Money Plant :ఇంట్లో మనీ ప్లాంట్‌ పెరగడం లేదా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి!-money plant grow guide how to grow a money plant ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Money Plant :ఇంట్లో మనీ ప్లాంట్‌ పెరగడం లేదా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Money Plant :ఇంట్లో మనీ ప్లాంట్‌ పెరగడం లేదా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 10:04 PM IST

Money Plant Benefits: చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. మని ప్లాంట్ పెంచుకుంటే ఇంటి అందంతో పాటు, వాస్తు పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి

Money Plant Benefits:
Money Plant Benefits:

ఇంట్లో మని ప్లాంట్ పెంచుకుంటే ఇంటి అందంతో పాటు, వాస్తు పరంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మనీ ప్లాంట్ పేరు తగ్గట్టుగానే ఈ ప్లాంట్‌కు డబ్బును ఆకర్షించే గుణం ఉంటుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంట్టో అదృష్టం, సంపదను తెస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో సంతోషం, సంపద కలగాలంటే మనీ ప్లాంట్‌ని పెంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే పెంచుకునే మనీ ప్లాంట్ చక్కగా, ఆరోగ్య ఉన్నప్పుడే ఫలితాలు దక్కుతాయని శాస్త్రం చెబుతుంది. మరి ఇంట్లో మనీ ప్లాంట్ ఎంత ప్రయత్నించినా పెరగడం లేదా, మీ మనీ ప్లాంట్‌ల పెరుగుదలను వేగవంతం చేయడానికి ఈ చిట్కాలలో కొన్నింటిని అనుసరించండి.

సాధారణంగా మనీ ప్లాంట్‌ మట్టిలో లేదా నీటిలో పెంచవచ్చు. మీ మొక్కపై ఆకులు రాకుండా ఉంటే నీటిలో కాకుండా మట్టిలో నాటడం మంచిది. కుండలో ఉంచే ముందు కాండం ఆకులను కత్తిరించండి. ఆ తరువాత, దానిని మట్టిలో కప్పి పాతిపెట్టండి. అరంభంలో ఎరువులు వేయవద్దు.

మీ మనీ ప్లాంట్‌ నీటిలో బాగా పెరుగుతున్నట్లు మెుక్క ఉన్న నీటిని ప్రతి 15 నుండి 20 రోజులకు ఒక్కసారి కుండిలోని నీటిని మారుస్తుండాలి. ప్లాంట్ ఆరోగ్యంగా పెరుగాలంటే

మనీ ప్లాంట్ నోడ్ తప్పనిసరిగా నీటిలో మునిగి ఉండాలని గుర్తుంచుకోండి.

మనీ ప్లాంట్‌ను డెరక్ట్ సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎప్సమ్ సాల్ట్‌ను జోడించవచ్చు. మనీ ప్లాంట్‌కు ప్రతిరోజూ నీరు పెట్టవద్దు. లేకపోతే మెుక్క ఆరోగ్యంగా పెరగదు.

మెుక్కను ఎప్పుడూ అతిగా ఫలదీకరణం చేయవద్దు ఎందుకంటే అలా చేయడం వలన ఆకులు కుళ్ళిపోవడం, మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

మొక్కను క్రమం తప్పకుండా కత్తిరించండి. ఎండిన లేదా కుళ్ళిన ఆకులను తొలగించండి. లేకపోతే, మెుక్కను పెంచడం పెద్దగా సవాలుగా ఉంటుంది.

సాధారణంగా పొడి వాతావరణంలో మెుక్క పెరుగుదల అడ్డంకిగా మారుతుంది. కాబట్టి, ఆకులను తొలగించడం వల్ల ప్రయోజనకరంగా ఉండవచ్చు.

మనీ ప్లాంట్‌ను ఇలా ఇంటి లోపల పెంచడం వల్ల మీ ఇంట్లోకి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి

సంబంధిత కథనం