Trigrahi yogam: మీన రాశిలో గ్రహాల జాతర.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు-mercury rahu venus conjunction in meena rashi after 50 years create trigrahi yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yogam: మీన రాశిలో గ్రహాల జాతర.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు

Trigrahi yogam: మీన రాశిలో గ్రహాల జాతర.. ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు

Gunti Soundarya HT Telugu
Apr 15, 2024 01:05 PM IST

Trigrahi yogam: మీన రాశిలో సుమారు 50 సంవత్సరాల తర్వాత త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. ధనవంతులు అవుతారు.

త్రిగ్రాహి యోగం
త్రిగ్రాహి యోగం (pixabay)

Trigrahi yogam: నవగ్రహాలు సమయాన్ని బట్టి తమ రాశిని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల రాశి మార్పు కారణంగా మరొక గ్రహంతో సంయోగం జరుగుతుంది. గ్రహాల రాకుమారుడు గా భావించే బుధుడు సంపదకు కారకుడిగా భావించే శుక్రుడు కలిసి ఒకే రాశిలో సంచరిస్తున్నారు.

ఈ రెండు గ్రహాలు మీన రాశిలో కలుసుకున్నాయి. ఇప్పటికే అంతు చిక్కని గ్రహంగా పరిగణించే రాహువు ఇదే గ్రహంలో ఉన్నాడు. మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడింది.

సుమారు 50 సంవత్సరాల తర్వాత మీన రాశిలో ఈ మూడు గ్రహాల అరుదైన కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా శుక్రుడు, రాహువు కలసి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. మీన రాశిలో ఈ రెండు రాజయోగాల ప్రభావంతో కొన్ని రాశులకు శుభదాయకంగా ఉండనుంది.

మిథున రాశి

త్రిగ్రాహి యోగం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మూడు గ్రహాల శుభ ప్రభావంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మూడు గ్రహాల కలయిక వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థితికి చేరుకుంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు.

కుంభ రాశి

మీన రాశిలో మూడు గ్రహాల ప్రవేశం వల్ల కుంభ రాశి వారికి చాలా ప్రయోజనాలు అందుతాయి. త్రిగ్రాహి యోగం వల్ల వ్యాపారవేత్తలు లాభదాయక ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సమయంలో వ్యాపార పరిస్థితి బాగుంటుంది. డబ్బు చేతికి అందుతుంది. నూతన ఉద్యోగార్ధులకు శుభవార్తలు అందుతాయి.

మీన రాశి

మీన రాశిలోనే బుధుడు, శుక్రుడు, రాహువు కలయిక జరుగుతుంది. ఫలితంగా ఈ రాశిన వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో నిలిచిపోయిన పనులు పొందుకుంటాయి. ప్రేమి జీవితంలో శృంగారాన్ని ఆస్వాదిస్తారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టేందుకు మంచిగా ఉంటుంది.

త్రిగ్రాహి యోగంతో పాటు మీన రాశిలో మరొక యోగం కూడా ఏర్పడుతుంది. శుక్ర రాహు కలయిక వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావంతో నాలుగు రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి

శుక్రుడు, రాహువు కలయిక వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు.

సింహం

విపరీత రాజయోగం ప్రభావంతో సింహ రాశి వాళ్ళు జీవితంలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

వృశ్చిక రాశి

శుక్రుడు, రాహువు కలసి ఏప్రిల్ 25 వరకు వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు అందిస్తారు. కుటుంబ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ధన లాభం కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.

మీన రాశి

మీన రాశి వారికి విపరీత రాజయోగం, త్రిగ్రాహి యోగం ప్రభావంతో ఉద్యోగ వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి మద్దతు మీకు ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగి వృద్ధి పథంలో నడుస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది.

WhatsApp channel