Saturn transit: శని ఉదయం.. మార్చి 18 తర్వాత నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు-saturn transit after march 18 these zodiac signs get starts good days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: శని ఉదయం.. మార్చి 18 తర్వాత నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు

Saturn transit: శని ఉదయం.. మార్చి 18 తర్వాత నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు

Gunti Soundarya HT Telugu

Saturn transit: శని త్వరలోనే తన కదలిక మార్చుకోబోతున్నాడు. మూడు రోజుల్లో శని అస్తంగత్వ దశ నుంచి ఉదయించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అన్నింటా సంతృప్తికరమైన ఫలితాలు కలగబోతున్నాయి .

మార్చి 18 నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు (pixabay)

Saturn transit: శని దేవుడు న్యాయ దేవుడు. శని పేరు వింటేనే చాలా మంది భయపడిపోతారు. కానీ కర్మల అనుసారం ఫలితాలు ఇస్తాడు. మంచిగా, నిజాయతీగా ఉంటే శని ఆశీస్సుల ప్రభావంతో ఉన్నత స్థానాలు అధిగమిస్తారు.

ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న శని మార్చి 18న కుంభ రాశిలో ఉదయించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. శని కదలిక వల్ల శుభ, అశుభ ప్రభావాలు ఎదురవుతాయి. వృత్తి, ధనం, వైవాహిక జీవితం కూడా శని అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శనికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శని అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అదృష్టం రెట్టింపు అవుతుంది. శని చెడు ప్రభావం ఉంటే జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి.

మేష రాశి

శని ఉదయించడం మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. వేతన జీవులకు ఈ సమయం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. పదోన్నతితో పాటు జీతంలో పెరుగుదల ఉంటుంది. హోలీ తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది. అదృష్టం మీ వృత్తిలో అండగా ఉంటుంది. రోజువారీ వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాలు పొందుతారు.

మిథున రాశి

మిథున రాశి వారికి శని గ్రహం ఉదయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటి పనులు ప్రారంభిస్తారు. శని అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో శ్రేయస్సు, సంతోషం, పురోభివృద్ధి ఇస్తాడు. కుటుంబంతో సహా మీకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి పెద్ద పదవి లభిస్తుంది. సంపద రెట్టింపు అవుతుంది.

సింహ రాశి

శని కదలికలో మార్పు సింహ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పెద్ద ప్రయోజనాలు పొందుతారు. శని అనుగ్రహంతో కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనువైన సమయం ఇది. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఇనుము, నూనె వంటి శనికి సంబంధించిన వస్తువులతో వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు ఉంటాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి శని గ్రహం శుభాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో మీరు సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో చేయడం మంచిది. పనిలో ప్రశంసలు దక్కుతాయి ఫలితంగా ప్రమోషన్ కూడా లభిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఈ కాలంలో రాజ్యాధికారాన్ని పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి పెద్ద పదవులు దొరుకుతాయి. వ్యాపారులు కొత్త డీల్ ద్వారా ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభపడతారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఈ సమయంలో మీకు మంచి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి.