Jupiter combust: బృహస్పతి అస్తంగత్వం.. వీరికి ఆర్థిక సంక్షోభమే, డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు
Jupiter combust: దేవ గురువు బృహస్పతి మే 3వ తేదీన అస్తంగత్వ దశలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు.
Jupiter combust: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు అస్తంగత్వ దశకి వెళ్ళినప్పుడు అన్ని రాశుల మీద దాని ప్రభావాలను చూపిస్తాయి. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన రాశిని మార్చుకున్నాడు. మే 1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు.
మే 3వ తేదీ బృహస్పతి అస్తంగత్వ దశలోకి వెళ్తుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై విభిన్న ఫలితాలు కనిపిస్తాయి. బృహస్పతి అస్తమించడం వల్ల ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే రాశులు ఉన్నాయి. వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. శుక్రుడు, బృహస్పతి మధ్య శత్రు సంబంధం ఉంది. ఈ కాలంలో కొత్త ప్రేమ సంబంధాన్ని ప్రారంభించడానికి అనుకూలమైనది కాదు. వివాహ సంబంధాలకు శుభప్రదమైన సమయం కాదు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతిని దేవ గురువుగా భావిస్తారు. ఈ గ్రహాన్ని దైవత్వం, మంగళకరమైన దేవుడు అని కూడా అంటారు. ప్రజల జీవితాల్లో శాంతి సంతోషాన్ని కొనసాగించేందుకు బృహస్పతి శుభ స్థానం చాలా అవసరం. గురు గ్రహం శుభకరంగా ఉంటే సంపద పెరుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బృహస్పతి చెడు లేదా బలహీన స్థితిలో ఉంటే సౌకర్యాలు తగ్గిపోతాయి. వివాహ నిశ్చయంలో అడ్డంకులు, వైవాహిక జీవితంలో ఆటంకాలు, గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బృహస్పతి ప్రభావం సంపద మీద ఉంటుంది. గురు గ్రహం దహనం కారణంగా ఆర్థిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభ రాశి
గురు గ్రహ దహనం వృషభ రాశిలోనే జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా చాలా పెరుగుతాయి. డబ్బు ఆదా చేయడం చాలా కష్టమవుతుంది. భవిష్యత్తులో ఇది వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక ఒత్తిడిని ఓపికగా ఎదురుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. అనవసరమైన ఖర్చులను నివారించాలి. వీటిని పాటించలేకపోతే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.
సింహ రాశి
బృహస్పతి అస్తంగత్వం సింహ రాశి వారికి ఆర్థిక జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాకపోవచ్చు. ఈ విషయంలో వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో వివిధ అంశాలలో డబ్బు ప్రవాహం తగ్గే అవకాశం కూడా ఉంది. ఆదాయ వనరులు క్షీణిస్తాయి. ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. డబ్బు ఆదా చేయలేక పోతారు. దీని కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిధుల కొరతతో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. మీ కుటుంబ అవసరాలను తీర్చడం కూడా కష్టమవుతుంది.
మిథున రాశి
బృహస్పతి దహన కాలం మిథున రాశి వారికి కఠినంగా ఉంటుంది. ఎక్కువ లాభాలు పొందుతారు కానీ ఖర్చులు అదేవిధంగా ఉంటాయి. డబ్బు ఆదా చేయలేకపోతారు. మీ మీద ఉన్న బాధ్యతలు నిర్వహించడానికి ఇబ్బంది పడతారు. ఖర్చులను నియంత్రించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టె ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. డబ్బుకు సంబంధించి తీసుకునే కీలకమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.