Chaturgrahi yogam: చతుర్గ్రాహి యోగం.. ఈ ఐదు రాశుల వాళ్ళు ఏప్రిల్ లో ఊహించని సర్ ప్రైజ్ అందుకుంటారు-chaturgrahi yogam in april month these five zodiac signs get unbelievable surprises ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaturgrahi Yogam: చతుర్గ్రాహి యోగం.. ఈ ఐదు రాశుల వాళ్ళు ఏప్రిల్ లో ఊహించని సర్ ప్రైజ్ అందుకుంటారు

Chaturgrahi yogam: చతుర్గ్రాహి యోగం.. ఈ ఐదు రాశుల వాళ్ళు ఏప్రిల్ లో ఊహించని సర్ ప్రైజ్ అందుకుంటారు

Gunti Soundarya HT Telugu
Mar 31, 2024 08:00 AM IST

Chaturgrahi yogam: ఏప్రిల్ నెలలో నాలుగు పెద్ద గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఐదు రాశుల వారికి ఏప్రిల్ నెల అదృష్టాన్ని ఇవ్వబోతుంది.

చతుర్గ్రాహి యోగం
చతుర్గ్రాహి యోగం (pixabay)

Chaturgrahi yogam: ఏప్రిల్ నెలలో అతిపెద్ద గ్రహాల సంచారం జరగబోతుంది. గ్రహాల కదలిక సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అనేక గ్రహాలతో సంయోగం కూడా జరుగుతుంది. ఈ గ్రహాల సంచార ప్రభావం పన్నెండు రాశుల మీద శుభ, అశుభంగా పడుతుంది. అలా ఏప్రిల్ నెలలో విలాసానికి ప్రతీకగా భావించే శుక్రుడు, గ్రహాల యువరాజు బుధుడు, అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు, నీడ గ్రహం రాహువు కలసి ఉండడంతో అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. దీని ఫలితంగా ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. నాలుగు గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి ఏర్పడుతుంది. ఈ అదృష్ట యోగం మేషరాశిలో సంభవిస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగం ప్రభావంతో కెరీర్, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తాయి. సానుకూల ఫలితాలు కలుగుతాయి. మీ సవాళ్లను అధిగమించగలిగే సహనం, ధైర్యం పొందుతారు.

సింహ రాశి

చతుర్గ్రాహి యోగం సింహ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. స్నేహితుల మద్దతుతో కెరీర్ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. చట్టపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు విజయానికి తలుపులు తెరుస్తాయి. కుటుంబ జీవితం సామరస్యపూర్వకంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య శృంగారభరితమైన వాతావరణం నెలకొంటుంది. నిలిచిపోయిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.

తులా రాశి

చతుర్గ్రాహి యోగంతో ఏప్రిల్ లో తులా రాశి వారు సంతృప్తికరమైన, లాభాదాయకమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో ఆశ్చర్యకరమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. మీ లవర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. ఊహించని ఆర్థిక లాభాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా ట్రిప్ కి ప్లాన్ చేసుకుని వెళతారు.

వృశ్చిక రాశి

నాలుగు గ్రహాల శుభ కలయిక ప్రభావంతో వృశ్చిక రాశి వారికి కోల్పోయిన ఆస్తులు తిరిగి పొందే అవకాశం లభిస్తుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఊహించిన విధంగా సంపద పెరుగుతుంది. సంతోషంతో మనసు నిండిపోతుంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

మీన రాశి

శుక్రుడు, బుధుడు, కుజుడు, రాహువు కలయిక వల్ల ఏర్పడే చతుర్గ్రాహి యోగం మీన రాశి వారికి సమృద్ధిగా ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. కెరీర్లో పురోగతి, ఆర్థిక లాభాలు, ఊహించని ధన లాభం రావడంతో మీరు ఆశ్చర్యపోతారు. అనుకూలమైన గ్రహాల కలయిక వల్ల మీన రాశి వారు వృత్తిపరమైన, వ్యక్తిగత రంగాలలో రాణిస్తారు. జాతకంలో ఈ యోగం ఉన్నవారికి శ్రేయస్సు, విజయానికి మార్గము సుగమం అవుతాయి. విశ్వాసంతో సవాళ్ళని అధిగమిస్తారు. కొత్త పనుల్లో నైపుణ్యం సాధిస్తారు. ఉద్యోగస్తులకు డబుల్ శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సమస్యల బాధ ఉండదు.