Gajakesari yoga: చంద్రుడి సంచారంతో గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి వరం
Gajakesari yoga: గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో వీళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి.
Gajakesari yoga: గ్రహాల గమనం వల్ల జనవరిలో అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. వాటిలో ఒకటి గజకేసరి యోగం. జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం అత్యంత శుభకరమైన యోగంగా పరిగణిస్తారు. దేవ గురువు బృహస్పతి, చంద్రుడి కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది.
గజకేసరి యోగం వల్ల శ్రేయస్సు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యం, ఆకస్మిక ధన లాభం, సంపద, దీర్ఘాయువు లభిస్తాయి. బృహస్పతి ఐశ్వర్యం, వైభవం, సంపద, గౌరవానికి ప్రతీకగా నిలుస్తాడు. ప్రస్తుతం బృహస్పతి మేష రాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 18న చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మేషంలో ఈ రెండింటి సంయోగం వల్ల ఏర్పడే గజకేసరి యోగ ప్రభావం పన్నెండు రాశుల మీద ఉంటుంది. వాటిలో కొన్ని రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. ఈ యోగం ప్రభావంతో ధన లాభం పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఏయే రాశులకి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే..
మేష రాశి
గురు, చంద్ర గ్రహాలు మేష రాశిలోనే కలుసుకుంటున్నాయి. అందువల్ల ఏర్పడే గజకేసరి యోగం మేష రాశి వారికి శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. జీవిత భాగస్వామితో మీ బంధం మాధుర్యంగా ఉంటుంది. మనసు సంతోషంతో పొంగిపోతుంది. ఉద్యోగస్థులకి అనుకూలమైన సమయం. అనుకున్న పనులు సకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.
మకర రాశి
గజకేసరి యోగం ఎంతో పవిత్రమైనది. ఈ యోగం ప్రభావంతో మకర రాశి వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ధనలాభం పొందే అవకాశం ఉంది కానీ ఖర్చుల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. కుటుంబంలో సుఖ సంతోషాలతో కూడిన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్యలు ఈ యోగం ఫలితంగా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం కలిసి రావడం వల్ల ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి గజకేసరి యోగం అద్భుతమైన ప్రయోజనాలు ఇవ్వబోతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్ కి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయం పట్ల ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకులమైనది.