Feng shui plants: ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే డబ్బు, అదృష్టానికి లోటు ఉండదు
Feng shui plants: నెగటివ్ ఎనర్జీ వల్ల ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో పెట్టుకున్నారంటే సానుకూలత, అదృష్టం, డబ్బు మీ సొంతం అవుతాయి.
Feng shui plants: అదృష్టం, సంపదని ఇచ్చే మొక్కలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మనీ ప్లాంట్. ఈ మధ్య కాలంలో దాదాపు అందరూ తమ ఇళ్ళల్లో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారు. అయితే ఫెంగ్ షూయి శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మాత్రమే కాదు మరికొన్ని మొక్కలు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయట పడేస్తాయి.
జీవితానికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి అనేక నివారణలు ఫెంగ్ షూయిలో చాలా ఉన్నాయి. ఈ మొక్కలు ఇంట్లో సరైన దిశలో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటూ అప్పులు ఎక్కువగా చేస్తూ ఇబ్బందులు పడుతున్నారా? ఉద్యోగం, వ్యాపారాల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఫెంగ్ షూయి మొక్కలు ఇంట్లో పెట్టుకోండి. మంచి ఫలితాలు ఇస్తాయి.
మనీ ప్లాంట్
మిమ్మల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇంటికి మనీ ప్లాంట్ తీసుకురండి. ఇది చాలా అదృష్టంగా భావిస్తారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. మనీ ప్లాంట్ సానుకులమైన శక్తిని ఇస్తుంది. డబ్బు, అదృష్టాన్ని పెంచుతుంది. అదృష్టాన్ని సూచికగా భావిస్తారు.
వెదురు మొక్క
వెదురు చెట్టుని ఇంటికి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈస్ట్ కార్నర్ లో వెదురు మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. వెదురు మొక్కని సరైన ప్రదేశంలో ఉంచితే అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆ వ్యక్తి సంపద, కీర్తి, ఆనందానికి లోటు ఉండదు. ఇంటి సభ్యుల పురోగతి కోసం వెదురు మొక్కతో పాటు లాఫింగ్ బుద్ధాను స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోండి. విజయానికి మార్గం సుగమం అవుతుంది.
డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇంట్లో సంతోషం, శ్రేయస్సు తీసుకొస్తుంది. పడకగదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. లివింగ్ రూమ్ లో తూర్పు లేదా దక్షిణ మూలలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఇంటి ఈశాన్య మూలలో వెదురు మొక్కను ఉంచండి.
జేడ్ ప్లాంట్
దీన్నే క్రాసులా మొక్క లేదా కుబేర మొక్క అంటారు. చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే అది ఇంట్లోని ప్రతికూల శక్తి వల్ల కూడా కావచ్చు. ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించేందుకు ఆనందం, శ్రేయస్సుని పెంచేందుకు జడే మొక్క నాటవచ్చు.
పీస్ లిల్లీ
ఆర్థిక స్థిరత్వం కోసం పీస్ లిల్లీని నాటాలి. ఈ మొక్క ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచడం వల్ల సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి.
తులసి మొక్క
హిందూ మతంలో తులసి మొక్కని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు.