Pooja room: భగవంతుని ఆశీర్వాదం పొందాలంటే పూజ గది ఈ దిశలోనే ఉండాలి
Pooja room: ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజ గది. దేవుళ్ళ ఆశీర్వాదాలు కావాలంటే పూజ గదిని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలి?
Pooja room: ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది. ఎంతో పవిత్రమైన ఈ స్థలాన్ని ఇప్పుడు చాలా మంది ఎంతో సుందరంగా తీర్చదిద్దుకుంటున్నారు. దేవుళ్ళ చిత్రపటాలు, విగ్రహాలు పెట్టి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. పూజ తాళి నుంచి కుబేర యంత్రం వరకు ఈ పూజ గదిలో ఉంటాయి.
ఆపద వచ్చినప్పుడు దేవుళ్ళ ఆశీర్వాదం, ఓదార్పు కోసం ఇక్కడికి వచ్చి దేవుడికి నమస్కరించుకుంటారు. హిందూ గృహాలలో పూజ గది పూజలు చేసేందుకు మాత్రమే కాదు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం ఇది.
వాస్తు ప్రకారం పూజ గది
వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఈశాన్య మూలలో పూజ గది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుంది. ఇది కుటుంబానికి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. స్వచ్చమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.
పూజా మందిరాన్ని పడక గది లేదా వంట గదిలో ఎప్పుడు పెట్టకూడదు. పడకగది విశ్రాంతి, ఏకాంతంగా గడిపే ప్రదేశం. పూజ, భక్తికి సరైన వాతావరణాన్ని అందించదు. అలాగే వంట గది ఆన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం. వివిధ శక్తులు కలిగి ఉన్న అనేక మంది అతిథులు వస్తారు. అందుకే పూజా మందిరాన్ని అలాంటి ప్రదేశంలో ఉంచకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
సరైన స్థానంలో పెట్టాలి
ఆరాధనలో ముఖ్యమైన భాగం విగ్రహాలు, దేవుని చిత్రపటాలు ఉంచే స్థలం. పూజారి చెప్పే దాని ప్రకారమే దేవతల విగ్రహాలు స్థాపన చేయాలి. సరైన స్థాపన అనేది విగ్రహాలలోకి సానుకూల, దైవిక శక్తులని ఆహ్వానించడానికి ఉపయోగపడుతుంది. నిర్ధిష్ట ఆచారాల ప్రకారం మంత్రాలు జపించాలి. దేవుడిని ఆరాధించే ప్రదేశం పూజ గది. అంటే దైవిక శక్తులు ఉండే స్థలం. ఎంతో పవిత్రమైనది.
విగ్రహాలు పెట్టె ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పూజా మందిరంలో పెట్టె చిత్రపటాలు చిరిగిపోయినవి, పగిలిన విగ్రహాలు అసలు ఉంచకూడదు. ఇవి నష్టానికి సంకేతాలుగా మారతాయి. అటువంటి విగ్రహాలు పవిత్ర జలంలో నిమజ్జనం చేయాలి.. లేదంటే ఆలయంలోని పూజారికి ఇవ్వాలి.
పూజా మందిరం శుభ్రంగా ఉండాలి
చాలా ఇళ్ళలో పూజ గదిని రోజుకు రెండు సార్లు మాత్రమే సందర్శిస్తారు. తెల్లవారుజామున పూజ చేసే ముందు, సూర్యుడు అస్తమించిన తర్వాత పూజ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పూజ గది మిగతా సమయాల్లో మూసేసి ఉంటుంది. దీని వల్ల దుమ్ము, ధూళి పేరుకుపోవడానికి దారి తీస్తుంది.
పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి. లోపల దుమ్ముని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. పూజ గదిలో దుమ్ము, ధూళి లేదంటే అవాంఛిత వస్తువులు ఉంటే సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.
పూజ చేయడం అంటే దేవుడితో మమేకం అయ్యేందుకు ప్రయత్నించడం. ప్రార్థన అనేది విశ్వంలో ఉన్న విభిన్న సానుకూల శక్తులని పిలిచే రూపం. ప్రార్థన ద్వారా మనం దేవుడికి దగ్గరగా ఉంటాం. పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో పూజ చేయాలి. చిత్త శుద్ధితో పూజ చేయడం ముఖ్యం. మృదువైన భక్తి గీతాలు వింటూ పూజ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. పూజ గదిని మొబైల్ ఫోన్ లేదా గాడ్జెట్ లేని జోన్ గా ఉంచేందుకు ప్రయత్నించండి.