Jupiter transit: బృహస్పతి సంచారం.. వీరికి అన్నీ సమస్యలే, అప్పుల బాధలు, ప్రయాణాలలో ప్రమాదాలు-jupiter transit may cause problems in these three zodiac signs life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: బృహస్పతి సంచారం.. వీరికి అన్నీ సమస్యలే, అప్పుల బాధలు, ప్రయాణాలలో ప్రమాదాలు

Jupiter transit: బృహస్పతి సంచారం.. వీరికి అన్నీ సమస్యలే, అప్పుల బాధలు, ప్రయాణాలలో ప్రమాదాలు

Gunti Soundarya HT Telugu
May 06, 2024 02:36 PM IST

Jupiter transit: దేవ గురువుగా భావించే బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి భారీ నష్టాన్ని ఇవ్వబోతుంది. ఈ రాశుల వారికి అన్నీ సమస్యలే. అప్పుల బాధలు ఒకవైపు ప్రయాణాలలో ప్రమాదాలు మరొక వైపు రాబోతున్నాయి.

బృహస్పతి సంచారం
బృహస్పతి సంచారం

Jupiter transit: బృహస్పతిని తొమ్మిది గ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. అందుకే దేవతల గురువుగా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాశి చక్రం మారుస్తాడు. అందుకే మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేసేందుకు 12 సంవత్సరాలు పడుతుంది.

ప్రస్తుతం బృహస్పతి దాని శత్రు గ్రహమైన శుక్రుడికి చెందిన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశికి శుక్రుడు పాలకుడు. ఇవి రెండు విరోధి గ్రహాలుగా చెప్తారు. శత్రు గ్రహానికి చెందిన రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల గణనీయమైయా మార్పులు జరుగుతాయి. బృహస్పతి ఇప్పుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు. దీని వల్ల 40 రోజుల పాటు బలహీనంగా ఉంటుంది. బృహస్పతి కదలిక మూడు రాశుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పనిలో అడ్డంకులు కలుగుతాయి. ఉద్యోగాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. బృహస్పతి సంచారం వల్ల ఏ మూడు రాశుల వారికి దురదృష్టకరమైన ప్రభావాలు ఎదురవుతాయో చూద్దాం.

ధనుస్సు

బృహస్పతి సంచారం ధనుస్సు రాశి ఆరో ఇంట్లో జరుగుతుంది. ఈ ఇల్లు అనారోగ్యాలకు, శత్రువులకు మూలంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సమయంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతారు. కార్యాలయం లేదా పరిశ్రమలో విరోధులు ఏర్పడతారు. మీ సహోద్యోగులు మీ ప్రయత్నాల వల్ల సంతోషంగా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం చిరాకుగా కనిపిస్తారు. ప్రయాణించేటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పనిలో సమస్యలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మానసిక ఉద్రిక్తత వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండకపోవచ్చు.

తుల రాశి

తులా రాశి జాతకులు బృహస్పతి సంచార సమయంలో సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ రాశి ఎనిమిదో ఇంట్లో గురు గ్రహ సంచారం ఉంటుంది. అందుకే ఈ సమయంలో జాగ్రత్త వహించాలి. పనిలో సమస్యలు, సవాళ్ళు ఉంటాయి. ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు తమ కెరీర్ లో ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వాళ్ళు తమ లక్ష్యాలను సాధించగలరు. ఆర్థిక ఇబ్బందులు కలగబోతున్నాయి. ఖర్చులు పెరిగి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తోబుట్టువులు అండగా నిలవరు. గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తుంటే కొద్ది రోజులు వేచి ఉండటం మంచిది.

మీన రాశి

బృహస్పతి మీన రాశి మూడో ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో ఏ పని పూర్తి చేయలేకపోతారు. అలసట, బద్ధకం వల్ల ప్రతిదీ వాయిదా వేస్తారు. ప్రత్యర్థులు పనిలో మీ మీద కుట్ర చేసే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలు తమ వ్యాపార రంగంలో అనేక సవాళ్ళు, అడ్డంకులు ఎదుర్కొంటారు. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

బృహస్పతి అనుగ్రహం కోసం

గురు గ్రహ అనుగ్రహం పొందటం కోసం కొన్ని నివారణలు పాటించడం మంచిది. చెడ్డ వ్యక్తులకు దూరంగా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే పసుపు రంగు దుస్తులు ధరించాలి. లేదంటే పసుపు రంగు ఖర్చిఫ్ జేబులో వెంట పెట్టుకోండి. గురువారం శనగపిండితో హల్వాని చేయాలి. అలాగే నుదుటిపై కుంకుమ తిలకం ధరించాలి. అరటిపండ్లు దానం చేయడం మంచిది. ఈ పనులు చేస్తే బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.