Venus transit: అస్తంగత్వ దశలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి కెరీర్ లో ఆటంకాలు, ప్రమోషన్ రాకపోవచ్చు-venus combust in aries these zodiac signs will face problesm their career life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: అస్తంగత్వ దశలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి కెరీర్ లో ఆటంకాలు, ప్రమోషన్ రాకపోవచ్చు

Venus transit: అస్తంగత్వ దశలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి కెరీర్ లో ఆటంకాలు, ప్రమోషన్ రాకపోవచ్చు

Gunti Soundarya HT Telugu
Apr 20, 2024 10:54 AM IST

Venus transit: శుక్రుడు త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. మేష రాశిలోకి వెళ్ళిన తర్వాత అస్తంగత్వ దశలోకి వెళతాడు. దీని వల్ల కొన్ని రాశుల వాళ్ళు కెరీర్ లో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అస్తంగత్వ దశలోకి శుక్రుడు
అస్తంగత్వ దశలోకి శుక్రుడు

Venus transit: వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటి. ప్రేమ, సామరస్యం, అందం వంటి వాటికి ప్రతీకగా ఉన్నాడు. ఏప్రిల్ 25న శుక్రుడు మేష రాశి ప్రవేశం చేస్తాడు.

ఏప్రిల్ 28వ తేదీ ఉదయం మేష రాశిలో శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళతాడు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగత్వ దశలోకి వెళతాయి. అప్పుడు వాటి బలం, ప్రభావం తగ్గిపోతుంది. ఈ సమయాన్ని శుక్ర మూఢం అంటారు. మేష రాశిలో శుక్రుడు అస్తమించడం వల్ల కొన్ని రాశుల వారి కెరీర్ కి ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా శుభ కార్యాలు నిర్వహించేందుకు మంచి ముహూర్తాలు కూడా ఉండవు. వృత్తిపరమైన జీవితంలోను సమస్యలు ఎదురుకాబోతున్నాయి. శుక్రుడి కదలిక మారడం వల్ల ఏయే రాశుల వాళ్ళు నష్టపోవాల్సి వస్తుందో చూద్దాం.

మేష రాశి

శుక్రుడు మేష రాశిలోనే అస్తంగత్వ దశలోకి వెళ్లనున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ కష్టాన్ని ప్రయత్నాలను ఉన్నతాధికారులు గుర్తించకపోగా వారి నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా తీవ్ర నిరాశకు గురవుతారు. ఉద్యోగాఉలు ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఆశిస్తున్నట్టయితే వారి కోరిక నెరవేరకపోవచ్చు. ఈ సమయం అందుకు అనుకూలంగా లేదు. మీకు కోరుకున్న వస్తువులు కూడా చేతికి అందకపోవచ్చు.

వృషభం

ఈ కాలంలో మీరు ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీనియర్లు పనిలో మీకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల వారితో మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసానికి భంగం కలగవచ్చు. పనిలో అడ్డంకులు మిమ్మల్ని నిరాశ పెడతాయి. ఓపికగా ఉండాలి.

కర్కాటక రాశి

మేష రాశిలో శుక్రుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు రాకపోవచ్చు. కార్యాలయంలో, కెరీర్ లో అనిశ్చితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లను ఆకట్టుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.ఈ సమయంలో మీ ఉన్నతాధికారుల మెప్పు పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ కోసం ఇంకొంత కాలం వేచి చడాల్సి వస్తుంది. చాలా కష్టపడి పని చేసినప్పటికీ కార్యాలయంలో వచ్చే అడ్డంకులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి.

మీన రాశి

మేష రాశిలో శుక్రుడి దహనం మీన రాశి వారికి అడ్డంకులు కలిగించే సమయంగా ఉంటుంది. పనిలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాటలు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే వారి నుంచి ప్రశంసలు అందుకోలేరు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం కోల్పోతారు.

కుంభ రాశి

శుక్రుడి దహన స్థితి కుంభ రాశి వారికి వృత్తిపరమైన ఆటంకాలు కలిగిస్తుంది. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పనిలో తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి దృష్టితో, ఏకాగ్రతతో చేస్తే మంచిది. లేదంటే మీరు చేసే తప్పులకు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కెరీర్ లో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే మీరు కోరుకున్న విజయాన్ని సొంతం చేసుగలుగుతారు.

Whats_app_banner