Gods idols at home: ఈ దేవతామూర్తుల విగ్రహాలు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టుకోవద్దు, అశుభం-which type of idols not kept in the home which goddess or gods idols in pooja gadi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gods Idols At Home: ఈ దేవతామూర్తుల విగ్రహాలు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టుకోవద్దు, అశుభం

Gods idols at home: ఈ దేవతామూర్తుల విగ్రహాలు పొరపాటున కూడా పూజ గదిలో పెట్టుకోవద్దు, అశుభం

Gunti Soundarya HT Telugu
Feb 27, 2024 03:10 PM IST

Gods idols at home: పూజ గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాల విషయంలో సరైన నియమాలు పాటించాలి. అప్పుడే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు.

పూజ గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టకూడదు
పూజ గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టకూడదు (pexels)

Gods idols at home: ప్రతిరోజు చాలామంది క్రమం తప్పకుండా పూజలు చేస్తారు. ఇంట్లో తమకి ఇష్టమైన దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టుకొని పూజలు చేసుకుంటారు. సనాతన ధర్మం ప్రకారం పూజ చేసేందుకు ఏర్పాటు చేసే విగ్రహాల విషయంలో తప్పనిసరిగా నియమాలు పాటించాలి.

విగ్రహాల దిశ ముఖ్యం

దేవతల విగ్రహాలు పూజ గదిలో సరైన స్థానంలో ఉన్నప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని దేవతలు లేదా దేవుళ్ళ విగ్రహాలు పొరపాటున కూడా పెట్టకూడదు. అలా చేయడంవల్ల ఇంట్లో సమస్యలు నెలకొంటాయి. కొందరు దేవుళ్ళ విగ్రహాలను కేవలం దేవాలయాల్లో మాత్రమే పూజించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోనూ పూజ గదిలో ప్రతిష్టించకూడదు.

దేవతల విగ్రహాలు పూజ గదిలో ఈశాన్య దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ఈ దశలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.అలాగే పూజ గదిలో పొరపాటున కూడా విరిగిన, పగిలిన దేవుళ్ళ విగ్రహాలు ఉంచకూడదు. ఎండిపోయిన వాడిపోయిన పూలు కూడా పూజ గదిలో నుంచి ఎప్పటికప్పుడు తీసేయాలి. విగ్రహాలు ఏ దిశలో ఉంచాలి? ఎలాంటి వస్తువులు పూజా మందిరంలో ఉంచకూడదు? ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలనే విషయాలు తెలుసుకుందాం.

ఇలాంటి విగ్రహాలు పెట్టకూడదు

జ్యోతిష, వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం రుద్ర ముద్రలో ఉన్న ఏ దేవతామూర్తుల విగ్రహాలు కూడా పూజ గదిలో ప్రతిష్టించకూడదు. పూజగది ఇంటి మొత్తానికి సానుకూల శక్తిని ప్రసరించే శక్తి కేంద్రంగా ఉంటుంది. అందుకే అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా పాలరాతితో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించకూడదు.

ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి

పూజ గదిలో విగ్రహాలు పెట్టుకోవాలని అనుకుంటే బంగారం, వెండి, ఇత్తడి లేదా మట్టితో తయారు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు పెట్టుకోవచ్చు. బంగారం కూడా ఎక్కువగా పెట్టకపోవడమే మంచిది. అలాగే దేవుళ్ళ చిత్రపటాలు కూడా పూజ గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంట్లో చాలామంది వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం కూడా వినాయకుడు విగ్రహం ఇంట్లో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఇంట్లో ఒక వినాయకుడి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వినాయకుడికి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు సరస్వతి దేవి ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా గణేష్ విగ్రహం నిలబడి ఉన్నట్టు, నృత్య భంగిమలో ఉన్న విగ్రహం పూజ గదిలో పెట్టకూడదు.

చాలా మంది శివలింగం ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టం చూపిస్తారు. కానీ ఇంట్లో శివలింగానికి బదులుగా శివపార్వతులు కలిసి ఉన్న చిత్రపటం ఉంచుకోవడం శుభప్రదం. ఉగ్ర రూపంలో ఉన్న శివుని విగ్రహం కూడా ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ శివలింగం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే బొటనవేలు పరిమాణం కంటే చిన్నదిగా ఉన్న దాన్ని పెట్టుకోవచ్చు.

దుర్గామాత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. మహిషాసుర మర్దిని అవతారం, యుద్ధం చేసే చండికా దేవి రూపం ఉన్న విగ్రహాలు ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే దుర్గాదేవి వాహనం సింహం నోరు మూసి ఉన్న విగ్రహం మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి.

లక్ష్మీదేవి కూర్చుని ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే శనీశ్వరుడు, రాహువు, కేతువు సంబంధించి ఎటువంటి విగ్రహాలు ఇంటి పూజ గదిలో ఉండకూడదు. వీరిని ఆరాధించేందుకు కేవలం దేవాలయాలకు మాత్రమే వెళ్ళాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు శని దేవుడి కాళ్ళు మాత్రం చూడాలి. ఇక త్రిమూర్తులుగా భావించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాల విషయానికొస్తే బ్రహ్మ దేవుడి విగ్రహం ఇంట్లో ప్రతిష్టించకూడదు.

WhatsApp channel