Foods For Anxiety : ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి
Foods For Anxiety : ఒత్తిడి, ఆందోళన అనేది ఈ మధ్యకాలంలో సాధారణమైపోయింది. కానీ దీని నుంచి బయటపడేందుకు మనం తీసుకునే ఆహారాలు కూడా పని చేస్తాయి.
ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే సాధారణ సమస్య. కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి ప్రపంచంలో ప్రతి క్షణం ఒత్తిడి పెరుగుతోంది. ఇల్లు అయినా, ఆఫీసు అయినా ఒత్తిడితో కూడిన జీవితం సర్వసాధారణం. ఎల్లప్పుడూ ఒత్తిడిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది ఆందోళనకు దారితీస్తుంది.
ముఖ్యంగా మనం ఒక్క నిమిషం మొబైల్, ఇంటర్నెట్ లేకుండా ఉంటే ఒకరకమైన ఆందోళన ఏర్పడి ఒత్తిడి పెరుగుతుంది. ఈ గాడ్జెట్‌ల గురించి మనం ఎంత ఎక్కువ ఫిర్యాదు చేస్తే అంత మంచిది. అయితే ఈ గాడ్జెట్‌లకు దూరంగా ఉంటే కొంత మంది ఆందోళన చెందుతారు. ఈ విషయమే కాదు.. ఇతర సమస్యలతోనూ ఆందోళన అనేది సహజం. దీని నుంచి బయటపడేందుకు మీరు కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ఆహార విధానాలు ఉన్నాయి.
మనం తినే ఆహారం మన ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఆహారంపై దృష్టి సారిస్తే ఆందోళన తగ్గుతుంది. అనేక రకాల ఆహారాలు కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడింది.
కొన్నిసార్లు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, మనం లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తాం. అది నేరుగా మన మనస్సును ప్రభావితం చేస్తుంది. మనం ఆత్రుతగా ఉన్నప్పుడు మన దృక్పథం భిన్నంగా ఉంటుంది. ఒత్తిడికి గురైనప్పుడు కూడా మన ఫీలింగ్, స్థితి వేరుగా ఉంటుంది. ఎవరికీ ఏం చెప్పలేం.. అలాగని ఏం చెప్పకుండా ఉండలేం. అదోరకమైన మానసిక స్థితిలోకి వెళ్లిపోతాం. ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆందోళనను తగ్గించడానికి మీరు బెర్రీలను తినవచ్చు. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ బెర్రీలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు బాదంపప్పులో చక్కెర, జింక్ పుష్కలంగా ఉన్నందున తరచూ బాదంపప్పును తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. ఇది కాకుండా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఆకుపచ్చ, పసుపు, నారింజ కూరగాయలను రోజూ తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ స్రవిస్తుంది. ఈ సెరోటోనిన్ మన శరీరంలో ఆందోళన, ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. అంటే మనకు ఆందోళనగా అనిపించినప్పుడు విడుదలయ్యే హార్మోన్లు తగ్గిపోతాయి. ఈ సెరోటోనిన్ కంటెంట్ మాంసంలో కూడా కనిపిస్తుంది.
ఇది కాకుండా సులభంగా లభించే ఓట్ మీల్ మన ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే హార్మోన్లను కూడా నియంత్రిస్తుంది. ఓట్స్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తుంది. సెరోటోనిన్ ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. ఇది ఏ పరిస్థితిలోనైనా మీ కోపం, ఆందోళన, ఒత్తిడిని సమర్థవంతంగా నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడి అలాగే కొనసాగితే మానసిక సమస్యలు వస్తాయి. తర్వాత ఇబ్బందుల్లో పడతారు.