Balcony vastu tips: బాల్కనీలో వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి? ఎటువంటి మొక్కలు పెంచకూడదు?-keep these things on mind to while keeping plants in balcony which type of plants does not set for balcony as per vastu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Balcony Vastu Tips: బాల్కనీలో వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి? ఎటువంటి మొక్కలు పెంచకూడదు?

Balcony vastu tips: బాల్కనీలో వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి? ఎటువంటి మొక్కలు పెంచకూడదు?

Gunti Soundarya HT Telugu
Mar 04, 2024 10:52 AM IST

Balcony vastu tips: మీ ఇంటిని మరింత అందంగా మార్చేది బాల్కనీ. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల పూల మొక్కలు, అందమైన మొక్కలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి, పెంచుకోకూడదో తెలుసా?

బాల్కనీలో ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు
బాల్కనీలో ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు (pixabay)

Balcony vastu tips: ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో బాల్కనీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కూడా ఇంట్లో ఒక అంతర్భాగంగా మారిపోయింది. చిన్న చిన్న కుండీలో మొక్కలు పెంచుకుంటూ బాల్కనీ చాలా అందంగా రూపొందించుకుంటున్నారు. స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి ఇంట్లో ప్రవేశించేలాగా బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

రోజూ కాసేపు పచ్చని మొక్కల మధ్య బాల్కనీలో సేద తీరితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి చూసేందుకు కూడా అందంగా అనిపిస్తాయి. ఇంటికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఇది విశ్రాంతి ప్రదేశంగా మారిపోయింది. సరదాగా కాసేపు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు బాల్కనీ ఒక చక్కని ప్రదేశంగా మారింది. అయితే బాల్కనీలో మొక్కలు పెంచుకోవడానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం ముక్కలు పెంచుకుంటే వాస్తు దోషాలు లేకుండా మీ ఇంట సుఖసంతోషాలు నిలుస్తాయి. బాల్కనీ ఉండే దిశకి అనుగుణంగా ఎటువంటి మొక్కలు పెంచుకోవాలో తెలుసుకుందాం.

బాల్కనీ తూర్పు దిశలో ఉంటే…

మీ బాల్కనీ తూర్పు దిశలో ఉన్నట్లయితే తులసి మొక్క ఉంచడం మంచిది. బంతి పువ్వులు వంటి కొన్ని పూల మొక్కలు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బంతి మొక్కలు పెట్టుకోవాలనుకుంటే వాటిని ఈశాన్య దిశలో ఉంచాలి. ఇది పిల్లల కేరీర్ పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఉత్తర దిశలో ఉంటే..

మీ ఇంటి బాల్కనీ ఉత్తర దిశలో ఉంటే అక్కడ పెద్ద మొక్కలు ఉంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో చిన్న మొక్కలు సరైనవిగా పరిగణిస్తారు. ఈ స్థలంలో మీరు మనీ ప్లాంట్ లేదా క్రాసుల ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ ఇంట సిరిసంపదలో నెలకొంటాయి.

పశ్చిమ దిశలో ఉంటే

బాల్కనీ పశ్చిమ దిశలో ఉన్నట్లయితే మీరు మీడియం సైజులోని ఆకుపచ్చని మొక్కలు పెంచుకోవచ్చు. మొక్కల ఎత్తు రెండు నుంచి నాలుగు అడుగుల మధ్య ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో బాల్కనీలో చిన్న ముక్కలు ఉంచితే అవి ఎటువంటి ప్రయోజనాలను ఇవ్వవు. అందుకే మీడియం సైజులో ఉన్న మొక్కలు పెంచుకోవడం వల్ల శని స్థానం బలోపేతం అవుతుంది. జీవితంలో ముందుకు సాగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి.

దక్షిణ దిశలో ఉంటే

మీ ఇంటి బాల్కనీ దక్షిణ దిశలో ఉంటే పెద్ద మొక్కలు అక్కడ ఉంచుకోవచ్చు. బ్లాక్ ఫికస్, తాటి మొక్కలు, మధుమాల్తి లేదా బౌగెన్ విల్లా వంటి కొన్ని తీగలు మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి మీ బాల్కనీని అందంగా కనిపించేలా చేస్తాయి. ఇవి పెంచుకోవడం వల్ల మీకు గౌరవం రెట్టింపు అవుతుంది.

బాల్కనీలో పెంచకూడని మొక్కలు

కొన్ని మొక్కలను బాల్కనీలో పొరపాటున కూడా పెంచకూడదు. మీ బాల్కనీ ఏ దిశలో ఉన్నా కూడా కాక్టస్ లేదా రబ్బర్ మొక్కలను పెట్టుకోకూడదు. అలాగే ఏదైనా ఎండిపోయిన మొక్క ఉంటే వెంటనే దాన్ని తొలగించాలి. లేదంటే సమస్యలు ఏర్పడతాయి. బాల్కనీలో ఎక్కువగా తీగ మొక్కలు పెంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.

కొంతమంది బాల్కనీలో ఫర్నిచర్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కుర్చీలు, చిన్న సోఫాలు లేదంటే ఊయల వంటి ఫర్నిచర్ పెట్టుకోవాలనుకుంటే వాటిని నైరుతి దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బాల్కనీలో కచ్చితంగా లైట్లు పెట్టుకోవాలి. బాల్కనీ ఎప్పుడు చీకటిగా ఉంచుకోకూడదు. అది ప్రతికూలతకు దారితీస్తుంది.

 

టాపిక్