Jupiter combust: అస్తంగత్వ దశలోకి బృహస్పతి.. ఈ రాశుల ప్రేమ, వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలే
Jupiter combust: వృషభ రాశిలోకి ప్రవేశించిన తర్వాత బృహస్పతి అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి ప్రేమ, వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలు ఉండనున్నాయి.
Jupiter combust: దేవ గురువు బృహస్పతి మే 1న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండు రోజుల తర్వాత అంటే మే 3వ తేదీన బృహస్పతి అస్తంగత్వ దశలోకి వెళతాడు. ఒక గ్రహం అస్తమించినప్పుడు దాని ప్రభావం కొన్ని రాశుల వారి మీద ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది.
బృహస్పతి అస్తంగత్వం కొన్ని రాశుల వారి ప్రేమ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ప్రేమ సంబంధాలలో వివిధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ రాశుల జాతకులు తమ ప్రేమ, వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాటలు అదుపులో ఉంచుకోవాలి.
గురు మూఢం ఎప్పుడంటే?
వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే జాతకంలో శుక్రుడు, గురు గ్రహాల స్థానం బలంగా ఉండాలి. అయితే ఈ రెండు గ్రహాలు రోజుల వ్యవధిలోనే అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాయి. ఏప్రిల్ 28న శుక్రుడు అస్తమించబోతుండగా, బృహస్పతి మే 3న అస్తంగత్వ దశలోకి వెళతారు. ఫలితంగా శుక్ర మూఢం, గురు మూఢం ఏర్పడతాయి.
వివాహం జరిపించేందుకు గురు శుక్ర గ్రహాలు శుభ స్థానంలో ఉండడం చాలా అవసరం అప్పుడే వారి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే ఈ రెండు గ్రహాలు దహన స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. బృహస్పతి అస్తమించడం వల్ల ఏయే రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకుందాం.
వృషభ రాశి
బృహస్పతి దహనం వృషభ రాశిలోనే జరుగుతుంది. ఫలితంగా ప్రేమ జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉండబోతున్నాయి. మీకు మీ భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి ప్రతికూల ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య ఘర్షణ వాతావరణం, తగాదాలు ఏర్పడతాయి. ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగి విడిపోయే అవకాశం ఉంది. సంబంధాన్ని మెరుగుపరుచుకునేందుకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
సింహ రాశి
బృహస్పతి అస్తంగత్వం సింహ రాశి వారి ప్రేమ జీవితంలో కష్టాలను తీసుకురాబోతుంది. మీకు మీ భాగస్వామికి మధ్య అహం సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున వారు ఈ కాలంలో తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇద్దరు భాగస్వాముల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం సంక్షోభ పరిస్థితిగా మారుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, సంతోషం కొనసాగించేందుకు పరస్పర సమన్వయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో సంబంధాన్ని మధురంగా కొనసాగించేందుకు ప్రయత్నించాలి. లేదంటే ఇద్దరి మధ్య అశాంతి వాతావరణం నెలకొంటుంది.
ధనుస్సు రాశి
బృహస్పతి అస్తమించడం వల్ల ధనుస్సు రాశి వారికి మీ ప్రేమ జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కాలంలో జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గురు గ్రహ దహనం కారణంగా ప్రేమికుల మధ్య అనవసరమైన విషయాలకి తగాదాలు ఏర్పడతాయి. దీనివల్ల ప్రేమ జీవితంలో కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి.