shami plant: శమీ మొక్కకి హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. శివుడు, శని దేవుడికి ఎంతో ప్రీతికరమైన మొక్క ఇది. శమీ పూలతో పూజ చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు. ఈ మొక్క ఇంట్లో నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. శని దోషం వల్ల వచ్చే అనార్థాలు తొలగించుకునేందుకు శనివారం నాడు శమీ మొక్కకి పూజ చేస్తే ఫలితం పొందుతారు.
శమీ మొక్క ఇంట్లో ఉంటే సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. కుంభ రాశి కలిగిన వారికి శని దోషం ఉంటే శమీ మొక్క నాటడం వల్ల దోషం నుంచి విముక్తి పొందుతారు. వాస్తు ప్రకారం శమీ మొక్కని ఇంట్లో నాటేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శమీ మొక్కని పెట్టిన చోట అపరిశుభ్రంగా ఉంచకూడదు. శమీ మొక్కను తప్పు దిశలో నాటడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వయసు ప్రకారం శమీ మొక్కని ఇంటికి ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటాలి. ఇలా చేస్తే జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. సంపద రాకకు కొత్త మార్గాలు తెరుస్తుంది. శనివారం నాడు శమీ మొక్క దగ్గర దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.
జీవితంలోని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వాస్తు నియమాల ప్రకారం శమీ మొక్కని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంట్లో మొక్క పెట్టేందుకు స్థలం లేకపోతే ఇంటి మేడ మీద అయిన పెట్టుకోవచ్చు. చుట్టూ పక్కల ప్రదేశంలో అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదు.
శమీ మొక్కని మురికిగా ఉండే ప్రదేశంలో నాటకూడదు. ఇలా చేస్తే ఆ వ్యక్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శనివారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున శమీ మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేస్తే ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధికి అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు. శమీ మొక్క దగ్గర బూట్లు, చెప్పులు పొరపాటున కూడా పెట్టకూడదు. అలా చేస్తే అశుభం. శని దేవుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని అంటారు.
శనివారం రోజు క్రమం తప్పకుండా శమీ మొక్కకి పూజ చేస్తే శని దేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఇది శని సాదే సతీ, దయ్యాతో సహ అనేక చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం శమీ మొక్క దగ్గర దీపం పెడితే జీవితంలో ఎదురయ్యే అన్నీ అవరోధాల నుంచి బయట పడతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. శమీ మొక్కకు నీరు పోస్తూ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంపదలు పెరుగుతాయని నమ్మకం. శమీ మొక్క సరైన స్థలంలో ఉంటే శని దేవుని అనుగ్రహం ఆశీస్సులు లభిస్తాయి.