మేషరాశిలో అస్తమించిన బుధుడు.. ఈ మూడు రాశుల వారికి ఇబ్బందులు! జాగ్రత్తగా ఉండాలి-budh asta 2024 mercury will set in aries these three signs will be affected badly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మేషరాశిలో అస్తమించిన బుధుడు.. ఈ మూడు రాశుల వారికి ఇబ్బందులు! జాగ్రత్తగా ఉండాలి

మేషరాశిలో అస్తమించిన బుధుడు.. ఈ మూడు రాశుల వారికి ఇబ్బందులు! జాగ్రత్తగా ఉండాలి

Apr 08, 2024, 05:58 PM IST Chatakonda Krishna Prakash
Apr 08, 2024, 05:58 PM , IST

Budh Asta 2024: బుధుడు.. మేషరాశిలో అస్తమించాడు. ఈ బుధ అస్తమయ కాలంలో మూడు రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ వివరాలు ఇవే..

తొమ్మిది గ్రహాల్లో అతిముఖ్యమైన బుధుడిని తెలితేటలకు, ప్రతిభకు, నైపుణ్యాలకు ప్రతినిధిగా భావిస్తారు. జాతకంలో బుధుడి శక్తి కారణంగా ప్రజలకు ప్రయోజనాలు జరుగుతాయి. అయితే, బుధ సంచారంలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. 

(1 / 5)

ఏప్రిల్ 4వ తేదీన బుధుడు.. మేష రాశిలో అస్తమించాడు. మే 1 వరకు 26 రోజుల పాటు ఇది ఉండనుంది. బుధ సంచారం వల్ల ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అవరోధాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి.  

(2 / 5)

వృషభ రాశి: బుధుడి వల్ల ఈకాలంలో వృషభ రాశివారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వారి వృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఆఫీస్‍లో పని చేసేటప్పుడు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటారు. తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కొందరు ఉద్యోగాలను కూడా కోల్పోతారు. బుధుడి కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బుధ అస్తమయ కాలంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా ముఖ్యం. 

(3 / 5)

మిధున రాశి: తమకు అధిపతి అయిన బుధుడు అస్తమించడం మిథునరాశి వారికి మంచిది కాదు. ఈ కాలంలో ఆ రాశివారు ప్రతికూలతను ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. శ్రమ వృథా అవుతుంది. బుధుడు సహకరించకపోవటంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అందుకే ఈ సమయంలో వృతిపరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమయంలో ఈ రాశివారు చేసే కొన్ని పనులు ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

(4 / 5)

కన్యా రాశి: కన్యా రాశి వారికి బుధుడి వాతావరణం అంత మంచిది కాదు. అధికారులు ఆదేశించిన పనులను మీరు పూర్తిగా చేయలేకపోవచ్చు. కార్యాలయాల్లో పని భారం పెరగడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. కొత్తగా కొందరు శత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో బుధుడి అస్తమయం వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీలో తగ్గుతుంది. ఒత్తిడి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కష్టాలు, అసంతృప్తి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ కాలంలో కన్యారాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు