేమ పెరుగుతుంది.

మిథున రాశి

శుక్రుడు, చంద్రుడు కలయికతో మిథున రాశి జాతకులు వృత్తిలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళని అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఒంటరి వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారు.

కన్యా రాశి

రెండు గ్రహాల కలయికతో కన్య రాశి జాతకులు జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. ధన ప్రవాహానికి నూతన మార్గాలు ఏర్పడతాయి. ఆనందంగా ఉంటారు.

తులా రాశి

వృత్తిలో పురోగతి సాధిస్తారు. ధన లాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్వికులు ఆస్తి నుంచి సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పని భారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది.

ధనుస్సు రాశి

శుక్రుడు శుభ స్థానంలో ఉండటం వల్ల ధనుస్సు రాశి వారి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. జీవితంలో పెను మార్పులు వస్తాయి. ప్రేమ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంపద పెరుగుతుంది.

కుంభ రాశి

కుంభ రాశిలోనే శుక్ర, చంద్రుల సంయోగం జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి జాతకుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో మనస్సు సంతోషంగా ఉంటుంది.

WhatsApp channel