Vipareeta raja yogam: 50 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి సంపద రెట్టింపు కాబోతుంది
Vipareeta raja yogam: సుమారు 50 ఏళ్ల తర్వాత రాహు, శుక్ర కలయికతో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వాళ్ళు విపరీతమైన ప్రయోజనాలు అందుకోబోతున్నారు. అదృష్టం అండతో సంపద పెరగబోతుంది.
Vipareeta raja yogam: సంపదను ప్రసాదించే శుక్రుడు మార్చి 31న బృహస్పతి చెందిన మీనా రాశిలో ప్రవేశించాడు. ఇప్పటికే అక్కడ రాహువు సంచరిస్తున్నాడు. దీంతో మీన రాశిలో రాహు, శుక్ర కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావంతో మాలవ్య రాజయోగంతో పాటు విపరీత రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక ఏప్రిల్ 24 వరకు ఉంటుంది.
50 సంవత్సరాల తర్వాత ఈ విపరీత రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల వారి మీద ఉంటుంది. ఈ యోగం సంపద, శ్రేయస్సుని ఇస్తుంది. విపరీత రాజయోగం జాతకంలో ఉంటే సంపద, శ్రేయస్సు, గౌరవం పొందుతారు. దీని ప్రభావంతో చిన్న వయసులోనే త్వరగా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. హోదా పెరుగుతుంది.
జాతకంలో ఆరు, ఎనిమిది, పన్నెండు గ్రహాల అధిపతుల్లో ఒకరు మిగిలిన రెండు గ్రహాల్లోని ఏదో ఒక ప్రదేశంలో సంచరించినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం అద్భుతమైనదిగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావంతో ఆర్థికంగా బలపడతారు. ఆదాయ మార్గాలు కొత్తవి తారసపడతాయి. శుక్ర, రాహు గ్రహాల కలయిక దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఐదు దశాబ్ధాలకు ఒకసారి వచ్చే విపరీత రాజయోగం వల్ల ఏ రాశుల వారికి సంపద పెరుగుతుందో చూద్దాం.
కర్కాటక రాశి
శుక్ర, రాహు కలయిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులు డేటింగ్ కి వెళ్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు పొందుతారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. ధన ప్రవాహం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మిథున రాశి
పని చేసే ప్రదేశంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి ఒప్పందాన్ని పొందుతారు. ఇది లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయంలో లాభాలు గడిస్తారు. జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. మతపరమైన ప్రదేశాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాల వల్ల భారీ ధనలాభం పొందుతారు. వృత్తి జీవితంలో ఊహించని విధంగా గొప్ప విజయాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు మంచి ఆదాయాన్ని సమకూరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి కార్యాలు తలపెట్టినా అందులో వంద శాతం విజయం సాధిస్తారు. చిన్న వయసులోనే పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి విపరీత రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. శృంగార జీవితం మధురంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది. కెరిర్ లో కొత్త పనులు దొరుకుతాయి. వృత్తిపరంగా ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. అన్ని పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. జీవితంలోని ప్రతి అంశంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిలో నూతన విజయాలు పొందుతారు. దీర్ఘకాలంగా ఆగిపోతున్న పనులు ఈ సమయంలో పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.