Stress: ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఈ మంత్రాలను పఠించండి-want to live a peaceful life without stress and anxiety recite these mantras daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stress: ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఈ మంత్రాలను పఠించండి

Stress: ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఈ మంత్రాలను పఠించండి

Haritha Chappa HT Telugu
Mar 26, 2024 01:30 PM IST

Stress: ఒత్తిడితో నిండిపోయిన జీవితంలో ప్రశాంతత కోసం వెతికే వారు ఎందరో. ప్రతిరోజూ కొన్ని మంత్రాలను జపించడం ద్వారా భక్తులను తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి తగ్గించే మంత్రాలు
ఒత్తిడి తగ్గించే మంత్రాలు (pixabay)

Stress: ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీగా మారిపోయారు. ఈ బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన సాధారణమైపోయాయి. ఉద్యోగస్తులకే కాదు పరీక్షల వల్ల పిల్లలకూ ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంట్లో పనులు ఎక్కువై ఎంతో మంది మహిళలు ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆందోళన లేకుండా జీవించాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ప్రతిరోజూ ఉదయం లేచాక కొన్ని రకాల మంత్రాల జపించడం వల్ల జీవితం ఒత్తిడి రహితంగా ఉంటుంది. మీకు వీలయ్యే టైంలో వీటిని పఠించడం మర్చిపోవద్దు.

ఓం

ఓంకారం చాలా ప్రభావితమైనది. ఓం మంత్రం వల్ల మనసు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా శరీరం పైనే దృష్టి పెట్టేందుకు కేంద్రీకరిస్తుంది. అత్యంత భక్తితో ఓం జపించే వ్యక్తి చాలా స్పష్టంగా ఉంటారు. ఓం అని పలుకుతున్నప్పుడు వచ్చే రిథమిక్ శబ్ధం నాడీ వ్యవస్థను శాంతి పరుస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ధ్యాన స్థితిని ప్రేరేపిస్తుంది.

మహా మృత్యుంజయ మంత్రం

శివునికి చెందినది మహామృత్యుంజయ మంత్రం. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఇది ఒకటి. అజ్ఞానం, ప్రతికూల ఆలోచనలతో ఉన్న భక్తులు ప్రతిరోజూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే మంచిది. దేవుడు ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తాడని అంటారు. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీరు రోజువారి జీవితంలో ఉండే భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపించే వారిలో దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే హృదయంలో దైవం నిండుకుంటుందో... అప్పుడు ఆందోళన, భయం వంటివి దూరమైపోతాయి.

గాయత్రీ మంత్రం

మన దేశంలోని ఎన్నో పాఠశాలల్లో ఉదయం పూట గాయత్రీ మంత్రాన్ని పిల్లల చేత జపించేలా చేస్తారు. సంస్కృత భాషా తరగతుల్లో కూడా గాయత్రి మంత్రాన్ని కచ్చితంగా జపిస్తారు. గాయత్రీ మంత్రానికి దైవిక శక్తి ఎక్కువ. గాయత్రీ మంత్రం ‘ఓం’ తో మొదలవుతుంది. దీన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. తెలివితేటలు పెరుగుతాయి. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతర్గత శక్తి అభివృద్ధి చెందుతుంది.

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసాను సాధారణంగా ఎక్కువమంది మంగళవారం పూట మాత్రమే చదువుతారు. నిజానికి ఇది ప్రతిరోజూ చదవాల్సిందే. హనుమాన్ చాలీసా చదివే వారిలో భక్తితో పాటు ధైర్యం, బలం కూడా పెరుగుతుంది. హనుమంతుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడని నమ్ముతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపద సమయంలో రక్షణ దొరుకుతుందని మార్గదర్శకత్వం లభిస్తుందని ఎంతోమంది నమ్మకం. ఈ హనుమాన్ చాలీసా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఎలాంటి ఒత్తిడి, భయాలు లేకుండా తగ్గిస్తుంది.

ఓం నమశ్శివాయ

శివునికి అంకితం చేసిన మరో శక్తివంతమైన మంత్రం ఓం నమశ్శివాయ. అంటే అర్థం ‘నేను శివునికి, అతని శక్తికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం. దీన్ని జపించడం వల్ల భయాలు, ఒత్తిడి, ఆందోళన వంటివి తొలగిపోతాయి. మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో హృదయంతో జపించాలి. ఒకసారి రెండుసార్లు కాదు ఎక్కువసార్లు జపించడం వల్ల ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. లోతైన ధ్యాన స్థితిలో ఓం నమశివాయ పఠించినప్పుడు ఆ మంత్రంలో నిక్షిప్తమైన శక్తి, మనసును శుద్ధి చేస్తుంది. ఒత్తిడి ప్రేరేపిత లక్షణాలను తగ్గిస్తుంది.

టాపిక్