Ketu transit: కేతువు సంచారం.. ఈ రాశుల వారికి రానున్న 8 నెలలు కష్టకాలమే-ketu transit 2024 these zodiac signs faces stress in their life in the coming 8 months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ketu Transit: కేతువు సంచారం.. ఈ రాశుల వారికి రానున్న 8 నెలలు కష్టకాలమే

Ketu transit: కేతువు సంచారం.. ఈ రాశుల వారికి రానున్న 8 నెలలు కష్టకాలమే

Gunti Soundarya HT Telugu
Apr 02, 2024 03:20 PM IST

Ketu transit: కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. ఫలితంగా రానున్న ఎనిమిది నెలలు కొన్ని రాశుల వారి జీవితంలో అలజడి ఏర్పడుతుంది. కష్టాలతో ఇబ్బందులు పడబోతున్నారు.

కేతు సంచారంతో ఇబ్బందులు పడే రాశులు ఇవే
కేతు సంచారంతో ఇబ్బందులు పడే రాశులు ఇవే

Ketu transit: జ్యోతిష్య శాస్త్రంలో కేతువుని నీడ గ్రహంగా పరిగణిస్తారు. శని గ్రహం మాదిరిగానే నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరొక రాశికి మారెందుకు సుమారు 18 నెలలు సమయం పడుతుంది. గతేడాది అక్టోబర్ లో కేతువు కన్యా రాశిలో ప్రవేశించాడు. 2025 ఏప్రిల్ వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు.

ఈ ఏడాది కేతు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మరికొందరు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఎనిమిది నెలలపాటు కేతువు కన్యా రాశిలో సంచరించడం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో చూద్దాం.

కర్కాటక రాశి

కేతువు కదలిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమస్యలు అధికమవుతాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్ద వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. కుటుంబంలో చికాకు వాతావరణం, స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. దీని వల్ల మానసికంగా కుంగిపోతారు.

తులా రాశి

తులా రాశి వారికి కేతు కదలిక అశుభ ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి రానున్న ఎనిమిది నెలలు కష్టకాలంగా మారుతుంది. పనిచేసే ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం ఉండకపోవచ్చు. సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. లావాదేవీలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులకు కేతువు కదలిక ప్రయోజనకరంగా ఉండదు. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్తాయికి చేరతాయి. అనవసర కలహాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

కేతువు కష్టాలను మాత్రమే కాదు అద్భుతమైన ప్రయోజనాలను కూడా ఇస్తాడు. కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తాడు. కేతువు సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి రానున్న ఎనిమిది నెలలు ఒక వరంలాగా ఉంటుంది.

మేష రాశి

మేష రాశిలో జన్మించిన వారికి రాబోయే ఎనిమిది నెలలు కేతువు మంచి ప్రయోజనాలను అందిస్తాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టకాలంలో ఊహించని విధంగా డబ్బు అందుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారం చేసేవారు దీర్ఘకాలికంగా అధిక రాబడిని ఇచ్చే వ్యాపార ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కెరీర్ లో ఉన్నత స్థానాలకు వెళతారు.

వృశ్చిక రాశి

కేతువు అదృష్టాన్ని పొందబోయే రాశులలో వృశ్చిక రాశి ఒకటి. వ్యాపారం చేసే వ్యక్తులు అద్భుతమైన లాభాలు పొందుతారు. మీ పనులన్నీ పూర్తి అవుతాయి. ధనలాభం ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఒత్తిడిని నివారించుకుంటే ప్రశాంతమైన జీవితం గడుపుతారు. తోబుట్టువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా ట్రిప్ కి వెళతారు.

WhatsApp channel

సంబంధిత కథనం